గుడి మెట్లపై మెగాస్టార్ హీరోయిన్ భిక్షాటన
అందులో కొందరు భిక్షాటన కూడా చేసిన వారున్నారు. ఇప్పుడు తాజాగా ఓ సీనియర్ హీరోయిన్ గుడిమెట్లపై భిక్షాటన చేస్తూ కనిపించడం ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది.
By: Tupaki Desk | 20 July 2025 3:00 AM ISTసినీ ఇండస్ట్రీలో ఇవాళ స్టార్లుగా ఉన్నవాళ్లే రేపు జీరోలుగా మారతారు. ఇవాళ జీరోలుగా ఉన్నవాళ్లే రేపు స్టార్లుగా మారతారు. ఒక్క సక్సెస్ వారి లైఫ్‌నే మార్చేస్తుంది. అందుకే ఇండస్ట్రీలోని నటీనటుల జీవితాలు ఎప్పుడెలా మలుపు తిరుగుతాయో ఎవరూ చెప్పలేం అంటుంటారు. స్టార్లుగా ఉండి కోట్లు సంపాదించి లగ్జరీగా బతికిన ఎంతో మంది కూడా వారి ఆఖరి రోజుల్లో పూట గడవడం కష్టంగా మారి లైఫ్ ను ముగించారు.
అందులో కొందరు భిక్షాటన కూడా చేసిన వారున్నారు. ఇప్పుడు తాజాగా ఓ సీనియర్ హీరోయిన్ గుడిమెట్లపై భిక్షాటన చేస్తూ కనిపించడం ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. అయితే ఆమె భిక్షాటన చేయడానికి కారణం తన ఆర్థిక పరిస్థితి కాదు, ఆ నటికి దేవునిపై ఉన్న నమ్మకం, భక్తి కారణంగా ఆమె భిక్షాటన చేశారు. ఆ నటి మరెవరో కాదు 80వ దశాబ్దంలో తన యాక్టింగ్, అందం, డ్యాన్సులతో కుర్రాళ్ల మతిపోగొట్టిన నళినీ.
తమిళనాడుకు చెందిన నళినీకి మొదటి నుంచి భక్తి, ఆధ్యాత్మికత ఎక్కువ. పూజలు, వ్రతాలు, నోములు అంటూ ఏవొకటి చేస్తూనే ఉండేవారు. అలాంటి ఆమె శుక్రవారం చెన్నైలోని తిరువేర్కడులో ఉన్న దేవీ కరుమారి అమ్మవారి గుడి ఎదుట భిక్షాటన చేస్తూ కనిపించారు. అమ్మవారు తనకు కలలో కనిపించి నా కోసం నువ్వేం చేయగలవని అడిగారని, దాంతో ఏం చేయాలో తెలియక కొంగుపట్టి అడుక్కుంటున్నానని మీడియాకు తెలిపారు నళిని.
భిక్షాటన ద్వారా వచ్చిన కానుకలను కూడా అమ్మవారికే సమర్పించానని చెప్పిన నళినీ 1981లో చిరంజీవి- రజినీకాంత్ నటించిన రాణువ వీరన్ అనే సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత చిరంజీవి, రజినీకాంత్, శోభన్ బాబుతో సహా ఎంతోమంది స్టార్ హీరోల సరసన హీరోయిన్ గా నటించారు. చిన్న వయసులోనే స్టార్‌డమ్ రావడంతో దాన్నెలా కాపాడుకోవాలో అర్థం కాని నళిని, అవుట్‌డోర్ షూట్స్ అంటే భయం కారణంగా ఎన్నో పెద్ద సినిమాలను వదులుకున్నారు. హీరోయిన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో సినిమాల్లో నటించిన ఆమె ప్రస్తుతం తమిళ సీరియల్స్ లో నటిస్తూ బిజీగా ఉన్నారు.
