Begin typing your search above and press return to search.

సంజూ బాబా.. అందరికి ఆయనే విలన్

బాలీవుడ్ లో కల్నాయక్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని సొంతం చేసుకున్న నటుడు సంజయ్ దత్

By:  Tupaki Desk   |   21 Sep 2023 4:11 AM GMT
సంజూ బాబా.. అందరికి ఆయనే విలన్
X

బాలీవుడ్ లో కల్నాయక్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని సొంతం చేసుకున్న నటుడు సంజయ్ దత్. మున్నాభాయ్ సిరీస్ లతో సంజయ్ దత్ లో కామిక్ యాంగిల్ కూడా బాలీవుడ్ ఆడియన్స్ ఆశ్వాదించారు. హీరోగా కెరియర్ లో ఎన్నో హిట్ సినిమాలలో నటించారు. అయితే ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిపోయి డిఫరెంట్ రోల్స్ పోషించడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు.

కేజీఎఫ్ 2లో అధీరా పాత్రలో అద్భుతమైన పెర్ఫార్మసన్ తో సంజయ్ దత్ సౌత్ ప్రేక్షకులకి చేరువ అయిపోయాడు. ఈ మూవీ తర్వాత సౌత్ దర్శకులకి సంజయ్ దత్ రూపంలో మంచి విలన్ దొరికేశారు. ఈ నేపథ్యంలో లోకేష్ కనగరాజ్ తన సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా వస్తోన్న లియో చిత్రంలో ప్రతినాయకుడి పాత్రకి సంజయ్ దత్ ని తీసుకున్నారు. ఈ మూవీలో ఆంటోనీ దాస్ అనే రోల్ లో సంజయ్ కనిపించనున్నారు.

దసరాకి ఈ చిత్రం రిలీజ్ కానుంది. లోకేష్ కనగరాజ్ చిత్రాలలో విలన్ పాత్రలు చాలా పవర్ ఫుల్ గా ఉంటాయనే సంగతి తెలిసిందే. సంజయ్ దత్ రోల్ కూడా అందరూ ఆశ్చర్యపోయే రేంజ్ లో డిజైన్ చేసారంట. ఈ మూవీ రిలీజ్ కాకుండానే అజిత్ కుమార్ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రంలో ప్రతినాయకుడి పాత్రకి ఒకే చెప్పేశారు. ఈ మూవీ షూటింగ్ కూడా ప్రారంభమైంది.

దుబాయ్ లో కొన్ని కీలక సన్నివేశాలు అజిత్ కుమార్, సంజయ్ దత్ మీద చిత్రీకరించారంట. ఇక పూరి జగన్నాథ్ డబుల్ ఇస్మార్ట్ చిత్రంతో టాలీవుడ్ లోకి కూడా సంజయ్ దత్ విలన్ గా ఎంట్రీ ఇచ్చేస్తున్నాడు. అప్పుడెప్పుడో కింగ్ నాగార్జున సినిమాలో సంజయ్ దత్ తెలుగులో గెస్ట్ రోల్ లో కనిపించారు. మరల ఇప్పుడు పూర్తిస్థాయిలో విలన్ గా డబుల్ ఇస్మార్ట్ లో రామ్ పోతినేనికి పోటీ ఇవ్వబోతున్నారు.

పాన్ ఇండియా లెవల్ లోనే ఈ సినిమా తెరకెక్కుతోంది. సంజయ్ దత్ ని మరికొన్ని సినిమాలలో కూడా తీసుకోవడానికి చర్చలు జరుగుతున్నాయంట. అవి కూడా పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ అని తెలుస్తోంది. మొత్తానికి కేజీఎఫ్ 2 తర్వాత సంజయ్ దత్ సౌత్ లో మోస్ట్ అవైటెడ్ యాక్టర్ గా మారిపోయారని కచ్చితంగా ఒప్పుకోవాల్సిందే.