Begin typing your search above and press return to search.

చీర క‌ట్టిన జ‌పాన్ బ్యూటీ!

అక్క‌డా చాలా గ్యాప్ త‌ర్వాత వ‌చ్చిన అవ‌కాశం. తెలుగు ఛాన్సులు లాగే కోలీవుడ్ లో కూడా అడ‌పాద‌డ‌పా అవ‌కాశాలు త‌ప్ప‌! వేగంగా సినిమాలు చేస్తోన్న వైనం క‌నిపించ‌లేదు.

By:  Tupaki Desk   |   6 Nov 2023 6:46 AM GMT
చీర క‌ట్టిన జ‌పాన్ బ్యూటీ!
X

అనుఇమ్మాన్యుయేల్ కెరీర్ ఆరంభంలో ఉన్నంత ఊపులో ఇప్పుడు లేద‌న్న సంగ‌తి తెలిసిందే. త‌న‌దాకా అవ‌కాశాలు వ‌స్తే చేయ‌డం త‌ప్ప‌! అమ్మ‌డి ప్ర‌య‌త్నాలు పెద్ద‌గా క‌నిపించ‌లేదు. దీంతో కొన్నాళ్ల‌గా టాలీవుడ్ కి దూరంగా ఉంటూ కోలీవుడ్ లో తిష్ట వేసింది. అమ్మ‌డు మ‌కాం చెన్నైకి మార్చేసి అక్క‌డే ప్ర‌య‌త్నాలు చేస్తుంది. ఈ నేప‌థ్యంలో కార్తీ స‌ర‌స‌న `జ‌పాన్` చిత్రంలో న‌టించే అవ‌కాశం ఒడిసి ప‌ట్టుకుంది.


అక్క‌డా చాలా గ్యాప్ త‌ర్వాత వ‌చ్చిన అవ‌కాశం. తెలుగు ఛాన్సులు లాగే కోలీవుడ్ లో కూడా అడ‌పాద‌డ‌పా అవ‌కాశాలు త‌ప్ప‌! వేగంగా సినిమాలు చేస్తోన్న వైనం క‌నిపించ‌లేదు. దీంతో జపాన్ సినిమా అమ్మ‌డి కెరీర్ కి కీల‌కంగా మారింది. ఈసినిమా రిలీజ్ అయి హిట్ అయితే కొత్త అవ‌కాశాల‌కు స్కోప్ ఉంటుంది. లేదంటే క‌ష్ట‌మేనే నెగిటివ్ క‌థ‌నాలు కోలీవుడ్ లో మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. ఇక సోష‌ల్ మీడియాలోనూ అమ్మ‌డు ఈ మ‌ధ్య కాలంలో పెద్ద‌గా యాక్టివ్ గా ఉన్న‌ట్లు క‌నిపించ‌లేదు.

తెలుగు సినిమాలు చేసినంత కాలం ఇన్ స్టాలో ఆక‌ర్షించేది. కానీ ఇప్పుడా మెరుపులు బాగా త‌గ్గాయి. తాజాగా సంప్ర‌దాయ చీరందంలో మెరుస్తోన్న ఓ ఫోటోని షేర్ చేసింది. ముదురు గులాబీ వ‌ర్ణం చీర‌లో అమ్మ‌డు త‌ళ త‌ళలాడుతోంది. మ్యాచింగ్ స్లీవ్ లెస్ బ్లౌజ్ ధ‌రించింది. అమ్మ‌డు ఎంపిక చేసుకున్న చెవి బులాక‌లు.. యాక్స‌రసీస్ ట్రెండీగా ఉన్నాయి. ప్ర‌స్తుతం ఈ ఫోటో అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారింది.

అను అభిమానులు కామెంట్ల‌తో అభిమానం కురిపిస్తున్నారు. ఇక అను బ్యూటీలో చాలా మార్పులు క‌నిపిస్తు న్నాయి. బాగా బ‌క్క ప‌ల‌చ‌గా స‌న్న‌జాజి సోయ‌గంలా త‌యారైంది. ఇంత‌కుముందు ఔట్ ఫిట్స్ లో కాస్త చ‌బ్బీగా క‌నిపించేది. కానీ శ‌రీరంలో ఇప్పుడెక్క‌డా ప్యాట్ క‌నిపించ‌లేదు. దీంతో చీరని చుట్టిన‌ట్లు ఉంది త‌ప్ప ..ఆ బ్యూటీ క‌నిపించలేదు