Begin typing your search above and press return to search.

ఆ యంగ్ హీరోకి ఖాళీ దొరికితే వైజాగ్ లో రైడింగ్!

సిద్దు జొన్న‌ల గ‌డ్డ ఈ పేరిప్పుడు యువ‌తలో మారుమ్రోగిపోతున్న సంగ‌తి తెలిసిందే. 'డీజేటిల్లు' స‌క్సెస్ తో వ‌చ్చిన గుర్తింపు అది.

By:  Tupaki Desk   |   11 Sep 2023 2:30 AM GMT
ఆ యంగ్ హీరోకి ఖాళీ దొరికితే వైజాగ్ లో రైడింగ్!
X

సిద్దు జొన్న‌ల గ‌డ్డ ఈ పేరిప్పుడు యువ‌తలో మారుమ్రోగిపోతున్న సంగ‌తి తెలిసిందే. `డీజేటిల్లు` స‌క్సెస్ తో వ‌చ్చిన గుర్తింపు అది. అందుకే రెట్టించ‌ని ఉత్సాహంలో ఆసినిమాకి సీక్వెల్ కూడా తెర‌కెక్కిస్తున్నాడు. అంత‌కు ముందు క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ గా కొన్ని సినిమాలు చేసాడు. `గుంటూరు టాకీస్` లోనూ హీరోగా న‌టించి ఐడెంటిటీ సంపాదిచాడు. కానీ అస‌లైన క్రేజ్ మాత్రం డీజేటిల్లు నుంచే మొద‌లైంది. ప్ర‌స్తుతం మార్కెట్ లో టిల్లుగా చ‌లామ‌ణి అవుతున్నాడు.

త‌న అభిమానులంతా అదే పేరుతో బ‌య‌ట పిలుస్తున్నారుట‌. తాజాగా ఈ యంగ్ హీరో స్నేహితుల‌తో ఎంజాయ్ చేయ‌డంలో ముందుంటాడుట‌. ఏమాత్రం ఖాళీ స‌మ‌యం దొరికినా వాళ్ల‌తోనే గ‌డుపుతాడుట‌. బేసిక్ గానేటివ్ ప్లేస్ హైద‌రాబాద్ అయినా వైజాగ్ లో కూడా చాలా మంది స్నేహితులున్నారుట‌. అందుకే గ్యాప్ దొరికితే వైజాగ్ ఎక్కువ‌గా వెళ్తుంటాడుట‌. అక్క‌డ స్నేహితులతో క‌లిసి బైక్ రైడింగ్ కి వెళ్తుంటాడుట‌. అలాగే వైజాగ్ స్ట్రీట్ పుడ్ కూడా బాగా ఇష్ట‌ప‌డ‌తాడుట‌.

ముఖ్యంగా మురి మిక్చ‌ర్ వైజాగ్ లో ఫేమ‌స్ అంటున్నాడు. ఇక సిద్దు చ‌దువులో చాలా వీక్ అట‌. వాళ్ల‌న్న‌య్య బాగా చవుదుకుని విదేశాల్లో ఉంటే త‌ను మాత్రం ఇక్క‌డే ఉన్నాడ‌ని వాళ్ల‌మ్మ ఎక్కువ‌గా బాధ‌ప‌డేదిట‌. అయితే న‌టుడైన త‌ర్వాత ఆ బాధ తొల‌గిపోయిందిట‌. ఇంజ‌నీరింగ్ పాస్ అవ్వ‌డానికి టిల్లు బాబు చాలా క‌ష్ట‌ప‌డాల్సి వ‌చ్చిందిట‌. 15 దాకా ఉన్న బ్యాక్ లాగ్స్ పూర్తిచేయ‌డానికి త‌ల్ల‌కిందులా త‌పస్సు చేసాడుట‌.

కానీ క‌ల్చ‌ర‌ల్ ఈవెంట్ లో ముందుండేవాటు. స్కిట్స్ రాయ‌డం..స్టేజ్ మీద పెర్పార్మెన్స్ ఇవ్వ‌డం వంటివి చిన్న‌ప్పుడే అల‌వాటు అయ్యాయ‌ట‌. ఇంటి ద‌గ్గ‌ర‌ల్లో ఉన్న ఫోటో స్టూడియోకి వెళ్లి ర‌క‌ర‌కాల గెట‌ప్ ల‌లో ఫోటోలు దిగేవాడుట‌. ఈ ప్రాస‌స్ లో బైక్ పై స్టూడియోలు చుట్టూ చక్కెర్లు కొట్టిన సంద‌ర్భాలెన్నో అంటున్నాడు. ఇంట్లో అమ్మే త‌న విమ‌ర్శ‌కు రాలుట‌. చిన్న నాటి నుంచి త‌న కామెడీని ఎక్కువ‌గా వాళ్ల త‌ల్లి ఇష్ట‌ప‌డేవారుట‌. త‌న‌లో అల్ల‌రి వేషాలున్నా! ఏదైనా సాధిస్తాడు అనే న‌మ్మ‌కం అమ్మ‌కి ఎక్క‌డో ఉండేద‌ట‌. అది సినిమా రూపంలో నిజ‌మైంది. న‌టుడిగా త‌న‌కంటూ ఓ గుర్తింపు ద‌క్కించుకున్నాడు.