Begin typing your search above and press return to search.

బ్రహ్మాజి టైమింగ్ వేరే లెవెల్ అబ్బా..!

ట్విట్టర్ లో ఈ సినిమాకు సంబంధించిన కొన్ని క్లిప్స్ వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా నవీన్ పొలిశెట్టి కామెడీ టైమింగ్ చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు

By:  Tupaki Desk   |   9 Oct 2023 8:17 AM GMT
బ్రహ్మాజి టైమింగ్ వేరే లెవెల్ అబ్బా..!
X

సీనియర్ నటుడు బ్రహ్మాజి ఏం చేసినా ఫన్నీగానే ఉంటుంది. సోషల్ మీడియాలో తన మార్క్ ట్వీట్స్ తో ఆడియన్స్ ని అలరిస్తున్న బ్రహ్మాజి లేటెస్ట్ గా మరోసారి తన ట్వీట్ తో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేశారు. రీసెంట్ గా నవీన్ పొలిశెట్టి నటించిన మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమా థియేట్రికల్ వెర్షన్ రిలీజై హిట్ అవగా లేటెస్ట్ గా ఆ సినిమా ఓటీటీలో రిలీజైంది. నెట్ ఫ్లిక్స్ లో వచ్చిన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుంది.

ట్విట్టర్ లో ఈ సినిమాకు సంబంధించిన కొన్ని క్లిప్స్ వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా నవీన్ పొలిశెట్టి కామెడీ టైమింగ్ చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఈ క్రమంలో బ్రహ్మాజి పిల్లల చదువుల గురించి మాట్లాడే సీన్ పోస్ట్ చేశాడు. ఈ అబ్బాయి టాలెంట్ చూస్తుంటే భయం వేస్తుంది ఇక నేను రిటైర్ అయిపోతే బెటర్ అని రాసుకొచ్చాడు. ఈ ఫన్నీ పోస్ట్ చూసి నవీన్ కూడా అదే రేంజ్ లో రిప్లై ఇచ్చాడు.

బ్రహ్మాజి ట్వీట్ కి నవీన్ మీకు పవర్ ఉంది.. నాకు బ్రెయిన్ ఉంది.. మనమిద్దరం కలిస్తే అని రిప్లై ఇచ్చాడు. ఈ డైలాగ్ ని జాతిరత్నాలు సినిమాలో బ్రహ్మాజితో నవీన్ పొలిశెట్టి అంటాడు. అయితే ఆ డైలాగ్ కి రివర్స్ కౌంటర్ కూడా అంటే నాకు బ్రెయిన్ లేదా అంటే నవీన్ మాకు పవర్ లేదంటున్నాం సార్ అంటాడు. ఇప్పుడు ఈ డిస్కషన్ చూసిన నెటిజన్లు కూడా అదే రకమైన కామెంట్స్ తో హడావిడి చేస్తున్నారు.

విషయం ఏదైనా సరే తన మార్క్ కామెడీతో సోషల్ మీడియాలో ఎక్స్ ప్రెస్ చేసే బ్రహ్మాజి తెలుగు చలన చిత్ర పరిశ్రమ మీద విలన్, హీరో ఫ్రెండ్, క్యారెక్టర్ ఆర్టిస్ట్, కమెడియన్ ఇలా ఏ ఛాన్స్ వచ్చినా కాదనకుండా చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తూ వస్తున్నారు. బ్రహ్మాజి సినిమాలో ఉన్నాడు అంటే సినిమాలో ఫన్ ఉన్నట్టే అని ఆడియన్స్ ఫీల్ అవుతుంటారు. బ్రహ్మాజి చెప్పాడని కాదు కానీ నవీన్ పొలిశెట్టి టాలెంట్ ఏంటన్నది ఇప్పటికే ఆడియన్స్ కి అర్థమైంది. మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాను కేవలం తన భుజాన వేసుకుని నడిపించాడు నవీన్. సినిమా రిలీజ్ ప్రమోషన్స్ కూడా అతనొక్కడే చేశాడు. అందుకే ఈ సక్సెస్ క్రెడిట్ లో ఎక్కువ శాతం నవీన్ కే దక్కుతుంది.