Begin typing your search above and press return to search.

విక్రమ్ ని సొంత ఇంటి వాళ్లే పట్టించుకోలేదా?

చియాన్ విక్ర‌మ్ ఎంత గొప్ప న‌టుడో చెప్పాల్సిన ప‌నిలేదు. ఇండ‌స్ట్రీలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఎదిగిన న‌టుడు.

By:  Tupaki Desk   |   25 Sep 2023 3:15 AM GMT
విక్రమ్ ని సొంత ఇంటి వాళ్లే పట్టించుకోలేదా?
X

చియాన్ విక్ర‌మ్ ఎంత గొప్ప న‌టుడో చెప్పాల్సిన ప‌నిలేదు. ఇండ‌స్ట్రీలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఎదిగిన న‌టుడు. విభిన్న‌మైన న‌ట‌న‌..పాత్ర‌ల‌తో చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌ల‌తో త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన ఇమేజ్ ని సంపాదించుకున్న న‌టుడు. క‌ళామాత‌ల్ని ముద్దుబిడ్డ. అయితే ఎదిగే క్ర‌మంలో విక్ర‌మ్ కూడా చాలా స‌వాళ్లే ఎదుర్కున్నాడు. ఎంత ట్యాలెంట్ ఉన్నా! స‌మయం క‌లిసి రాన‌ప్పుడు తాడే పాము అవుతుంది అన్న చందంగా కెరీర్ లో చాలా ఒడిదుడుకులే ఎదుర్కున్నాడు.

సొంతిటి వాళ్లే విక్ర‌మ్ కి సపోర్ట్ చెయ్యలేదు అని తాజాగా వెలుగులోకి వ‌స్తోంది. విక్ర‌మ్ కి కోలీవుడ్ ఇండ‌స్ట్రీలో బంధువులున్నారు! అన్న సంగ‌తి ఆల‌స్యంగా వెలుగులోకి వ‌స్తోంది. అలాగ‌ని వాళ్లేమి విక్ర‌మ్ ని ముందుకు తీసుకురాలేదు. విక్ర‌మ్ స్వ‌యానా ద‌ర్శ‌కుడు..న‌టుడు త్యాగ‌ర‌జ‌న్ కి మేన‌ల్లుడు అట‌. ఇక న‌టుడు ప్ర‌శాంత్ ..త్యాగ‌రాజ‌న్ కుమారుడు.

విక్ర‌మ్ ఎంట‌ర్ అయ్యే స‌రికే ప్ర‌శాంత్ స్టార్ గా ఉన్నాడు. త్యాగ‌రాజ‌న్ కూడా బిజీగా ఉన్నారు. అయితే వీళ్లిద్ద‌రు ఉన్నా కూడా విక్ర‌మ్ కి ఎలాంటి స‌హాయం అంద‌లేదుట‌. ఏనాడు విక్ర‌మ్ వాళ్ల‌ని స‌హాయం కావాల‌ని అడిగింది లేదుట‌. అంతా త‌న‌కు తానుగా ఎదిగాడు త‌ప్ప‌! ఎవ‌రి స‌హాయం తీసుకోలేద‌ని తెలుస్తోంది. పెపెచ్చు విక్ర‌మ్ న‌టించిన ఓ సినిమా విష‌యంలో తండ్రీకొడుకులిద్ద‌రు విక్ర‌మ్ ని తొక్కే ప్ర‌య‌త్నాలు కూడా చేసారుట‌.

`సేతు` సినిమాకి త‌క్కువ థియేట‌ర్లు దొరికితే ఆ చిత్ర నిర్మాత‌లు ప్ర‌శాంత్ ని సంప్ర‌దిస్తే ఎలాంటి స్పంద‌న లేకుండా ఉన్నారుట‌. దీంతో ఇరు కుటుంబాల మ‌ధ్య ఏ వో గొడ‌వ‌లున్నాయ‌ని అప్ప‌ట్లోనే ప్ర‌చారం సాగిందని తెలిసిన వాళ్లు చెబుతున్న మాట‌. త్యాగ‌రాజ‌న్ కూడా ఏ నాడు విక్ర‌మ్ గురించి స్పందించింది లేదు. విక్ర‌మ్ కూడా వాళ్ల‌ని ప‌ట్టించుకుంది లేదు. నేడు విక్ర‌మ్ స్థానం ఎలాంటిందో తెలిసిందే.

అజిత్..విజ‌య్ త‌రం న‌టుల స‌మ‌యంలో ఎంట్రీ ఇచ్చిన ప్ర‌శాంత్ నేడు సినిమాల‌కే దూర‌మ‌య్యాడు. విక్ర‌మ్ మాత్రం వాళ్ల‌కి పోటీగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. అందుకే అన్నింటికి కాల‌మే స‌మాధానం చెబుతుంది అంటారు.