Begin typing your search above and press return to search.

పిక్ టాక్‌ : కేక్‌ తో ఊరిస్తూ కవ్విస్తోన్న హాట్ బ్యూటీ

సుమంత్ హీరోగా వచ్చిన మళ్లీ రావా సినిమా తో హీరోయిన్ గా పరిచయం అయిన ముద్దుగుమ్మ ఆకాంక్ష సింగ్‌.

By:  Tupaki Desk   |   6 Nov 2023 5:30 PM GMT
పిక్ టాక్‌ : కేక్‌ తో ఊరిస్తూ కవ్విస్తోన్న హాట్ బ్యూటీ
X

సుమంత్ హీరోగా వచ్చిన మళ్లీ రావా సినిమా తో హీరోయిన్ గా పరిచయం అయిన ముద్దుగుమ్మ ఆకాంక్ష సింగ్‌. ఈ అమ్మడు తెలుగు లో మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించి మెప్పించింది. ఆ వెంటనే దేవదాస్ సినిమాలో నటించింది. అయితే ఆ సినిమా నిరాశ పరచడం తో ఆఫర్లు ఆశించిన స్థాయిలో రాలేదు.


తెలుగు లో చిన్న హీరోల సరసన వచ్చిన ఆఫర్లను తిరష్కరించిన ఆకాంక్ష సింగ్‌ హిందీ మరియు కన్నడ సినిమాల వైపు వెళ్లింది. అక్కడ అడపా దడపా సినిమాల్లో నటించింది. ఇప్పటికి కూడా ఈ అమ్మడు అడపా దడపా సినిమాల్లో నటిస్తూ కెరీర్‌ ను నెట్టుకు వస్తోంది. అయితే ఈ అమ్మడి అందానికి వస్తున్న ఆఫర్లకు సంబంధం లేదు అన్నట్లుగా ఉందని నెటిజన్స్ అభిప్రాయం.

ఆ మాట నిజమే అన్నట్లుగా నిరూపించే విధంగా ఆకాంక్ష సింగ్‌ ఈ ఫోటోను షేర్‌ చేసి నెటిజన్స్ కన్నుల విందు చేసింది. కేక్ ని చేతిలో పట్టుకుని ఊరిస్తున్నట్లుగానే తన అందంతో కూడా ఆకాంక్ష కవ్విస్తోంది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. పెద్దగా స్కిన్ షో చేయకుండానే ఇంత హాట్‌ గా కనిపించడం ఈమెకే సాధ్యం అన్నట్లుగా నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

33 ఏళ్ల ఆకాంక్ష సింగ్‌ వయసు పెరుగుతున్నా కొద్ది మరింత అందంగా తయారు అవుతున్నట్లుగా అనిపిస్తోంది. ముందు ముందు అయినా ఈ అమ్మడికి సీనియర్‌ హీరోల సినిమాల్లో ఛాన్స్ వస్తే బాగుండు అనుకుంటూ అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. మరి వారి కోరిక మేరకు ఆకాంక్ష సింగ్‌ బిజీ అయ్యేనా చూడాలి.