Begin typing your search above and press return to search.

గుంటూరు కారం - సలార్.. బీడీ vs సిగరెట్

సినిమా థియేటర్స్ లో స్మోకింగ్ ఆరోగ్యానికి హానికరం అని యాడ్ వేస్తారు. అదే సినిమాలో హీరో స్టైల్ గా స్మోకింగ్ చేస్తే అభిమానులు అందరూ విజిల్స్ వేస్తారు

By:  Tupaki Desk   |   14 Dec 2023 4:32 AM GMT
గుంటూరు కారం - సలార్.. బీడీ vs సిగరెట్
X

సినిమా థియేటర్స్ లో స్మోకింగ్ ఆరోగ్యానికి హానికరం అని యాడ్ వేస్తారు. అదే సినిమాలో హీరో స్టైల్ గా స్మోకింగ్ చేస్తే అభిమానులు అందరూ విజిల్స్ వేస్తారు. హీరోలతో స్మోకింగ్ చేయించడం కూడా హీరోయిజంలో భాగంగానే దర్శకులు ప్రెజెంట్ చేస్తూ ఉంటారు. ఇది కేవలం తెలుగు సినిమాలోనే కాదు హాలీవుడ్ వరకు ఈ పద్ధతిని దర్శకులు ఫాలో అవుతూ ఉంటారు.

హీరోలు స్మోక్ చేసే సన్నివేశాలని చాలా ఇంటరెస్టింగ్ గా ఎలివేట్ చేస్తూ ఉంటారు. ఆడియన్స్ లో ఉన్న రెస్పాన్స్ బట్టి సినిమాలలో అలాంటి సన్నివేశాలని పెడుతూ ఉంటారు. హీరోలకి స్మోకింగ్ అలవాటు లేకపోయిన తప్పక కొన్ని సందర్భాలలో నటించాల్సి వస్తుంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం టాలీవుడ్ లో ఇద్దరు స్టార్ హీరోల స్మోకింగ్ క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సలార్ సినిమా నుంచి తాజాగా సూరీడే అనే సాంగ్ వచ్చింది. ఈ సాంగ్ లో ప్రభాస్ ఈ సీక్వెన్స్ లో పృథ్వీరాజ్ తో కలిసి సిగరెట్ తాగుతాడు. త్రివిక్రమ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా గుంటూరు కారం సినిమా రెడీ అవుతోంది. ఇందులో పక్కా ఊరమాస్ పాత్రలో మహేష్ బాబు కనిపిస్తున్నాడు. రీసెంట్ గా రిలీజ్ అయిన సాంగ్ లో, టీజర్ లో మహేష్ బాబు బీడీ కలుస్తూ ఇచ్చిన ఫోజ్ భాగా వైరల్ అయ్యింది.

ఈ రెండు ఫోటోలు ఇప్పుడు మ్యాచింగ్ చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. టాలీవుడ్ లో హీరో స్మోక్ చేస్తే సినిమా సూపర్ హిట్ గ్యారెంటీ అనే సెంటిమెంట్ ఉంది. ఈ రెండు చిత్రాలలో కూడా హీరోలైన ప్రభాస్, మహేష్ బాబు సిగరెట్, బీడీ తాగుతూ కనిపించడంతో పక్కాగా ఈ సినిమాలు బ్లాక్ బస్టర్ అవుతాయని బలంగా నమ్ముతున్నారు. ఈ సినిమాలపై ఎక్స్ పెక్టేషన్స్ కూడా పీక్ లో ఉన్నాయి.

ప్రభాస్ సలార్ మూవీ డిసెంబర్ 22న థియేటర్స్ లోకి వస్తోంది. ఏకంగా ఐదు భాషలలో మూవీ రిలీజ్ అవుతోంది. డార్లింగ్ అభిమానులు ఈ సినిమాపై చాలా హోప్స్ పెట్టుకున్నారు. మరి వారి అంచనాలని ఏ మాత్రం అందుకుంటుంది అనేది చూడాలి. సిగరెట్ సెంటిమెంట్ సలార్ కి కలిసోస్తే మాత్రం సూపర్ హిట్ గ్యారెంటీ.