Begin typing your search above and press return to search.

పిక్ టాక్ : నాజూకు నడుముతో లవ్లీ అందాల జాతర

2012 సంవత్సరంలో ఆది సాయి కుమార్ హీరోగా నటించిన లవ్లీ సినిమా తో హీరోయిన్ గా పరిచయం అయిన ముద్దుగుమ్మ శాన్వీ శ్రీవాస్తవ.

By:  Tupaki Desk   |   9 Nov 2023 11:55 AM GMT
పిక్ టాక్ : నాజూకు నడుముతో లవ్లీ అందాల జాతర
X

2012 సంవత్సరంలో ఆది సాయి కుమార్ హీరోగా నటించిన లవ్లీ సినిమా తో హీరోయిన్ గా పరిచయం అయిన ముద్దుగుమ్మ శాన్వీ శ్రీవాస్తవ. ఈ అమ్మడు మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతో పాటు, ప్రేక్షకుల్లో మంచి గుర్తింపును దక్కించుకుంది. బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటించి కొన్నాళ్ల పాటు బిజీ హీరోయిన్‌ గా నిలిచింది.


తెలుగు లో వరుసగా ఫ్లాప్స్ పడటంతో ప్యార్ మే పడిపోయానే సినిమా తర్వాత కనిపించకుండా పోయింది. తెలుగు లో దక్కని విజయాలను కన్నడంలో ఈ అమ్మడు సొంతం చేసుకుంది. 2015 నుంచి వరుసగా సినిమాలు చేసుకుంటూ కన్నడంలో మంచి విజయాలను దక్కించుకుంటూ నాలుగు అయిదు సంవత్సరాల పాటు సక్సెస్ ఫుల్‌ హీరోయిన్‌ గా దూసుకు పోయింది.


ఇప్పుడు కూడా కన్నడ మరియు మరాఠి సినిమాలతో బిజీగా ఉన్న ఈ అమ్మడు సోషల్‌ మీడియాలో రెగ్యులర్‌ గా హాట్‌ ఫోటోలను షేర్‌ చేస్తూ ఉంటుంది. తెలుగు సినిమాల్లో నటించి చాలా సంవత్సరాలు అయినా కూడా ఈమె హాట్ ఫోటోలు మరియు వీడియోలు రెగ్యులర్‌ గా తెలుగు మీడియాలో వైరల్‌ అవుతూనే ఉంటాయి.


తాజాగా నడుము నాభి అందాలను చూపిస్తూ ఇచ్చిన ఫోటో ఫోజ్ కి అంతా కూడా గుండె జారి గల్లంతయ్యిందే అంటున్నారు. ఈ రేంజ్ లో అందంగా, అణుకువగా ఉన్న ముద్దుగుమ్మ శాన్వీ శ్రీవాస్తవ కి ఎందుకు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఆఫర్లు రావడం లేదు అంటూ నెటిజన్స్ కొందరు ప్రశ్నిస్తున్నారు.

ఇదే రేంజ్ లో అందాలను చూపిస్తే కచ్చితంగా ముందు ముందు అయినా టాలీవుడ్ నుంచి పిలుపు వస్తుందేమో అంటూ నెటిజన్స్‌ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇండస్ట్రీలో అడుగు పెట్టి పదేళ్లు దాటినా కూడా శాన్వీ యొక్క అందం ఏమాత్రం తగ్గలేదు. పై పెచ్చు పెరిగింది అంటూ కామెంట్స్ వస్తున్నాయి