Begin typing your search above and press return to search.

లిటిల్ ప్రిన్స్‌తో నిఖిల్-ప‌ల్ల‌వి ఆనందం

ఈ రోజు నిఖిల్- పల్లవి వర్మ దంప‌తులు తమ నవజాత శిశువు ఊయల ఫంక్షన్ సెల‌బ్రేట్ చేసారు. సోషల్ మీడియాలో త‌మ కుమారుడితో క‌లిసి ఉన్న అంద‌మైన ఫోటోల‌ను షేర్ చేసారు.

By:  Tupaki Desk   |   17 March 2024 6:21 AM GMT
లిటిల్ ప్రిన్స్‌తో నిఖిల్-ప‌ల్ల‌వి ఆనందం
X

పాన్ ఇండియ‌న్ ఫిలిం 'స్వ‌యంభు'లో న‌టిస్తూ వేవ్స్ క్రియేట్ చేస్తున్నాడు నిఖిల్. కార్తికేయ 2తో హిందీ బెల్ట్ లోను నిరూపించిన నిఖిల్ త‌దుప‌రి పెద్ద ప్ర‌ణాళిక‌ల‌తో దూసుకెళుతున్నాడు. అత‌డు కెరీర్ ఉత్త‌మ ఫేజ్ లో ఉండ‌గానే, వ్య‌క్తిగ‌త జీవితంలోను అత్యుత్త‌మ ఆనందాన్ని త‌న సొంతం చేసుకున్నాడు. హీరో నిఖిల్ ఇటీవల తండ్రి అయ్యాడు. త‌న‌ కుటుంబంలో కొత్త సభ్యుడు చేరికతో చాలా ఆనందంగా ఉన్నాడు. ఫిబ్రవరి 21న నిఖిల్ భార్య పల్లవి వర్మ మగబిడ్డకు జన్మనిచ్చింది. నిఖిల్ గత సంవత్సరం తన తండ్రిని కోల్పోయాక బిడ్డ రాక‌ను చాలా సెంటిమెంట్ గా భావిస్తున్నాడు. తన తండ్రి మళ్లీ తన కొడుకుగా వచ్చార‌ని న‌మ్ముతున్నాడు.

ఈ రోజు నిఖిల్- పల్లవి వర్మ దంప‌తులు తమ నవజాత శిశువు ఊయల ఫంక్షన్ సెల‌బ్రేట్ చేసారు. సోషల్ మీడియాలో త‌మ కుమారుడితో క‌లిసి ఉన్న అంద‌మైన ఫోటోల‌ను షేర్ చేసారు. పల్లవి వర్మ సోష‌ల్ మీడియాల్లో ఇలా రాశారు. ''మమ్మల్ని మీ అమ్మగా, నాన్నగా ఎంచుకున్నందుకు ధన్యవాదాలు. మీరు మా జీవితాలను శాశ్వతంగా మార్చారు'' అని రాసారు.

బిడ్డ‌ను ఎత్తుకుని భార్యాభ‌ర్త‌లు ఎంతో మురిపెంగా చూస్తున్న తీరును బ‌ట్టి ఈ జంట ఎంత ఆనందంగా ఉన్నారో అర్థం చేసుకోవ‌చ్చు. యువ‌హీరో నిఖిల్ బిడ్డ‌ జ‌న‌నంతో సంపూర్ణుడిగా మార‌డు. అత‌డు అంతులేని ఆనందాన్ని పొందుతున్నాడ‌ని అతడి ముఖంలో గ్లో చెబుతోంది. అయితే త‌మ బిడ్డ ముఖం క‌నిపించ‌కుండా ల‌వ్ ఈమోజీతో క‌వ‌ర్ చేసారు ఈ జోడీ.

నిఖిల్ ప్రేమ వివాహం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. కొంతకాలం రిలేషన్‌షిప్‌లో ఉన్న నిఖిల్ - పల్లవి 2020లో పెళ్లి చేసుకున్నారు. ప‌ల్లవి వృత్తిరీత్యా డాక్ట‌ర్. నిఖిల్ తదుపరి పాన్ ఇండియన్ ఫిల్మ్ స్వయంభులో కనిపిస్తాడు. ఇందులో అత‌డు యోధుడిగా నటిస్తున్నాడు. దీనికోసం నిఖిల్ మేకోవ‌ర్ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. పొడ‌వాటి గిర‌జాలు.. గుబురు గ‌డ్డం.. కోర మీసం ఈ గెట‌ప్ చూస్తుంటేనే అత‌డు స్వ‌యంభు గెట‌ప్ లో ఉన్నాడ‌ని అర్థం చేసుకోవ‌చ్చు. తెలుపు వ‌స్త్రం ధ‌రించి సాంప్ర‌దాయ‌ ఊయ‌ల కార్య‌క్ర‌మంలో పాల్గొన్నాడు.