Begin typing your search above and press return to search.

జోరు మీదున్న భగవంత్ కేసరి మరో హ్యాట్రిక్‌ కోసం...!

టాలీవుడ్ సీనియర్ హీరోలతో పాటు ఏ భాషకు చెందిన సీనియర్ హీరోలు కూడా దక్కించుకోని అరుదైన హ్యాట్రిక్ విజయాల రికార్డ్‌ ను బాలయ్య అందుకున్నాడు.

By:  Tupaki Desk   |   28 Oct 2023 6:40 AM GMT
జోరు మీదున్న భగవంత్ కేసరి మరో హ్యాట్రిక్‌ కోసం...!
X

టాలీవుడ్ సీనియర్ హీరోలతో పాటు ఏ భాషకు చెందిన సీనియర్ హీరోలు కూడా దక్కించుకోని అరుదైన హ్యాట్రిక్ విజయాల రికార్డ్‌ ను బాలయ్య అందుకున్నాడు. అఖండ, వీర సింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాలతో వంద కోట్లు, ఆపై వసూళ్లు సాధించడం ద్వారా బాలయ్య జోరు మామూలుగా లేదు. ఆయన తదుపరి సినిమాల గురించి అప్పుడే ఆసక్తికర చర్చ మొదలైంది.

ఇప్పటికే బాలయ్య 109వ సినిమా ను బాబీ దర్శకత్వంలో మొదలు పెట్టాడు. వాల్తేరు వీరయ్య సినిమా తర్వాత మరో మాస్ బ్లాక్ బస్టర్ సినిమా ను చేసేందుకు బాలయ్య తో దర్శకుడు బాబీ జత కట్టడాడు. దాంతో ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. కమర్షియల్‌ సినిమాలకు దర్శకుడు చక్కగా న్యాయం చేస్తాడనే అభిప్రాయం ఉంది. కనుక బాలయ్య 109వ సినిమా విజయం ఖాయం అంటూ ఫ్యాన్స్ ధీమాతో ఉన్నారు.

వచ్చే ఏడాది సమ్మర్‌ లో బాలయ్య, బాబీ ల ఎన్‌బీకే109 సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. బాబీ సినిమా మాత్రమే కాకుండా మరో రెండు సినిమాలను కూడా బాలయ్య లైన్ లో పెట్టాడు. అఖండ సినిమా కు సీక్వెల్‌ గా బాలయ్య తో బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఒక సినిమా రూపొందబోతుంది. అందుకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి.

అఖండ సినిమా విడుదల అయిన వెంటనే బాలయ్య మరియు బోయపాటిలు కలిసి మరో సినిమా చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు. కొన్ని కారణాల వల్ల ఆ సినిమా ఆలస్యం అయింది. అది వచ్చే ఏడాది కార్యరూపం దాల్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక బాలయ్య తో వీర సింహారెడ్డి సినిమాను రూపొందించిన గోపీచంద్‌ మలినేని మరో సినిమా చేయబోతున్నాడట.

మొత్తానికి బాబీ తో చేస్తున్న సినిమాతో పాటు బోయపాటి, గోపీచంద్‌ లతో బాలయ్య చేయబోతున్న సినిమాలు మూడు కూడా కచ్చితంగా మరో హ్యాట్రిక్ ను బాలయ్య అందించబోతున్నాయి అన్నట్లుగా అభిమానులు నమ్మకంతో ఉన్నారు. ఇప్పటికే హ్యాట్రిక్‌ కొట్టిన బాలయ్య మరో హ్యాట్రిక్ సక్సెస్ లను దక్కించుకోవాలంటే కథల ఎంపిక విషయంలో మరియు ఇతర విషయాల పట్ల చాలా శ్రద్ద అవసరం. అందుకే బాలయ్య కాస్త స్లో గానే వెళ్తున్నాడు.