Begin typing your search above and press return to search.

సాయి తేజ్ బ్రో.. నెక్ట్స్ ఈ కన్ఫ్యూజన్ ఏంటి

అయితే సాయి తేజ్ నెక్ట్స్.. ఇప్పటికే రచ్చ, సీటీమార్ వంటి చిత్రాలతో బ్లాక్ బాస్టర్ హిట్స్ అందుకున్న సంపత్ నందితో సినిమా చేయనున్నట్లు వార్తలు వచ్చాయి.

By:  Tupaki Desk   |   20 Aug 2023 2:45 AM GMT
సాయి తేజ్ బ్రో.. నెక్ట్స్ ఈ కన్ఫ్యూజన్ ఏంటి
X

మెగాహీరో సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం పుల్ జోష్ లో ఉన్న సంగతి తెలిసింది. ఈ ఏడాది రెండు బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ లను అందుకున్నారు. ఆయన నటించిన విరూపాక్ష, బ్రో మంచి హిట్స్ ను అందుకున్నాయి. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను అందుకుంది. దీంతో ఆయన నెక్ట్స్ ఈ సినిమా చేయనున్నారా ఆసక్తి కూడా అభిమానుల్లో ఎక్కువగా నెలకొంది.

అయితే సాయి తేజ్ నెక్ట్స్.. ఇప్పటికే రచ్చ, సీటీమార్ వంటి చిత్రాలతో బ్లాక్ బాస్టర్ హిట్స్ అందుకున్న సంపత్ నందితో సినిమా చేయనున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే అంతకన్నా ముందు ప్రస్తుతం ఆరు నెలల పాటు బ్రేక్ తీసుకున్నట్లు సాయి తెలిపారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఆయనకు సంబంధించిన మరో సినిమా విషయం తెరపైకి వచ్చింది.

అదేంటంటే సాయి తేజ్ గతంలో కొత్త దర్శకుడు జయంత్ తో ఓ సినిమాను ప్రకటించారు. కామిక్ ఎంటర్ టైనర్ లో ఈ సినిమా రాబోతుంది, దానికి రుద్రవణం అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించేందుకు ముందుకు వచ్చారు. సంయుక్త మీనన్ హీరోయిన్ గా అనుకున్నారు. అజయ్, బ్రహ్మాజీ, సునీల్ తదితరులు ఇందులో ఉన్నారు.అజనీష్ లోక్‌నాథ్ ను సంగీత దర్శకుడిగా ఫిక్స్ చేశారు.

అయితే ఎందుకో కానీ ఈ చిత్రం గురించి ఆ తర్వాత ఎటువంటి అప్డేట్ రాలేదు. సినిమా ఆగిపోయిందేమోనని అంతా అనుకున్నారు. అయితే బ్రేక్ తర్వాత ఈ చిత్రాన్ని కంటిన్యూ చేసే అవకాశముండచ్చు అని కూడా మాట్లాడుకున్నారు. కానీ ఇప్పుడు తాజాగా అందిన సమాచారం ప్రకారం సాయితేజ్ చిత్రాన్ని హోల్డ్ లో పెట్టారని తెలిసింది. సినిమా ఏమీ ఆగిపోలేదట. కాకపోతే కాస్త లేట్ గా సెట్స్ పైకి తీసుకెళ్లే అవకాశముందని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో...

ఇకపోతే సాయితేజ్ ఓ షార్ట్ ఫిల్మ్ తో కూడా అభిమానుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఓ మ్యూజిక్ షార్ట్ ఫిల్మ్ లో దేశం కోసం ప్రాణాలు విడిచిన సోల్డర్ గా కనిపించి ఎమోషనల్ కు గురి చేశారు. దీనికి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇందులో సాయి తేజ్ పక్కన కలర్ స్వాతి నటించింది.