Begin typing your search above and press return to search.

నరేష్ మూడో భార్య కేసు.. ఊహించని ట్విస్ట్!

సీనియర్​ నటుడు నరేశ్‌ మూడో భార్య రమ్య రఘుపతికి బెంగుళూరు సిటీ సివిల్ కోర్టులో చుక్కెదురైంది

By:  Tupaki Desk   |   2 Aug 2023 10:19 AM GMT
నరేష్ మూడో భార్య కేసు.. ఊహించని ట్విస్ట్!
X

సీనియర్​ నటుడు నరేశ్‌ మూడో భార్య రమ్య రఘుపతికి బెంగుళూరు సిటీ సివిల్ కోర్టులో చుక్కెదురైంది. 'మళ్ళీ పెళ్లి' సినిమాను థియేటర్​ అండ్​ ఓటీటీలో రిలీజ్​ నిలిపివేయాలంటూ ఆమె ఇటీవలే కోర్టును ఆశ్రయించింది. తాజాగా దాన్ని పరీశించిన న్యాయస్థానం.. రమ్య పిటిషన్​ను కొట్టిపారేసింది.

నరేశ్‌- రమ్య రఘుపతి చాలా కాలంగా విడివిడిగా ఉంటున్నారు. దీంతో నరేశ్​.. సీనియర్ నటి పవిత్రా లోకేశ్‌తో కలిసి సహజీవనం చేస్తున్నారు. పలు సినిమాల్లో కూడా కలిసి నటించారు. ఈ క్రమంలోనే వీరిద్దరూ 'మళ్ళీ పెళ్లి' అనే చిత్రంలో ప్రధాన పాత్రలో నటించారు. దీంతో రమ్య రఘుపతి అసంతృప్తి వ్యక్తం చేసింది. గతంలోనూ తనకు డివొర్స్​ ఇవ్వకుండా.. మరో మహిళతో నరేశ్‌ ఎలా సహజీవనం చేస్తారంటూ రోడెక్కింది. మీడియా ముందు రచ్చ రచ్చ చేసింది. నరేశ్​-పవిత్రతో గొడవకు కూడా దిగింది. మళ్లీ పెళ్లి చిత్రంలో తమ వ్యక్తిగత జీవితాన్ని ఎలా చూపిస్తారంటూ, తనను లక్ష్యంగా చేసుకునే ఇలా చేశారంటూ కోర్టును ఆశ్రయించింది. సినిమా నిలిపివేయాలని కోర్టును కోరింది.

అయితే తాజాగా దీనిపై కోర్టు విచారణ చేసింది. ఇరువైపుల వాదనలు విని.. చివరిగా మెరిట్‌ లేని కారణంగా రమ్య దావాను కొట్టేస్తున్నట్లు తీర్పును వెలువరించింది. రమ్య దావాలో పేర్కొన్న కారణాలను సమర్థించలేనిదని చెప్పింది. అలాగే సెన్సార్‌ బోర్డు సర్టిఫై చేసిన సినిమాను ఇతర ప్రైవేట్​ వ్యక్తులు ఎవరూ ఆపరేలని క్లారిటీ ఇచ్చింది. మళ్లీ పెళ్లి సినిమా కల్పిత కథేనని నిర్థారించింది. దర్శకనిర్మాతలు ఏ ప్లాట్​ఫామ్​లోనైనా తన సినిమాను ప్రసారం చేసుకునే స్వేచ్ఛ ఉందని వెల్లడించింది.

ఇకపోతే నరేశ్​కు మరో కేసులోనూ ఊరట దక్కింది. ఆయన కుటుంబం సభ్యులు గతంలో.. నానక్‌రామ్‌గూడలో ఉన్న ఇంట్లోకి రమ్యరఘుపతి రాకూడదంటూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తాజాగా ఈ కేసును కూడా విచారించిన కోర్టు.. రమ్యకు షాక్​ ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఆమె నరేశ్ ఇంట్లోకి రాకూడదని ఉత్తర్వులిచ్చింది.

అలాగే నరేశ్​, రమ్య రఘుపతి జంట దాదాపు గత ఆరేళ్లుగా విడివిడిగా ఉంటున్నారు. దీన్ని కూడా పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం.. వారిద్దరూ కలిసి జీవించడం లేదని నిర్ధారించింది. సుప్రీం కోర్టు నిబంధన ప్రకారం.. భార్యాభర్తలు రెండు లేదా అంతకన్నా ఎక్కువ ఏళ్లపాటు కలిసి ఉండకపోతే పెళ్లి రద్దవుతుందని తెలిపింది. దీంతో నరేశ్​కు రమ్య రఘుపతితో విడాకులకు మార్గం మరింత సుగుమం అయినట్టైంది.