Begin typing your search above and press return to search.

యంగ్ హీరోలు నాన్నలు అయిపోతున్నారుగా...!

అయితే, ఇప్పుడు నాని బాటలో హీరో శర్వానంద్ కూడా చేరిపోయాడు. శర్వానంద్ హీరోగా కొత్త సినిమా తెరకెక్కుతోంది.

By:  Tupaki Desk   |   3 Aug 2023 2:11 PM GMT
యంగ్ హీరోలు నాన్నలు అయిపోతున్నారుగా...!
X

హీరోలందరూ తమ పంథాలను మార్చుకుంటుున్నారు. ఒకప్పుడు తమకు ఎలాంటి కథలు సెట్ అవుతాయో చూసుకొని, అడుగువేసేవారు. ఇక యంగ్ హీరోలు అయితే, కేవలం ప్రేమ కథలనే ఎంచుకునేవారు. దానిలోనే ఏదో ఒక ట్విస్ట్ ఉండేలా చూసుకునేవారు. ముఖ్యంగా, హీరోల వయసు ఎంత ఉన్నా, పిల్లల తండ్రిగా నటించడానికి మాత్రం చాలా ఎక్కువగా ఆలోచించేవారు. కానీ, ఇప్పుడు మారిపోయారు. ఎలాంటి కథలు చేయడానికైనా ముందుకు వస్తున్నారు.

పిల్లలకు తండ్రి గా చేయడానికి కూడా ఏ మాత్రం సంకోచించడం లేదు. సీనియర్ నటులు మాత్రమే కాదు, యంగ్ హీరోలు కూడా తండ్రి పాత్రలు చేస్తున్నారు. ఇటవల నేచురల్ స్టార్ నాని హీరోగా హాయ్ నాన్న సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో నాని ఓ చిన్న అమ్మాయికి తండ్రిగా నటిస్తున్నారు.

అయితే, ఇప్పుడు నాని బాటలో హీరో శర్వానంద్ కూడా చేరిపోయాడు. శర్వానంద్ హీరోగా కొత్త సినిమా తెరకెక్కుతోంది. ఈ మూవీలో ఆయన కూడా తండ్రి పాత్రలో నటిస్తున్నాడట. ఈ సినిమాకి బేబీ ఆన్ బోర్డ్ అనే టైటిల్ పెట్టాలి అని అనుకుంటున్నారట. ఈ సినిమాకి శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్నారు.

కాగా, శ్రీరామ్ ఆదిత్య ఇప్పటి వరకు కొన్ని డిఫరెంట్ సినిమాలు చేశారు. నాగార్జున, నాని లాంటి స్టార్ హీరోలతో దేవ దాస్ సినిమా తీసింది ఈయనే. అదేవిధంగా , శమంతకమణి, భలే మంచి రోజు, హీరో వంటి సినిమాలు చేశారు. అయితే, ఇప్పటి వరకు ఈ సినిమాల్లో ఏదీ కమర్షియల్ హిట్ కాలేదు. అలా అని, మరీ తీసేసే సినిమాలు అయితే కావు. కానీ, అలా అని సూపర్ హిట్ అని కూడా చెప్పలేం.

ఇదిలా ఉండగా, శర్వానంద్ ఇటీవల పెళ్లి చేసుకున్నాడు. ఈ ఏడాది మొదట్లో ఎంగేజ్మెంట్ చేసుకున్న ఆయన, ఇటీవల పెళ్లి చేసుకొని ఓ ఇంటివాడు అయ్యాడు. జూన్3న జైపూర్‌ లోని లీలా ప్యాలెస్‌ లో రక్షితతో ఆయన పెళ్లి చాలా గ్రాండ్ గా జరగగా, హైదరాబాద్ లో స్పెషల్ గా రిసెప్షన్ కూడా ఏర్పాటు చేశారు. ఈ రిసెప్షన్ లో టాలీవుడ్ సెలబ్రెటీలు సందడి చేశారు.