Begin typing your search above and press return to search.

మ‌ర్డ‌ర్ కేసులో అరెస్ట్ అయిన న‌టుడు!

కన్నడ న‌టుడు, ఛాలెంజింగ్ స్టార్ ద‌ర్శన్ ను ఓ మర్డర్ కేసులో కామాక్షి పాళ్య పోలీసులు అరెస్ట్ చేసారు

By:  Tupaki Desk   |   11 Jun 2024 6:34 AM GMT
మ‌ర్డ‌ర్ కేసులో అరెస్ట్ అయిన న‌టుడు!
X

కన్నడ న‌టుడు, ఛాలెంజింగ్ స్టార్ ద‌ర్శన్ ను ఓ మర్డర్ కేసులో కామాక్షి పాళ్య పోలీసులు అరెస్ట్ చేసారు. మంగళవారం (జూన్ 11) ఉదయం అతన్ని మైసూరులోని ఓ ఫామ్ హౌజ్ లో అదుపులోకి తీసుకున్నారు. రెండు రోజుల క్రితం క‌ర్ణాట‌క‌లోని సుమ‌న్న‌హ‌ళ్లి బ్రిడ్జి స‌మీపంలో గుర్తు తెలియ‌ని మృత‌దేహం ల‌భ్య‌మైన నేప‌థ్యంలో కామాక్షి పాళ్య స్టేష‌న్ లో కేసు న‌మోదైంది.

మృతుడు చిత్ర దుర్గ‌కు చెందిన రేణుకాస్వామిగా గుర్తించారు. ఈ హత్య కేసులో ద‌ర్శ‌న్ కి సంబంధం ఉన్న‌ట్లు క‌మీష‌నర్ దయానంద్ ప్ర‌క‌టించారు. ఈ కేసులో ఇప్ప‌టికే మ‌రో ప‌ది మందిని కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ప్ర‌స్తుతం ద‌ర్శ‌న్ పేరు నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. ఈ కేసులో ద‌ర్శ‌న్ ప్ర‌మేయం అభిమానుల్లో క‌ల‌క‌లంగా మారింది. సోమ‌వారం మైసూర్ లోని ఓ సినిమా షూటింగ్ జ‌రుతున్నా మ‌ధ్య‌లోనే ఆపేసి వెళ్లిపోయాడుట‌. హ‌త్య కేసులో అత‌ని పాత్ర గురించి ఆందోళ‌న వ్య‌క్తం చేసిన‌ట్లు స‌మాచారం. మ‌రికొన్ని వివ‌రాల్లోకి వెళ్తే..

నటి పవిత్రా గౌడకు అశ్లీల సందేశాలు పంపార‌ని ఈనేప‌థ్యంలోనే రేణుకాస్వామిని శనివారం రాత్రి హత్య చేసినట్లు దర్శన్ ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. గత పదేళ్లుగా నటి పవిత్రా గౌడతో దర్శన్ కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. మొదట రేణుకా స్వామిది ఆత్మహత్య అని భావించినా? తర్వాత హత్య అని పోలీసులు నిర్దారించుకున్న‌ట్లు తెలుస్తోంది.

నటి పవిత్రా గౌడతో దర్శన్ కు ఎఫైర్ నడుస్తోందన్న ఆరోపణలు చాలా కాలంగా ఉన్నాయి. గతంలో ఇదే విషయమై దర్శన్ భార్య విజయ లక్ష్మి.. పవిత్రపై ఆరోప‌ణ‌లు చేసారు. సంజయ్ సింగ్ అనే మరో వ్యక్తితో పవిత్ర కలిసి ఉన్న ఫొటోలను ఆమె పోస్ట్ చేసారు. మరొకరి భర్త ఫొటోలు పోస్ట్ చేసే ముందు ఈ మహిళ తన గురించి తెలుసుకోవాలంటూ విజయలక్ష్మి ఆ పోస్టులో రాసుకొచ్చారు. ఈ కేసుకు సంబంధించి పోలీసుల నుంచి పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.