Begin typing your search above and press return to search.

పిక్‌టాక్‌ : పబ్లిసిటీ కోసం మరీ ఇంత బోల్డ్‌గానా..!

బాలీవుడ్‌ ముద్దుగుమ్మ కంగనా శర్మ రెగ్యులర్‌గా తన బోల్డ్‌ లుక్ కారణంగా వార్తల్లో నిలుస్తూ ఉంటుంది.

By:  Tupaki Desk   |   5 April 2025 2:40 PM IST
Actress Kangana Sharma Latest Photo
X

బాలీవుడ్‌ ముద్దుగుమ్మ కంగనా శర్మ రెగ్యులర్‌గా తన బోల్డ్‌ లుక్ కారణంగా వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. సాధారణంగా హీరోయిన్స్ స్కిన్‌ షో చేస్తేనే మీడియా దృష్టిని ఆకర్షించడం, సినీ జనాల దృష్టిని ఆకర్షించడం జరుగుతుంది. అందుకే కాస్త బోల్డ్‌గా ఔట్ ఫిట్‌ను ధరించి కనిపిస్తూ ఉంటారు. హీరోయిన్స్‌కి అలా కనిపించడం అనేది తప్పని విషయం. ఈ పోటీ ప్రపంచంలో స్కిన్‌ షో చేయడం ద్వారానే నిలదొక్కుకోగలరు. తప్పని పరిస్థితుల్లో చాలా మంది హీరోయిన్స్‌ స్కిన్‌ షో చేస్తున్నామని చెబుతూ ఉంటారు. అయితే కొందరు మాత్రం శృతి మించి మరీ స్కిన్‌ షో చేస్తూ ఉంటారు. ఇది కొందరు హీరోయిన్స్ విషయంలో శృతి మించడంతో విమర్శలు ఎదుర్కొన్న సందర్భాలు ఉన్నాయి.

కంగనా శర్మ పుట్టిన రోజు వేడుక ఇటీవల ముంబైలో జరిగింది. సాధారణంగా ఫోటో షూట్స్‌కి ఒకింత స్కిన్‌ షో చేసినా పర్వాలేదు. కానీ బర్త్‌డే వేడుక పబ్లిక్‌గా జరుగుతూ ఉంది. అయినా కూడా కంగనా శర్మ శృతి మించిన షో తో అందరినీ సర్‌ప్రైజ్‌ చేసింది. ఆమె ఔట్‌ విషయంలో చాలా మంది విమర్శలు గుప్పించారు. బర్త్ డే కేక్‌ కట్‌ చేసిన సమయంలో గోల్డెన్‌ కలర్‌ గౌనులో కనిపించింది. బోల్డ్‌ లుక్‌ తో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. స్టైలిష్‌ బ్రాస్‌లెట్‌, ఉంగరాలు, నెక్‌ పీస్‌, చెవి పోగులతో చాలా అందంగా కంగనా శర్మ కనిపించింది. కానీ ఆమె ఔట్ ఫిట్‌ విషయంలో మాత్రం చాలా బోల్డ్‌గా కనిపించడంతో విమర్శలు ఎదుర్కొంటోంది.

సినిమా ఇండస్ట్రీలో ఆఫర్ల కోసం స్కిన్‌ షో చేయడం తప్పదని చాలా మంది అంటూ ఉంటారు. కానీ మరీ ఇంత బోల్డ్‌గా స్కిన్‌ షో చేయాల్సింది కాదని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి స్కిన్‌ షో ఫోటోల కారణంగా ఆమెపై గౌరవం తగ్గుతుందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉంటే, మరి కొందరు మాత్రం ఆమెను సమర్ధిస్తున్నారు. గ్లామర్‌ ప్రపంచంలో ఉన్న పోటీకి తగ్గట్లుగానే ఆమె కనిపించింది. అందులో తప్పేం లేదు, ఆమె చేసింది పెద్ద తప్పేం కాదు అన్నట్టుగా ఆమెను సమర్ధిస్తున్న వారు చాలా మంది ఉన్నారు.

మ్యూజిక్‌ వీడియోలతో కెరీర్‌ను ఆరంభించిన ఈమె మెల్ల మెల్లగా వెబ్‌ సిరీస్‌ల్లో నటించే అవకాశాలు దక్కించుకుంది. ఈ మధ్య కాలంలో సినిమా ఇండస్ట్రీ నుంచి కూడా ఆఫర్లు సొంతం చేసుకుంటున్నట్లు సమాచారం అందుతోంది. ఆకట్టుకునే అందంతో పాటు, మంచి ఫిజిక్‌ ఈమె సొంతం కావడంతో కాస్త ఆలస్యం అయినా సినిమా ఇండస్ట్రీ నుంచి ఈమెకు ఆఫర్లు వస్తున్నాయి. ముందు ముందు కూడా ఈమె బాలీవుడ్‌లో బిజీ నటిగా ఆఫర్లు దక్కించుకునే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.