Begin typing your search above and press return to search.

సెకండ్ ఇన్నింగ్స్ కు.. దేవుడు వరమందిస్తాడా..?

శంకర్ దాదా M.B.B.S, శంకర్ దాదా జిందాబాద్, నవ వసంతం సినిమాల్లో సైడ్ క్యారెక్టర్స్ లో నటించాడు రోహిత్

By:  Tupaki Desk   |   19 March 2024 3:30 PM GMT
సెకండ్ ఇన్నింగ్స్ కు.. దేవుడు వరమందిస్తాడా..?
X

2001 లో సిక్స్ టీన్స్ అనే సినిమాతో అప్పటి యువతను ఆకట్టుకున్న రోహిత్ దేవుడు వరమందిస్తే నే నిన్నే కోరుకుంటానే అంటూ అమ్మాయిల మనసు గెలిచాడు. అప్పటి నుంచి హీరోగా సినిమాలు చేస్తూ వచ్చిన రోహిత్ గర్ల్ ఫ్రెండ్, జానకి వెడ్స్ శ్రీరాం, నేను సీతామహాలక్ష్మి సినిమాలతో సూపర్ ఫాం కొనసాగించాడు. అయితే ఆ తర్వాత సోలో హీరోగా అవకాశాలు రావడం ఆగిపోయే సరికి సెకండ్ హీరోగా కూడా చేస్తూ వచ్చాడు. శంకర్ దాదా M.B.B.S, శంకర్ దాదా జిందాబాద్, నవ వసంతం సినిమాల్లో సైడ్ క్యారెక్టర్స్ లో నటించాడు రోహిత్.

2010లో వచ్చిన నవ వసంతం సినిమా తర్వాత మళ్లీ తెర మీద కనిపించలేదు. తర్వాత కనీసం సైడ్ రోల్స్ లో కూడా కనిపించని రోహిత్ ఈమధ్య మళ్లీ ఇంటర్వ్యూస్ లో దర్శనమిచ్చాడు. 2000 లో యూత్ ఆడియన్స్ అంటే ఇప్పటి అంకుల్స్ అంతా కూడా రోహిత్ ని బాగా రిజిస్టర్ చేస్తారు. రోహిత్ సినిమాల్లో సాంగ్స్ స్పెషల్ గా ఉంటాయి. అప్పటి యూత్ కి ఈ హీరో సినిమాల్లో పాటలంటే చాలా క్రేజ్.

ఇక ఇన్నాళ్లకు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు రోహిత్. R.A.M (ర్యాపిడ్ యాక్షన్ మిషన్) తో మరో ప్రయత్నం చేస్తున్నాడు. అయితే దాదాపు దాదాపు 14 ఏళ్ల తర్వాత సినిమా చేస్తున్న రోహిత్ లుక్స్ ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేస్తున్నాయి. హీరోగా చేస్తున్న టైంలో స్లిమ్ గా ఉన్న రోహిత్ ఇప్పుడు కాస్త ఒళ్లు చేసి కనిపిస్తున్నాడు. అప్పటితో పోల్చితే రోహిత్ ఫేస్ లో పెద్దగా మార్పు రాలేదు కాబట్టి అతనంటే ఇష్టపడే ఆడియన్స్ అతని సినిమాలకు ఇప్పటికీ కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది.

ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ రోహిత్ చేస్తున్న ఈ సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి. ఇన్నేళ్ల తర్వాత మళ్లీ తెర మీద కనిపించబోతున్న రోహిత్ కి మరోసారి దేవుడు వరమందిచ్చి మళ్లీ కెరీర్ లో బిజీ అవ్వాలని కోరుకుంటున్నారు ఆయన ఫ్యాన్స్. హీరోగా చేస్తున్న టైం లోనే సైడ్ రోల్స్ చేసిన రోహిత్ రీ ఎంట్రీలో కూడా డిఫరెంట్ అటెంప్ట్ చేసే ఛాన్స్ ఉంటుందేమో చూడాలి. R.A.M తో రోహిత్ సెకండ్ ఇన్నింగ్స్ దూసుకెళ్లాలని సినీ ప్రేక్షకులు ఆశిస్తున్నారు.