Begin typing your search above and press return to search.

పిక్‌టాక్‌ : పింక్‌ బికినీలో మజాకా బ్యూటీని చూస్తారా..!

నాగార్జున హీరోగా నటించిన 'మన్మధుడు' సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయిన ముద్దుగుమ్మ అన్షు.

By:  Tupaki Desk   |   20 July 2025 12:58 PM IST
పిక్‌టాక్‌ : పింక్‌ బికినీలో మజాకా బ్యూటీని చూస్తారా..!
X

నాగార్జున హీరోగా నటించిన 'మన్మధుడు' సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయిన ముద్దుగుమ్మ అన్షు. 2002 సంవత్సరంలో మన్మధుడు సినిమాలో నటించిన అన్షు తదుపరి సినిమాను ప్రభాస్‌తో చేసింది. ప్రభాస్ హీరోగా నటించిన రాఘవేంద్ర సినిమాలో అన్షు నటించి మెప్పించింది. చేసిన సినిమాలు తక్కువే కానీ ఎక్కువ కాలం గుర్తుండి పోయే విధంగా అన్షు తనదైన ముద్ర వేసింది. అన్షు హీరోయిన్‌గా చివరి సారి 2004లో తమిళ మూవీ జై లో కనిపించింది. రెండు సంవత్సరాల్లో నాలుగు సినిమాలు చేసిన అన్షు విదేశాల్లో సెటిల్ అయింది. దాదాపు ఇరవై ఏళ్ల తర్వాత మళ్లీ తెలుగు సినిమా మజాకాతో అన్షు రీ ఎంట్రీ ఇచ్చి అందరి దృష్టిని ఆకర్షించిన విషయం తెల్సిందే.

మజాకా సినిమాలో ఆంటీ పాత్రలో కనిపించడం ద్వారా ముందు ముందు క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా నటించేందుకు సిద్ధం అన్నట్లుగా హింట్ ఇచ్చింది. సోషల్‌ మీడియాలో ఈమె షేర్‌ చేస్తున్న ఫోటోలు, వీడియోలు ఎప్పటికప్పుడు వైరల్‌ అవుతూ ఉంటాయి. తాజాగా ఈమె బికినీ ఫోటోలను షేర్ చేయడంతో చూపు తిప్పనివ్వడం లేదు. నాలుగు పదుల వయసులో అన్షు ఇలా షాక్ ఇచ్చింది ఏంటి అంటూ చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. అన్షు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా సినిమాలు చేయాలని చాలా మంది అనుకుంటున్నారు. కానీ ఈమె మాత్రం హీరోయిన్‌ పాత్రల కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లుగా బికినీ ఫోటోలను షేర్‌ చేసింది ఏంటి అని షాక్‌ అవుతున్నారు.

పింక్‌ బికినీలో అన్షు ను చూస్తూ ఉంటే చూపు తిప్పలేక పోతున్నామని చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. ఇంతటి అందం ఇండస్ట్రీలో సరైన గుర్తింపు రాకముందే వెళ్లి పోవడం విచారకరం అని కొందరు అంటూ ఉంటే, అప్పట్లో అన్షు కెరీర్‌ కొనసాగించి ఉంటే ఖచ్చితంగా ఇప్పటి వరకు వరుసగా సినిమాలు చేస్తూనే ఉండేదని, సుదీర్ఘ కాలం పాటు టాప్‌ స్టార్‌ హీరోయిన్‌గా సినిమాలు చేస్తూనే ఉండేదేమో అని కొందరు అంటున్నారు. మొత్తానికి అన్షు అందమైన ఈ బికినీ ఫోటోలను చాలా మంది తెగ పొగిడేస్తూ ఉంటే, కొందరు మాత్రం వయసుకు తగ్గ ఫోటోలను షేర్‌ చేస్తే బాగుంటుంది కదా అని కొందరు సోషల్‌ మీడియా ద్వారా ఆమెను సున్నితంగా ట్రోల్‌ చేస్తూ ఉన్నారు.

యునైటెడ్‌ కింగ్‌ డమ్‌లోని లండన్‌లో పుట్టిన అన్షు అక్కడే సచిన్‌ సగ్గర్‌ను వివాహం చేసుకుంది. వీరికి ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. సినిమాల నుంచి తప్పుకుని లండన్‌ వెళ్లిన తర్వాత కొన్నాళ్ల పాటు సైకాలజిస్ట్‌గా చేసిన అన్షు మళ్లీ సినిమాల్లో నటించాలనే ఆసక్తితో మజాకా సినిమాలో నటించింది. ఈ మధ్య కాలంలో సీనియర్‌ హీరోయిన్స్‌కి ఎక్కువగా క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా సినిమాలు వస్తున్నాయి. అందుకే ఈమె రీ ఎంట్రీ ఇచ్చిన సమయంలో ఖచ్చితంగా ఎక్కువ సినిమా ఆఫర్లు వస్తాయని అన్నారు. ప్రస్తుతం అన్షు వరుసగా కథలు వింటున్నట్లు వార్తలు వస్తున్నాయి. త్వరలోనే ఈమె బ్యాక్ టు బ్యాక్‌ సినిమాలతో వస్తుందేమో చూడాలి.