Begin typing your search above and press return to search.

నెంబర్ 1 పాన్ ఇండియా స్టార్ అతనే: ఆదిత్య ఓం

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రేంజ్ రోజు రోజుకీ పెరిగిపోతోంది. ముఖ్యంగా పుష్ప మూవీతో ఆయన పాన్ ఇండియా స్టార్ గా మారిపోయారు

By:  Tupaki Desk   |   30 Aug 2023 7:44 AM GMT
నెంబర్ 1 పాన్ ఇండియా స్టార్ అతనే: ఆదిత్య ఓం
X

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రేంజ్ రోజు రోజుకీ పెరిగిపోతోంది. ముఖ్యంగా పుష్ప మూవీతో ఆయన పాన్ ఇండియా స్టార్ గా మారిపోయారు. ఇటీవల, ఆ మూవీకి ఆయనకు ఏకంగా నేషనల్ అవార్డు కూడా వచ్చింది. ఇప్పటి వరకు తెలుగులో చాలా సినిమాలకు, నేషనల్ అవార్డులు వచ్చాయి. కానీ, జాతీయ ఉత్తమ నటుడిగా ఓ తెలుగు స్టార్ కి రావడం ఇదే మొదటిసారి. దీంతో, ప్రతి ఒక్కరూ ఆయనపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ అవార్డుతో అల్లు అర్జున్ సత్తా ఏంటో అందరికీ తెలిసిపోయింది..

అయితే, ఈ అవార్డు రాకముందే, ఆయన నెంబర్ 1 పాన్ ఇండియా స్టార్ అంటూ ఓ నటుడు చెప్పాడు. ఆయనే ఆదిత్య ఓం. నటుడిగా ఆయన చాలా సినిమాలు చేశాడు. వైవీఎస్ చౌదరి దర్శక నిర్మాణంలో రూపొందిన 'లాహిరి లాహిరి లాహిరిలో' సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టాడు. హీరోగానే కాకుండా విలన్‌ పాత్రలు పోషించారు. 2018లో 'మాసాబ్' అనే హిందీ చిత్రానికి దర్శకత్వం వహించి తనలోని మరో టాలెంట్ బయటపెట్టారు.

ఇటీవల దహనం అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే, తాజాగా ఆయన అల్లు అర్జున్ పై ప్రశంసల వర్షం కురిపించాడు. ఇండియాన్ లో నెంబర్ 1 నటుడు అల్లు అర్జున్ అని చెప్పాడు. పాన్ ఇండియా స్టార్స్ లో మొదటి స్థానం అల్లు అర్జున్ దేనని, ఆతర్వాత స్థానంలో ప్రభాస్, కేజీఎఫ్ యశ్ ఉన్నారని చెప్పడం విశేషం. నార్త్ ఇండియాలో అల్లు అర్జున్ కి విపరీతమైన క్రేజ్ ఉందని, ఆయన క్రేజ్ చూస్తే ఎవరైనా షాక్ అయిపోతారని పేర్కొన్నారు.

కాగా, ఇప్పుడు ఆయన చెప్పిన కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. ఆయన చెప్పినట్లుగానే, ఇప్పుడు నిజంగా నిజమయ్యాయి. దీంతో, ఆదిత్య ఓం చేసిన కామెంట్స్ చేసిన వీడియోలను బన్నీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆ వీడియోలు వైరల్ గా మారాయి.

ఇదిలా ఉండగా, పుష్ప2 మూవీ విడుదలకు రంగం సిద్ధమైంది. పుష్ప2 తో అల్లు అర్జున్ క్రేజ్ మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ సినమా వచ్చే ఏడాది మార్చి 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ఇంకెన్ని అవార్డులు తీసుకురానుందో చూడాలి.