Begin typing your search above and press return to search.

హీరో పెళ్లి.. మరో పెద్ద గుడ్‌ న్యూస్‌!

కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ అభిమానులను సొంతం చేసుకున్న హీరో విశాల్‌ పెళ్లి గురించి దాదాపు 10 సంవత్సరాలుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి.

By:  Tupaki Desk   |   20 July 2025 8:00 PM IST
హీరో పెళ్లి.. మరో పెద్ద గుడ్‌ న్యూస్‌!
X

కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ అభిమానులను సొంతం చేసుకున్న హీరో విశాల్‌ పెళ్లి గురించి దాదాపు 10 సంవత్సరాలుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి. విశాల్‌ పెళ్లి ఇదిగో, అదిగో అంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. దాంతో ఆ మధ్య విశాల్‌ స్వయంగా మాట్లాడుతూ తాను నడిగర్‌ సంఘం పూర్తి చేసే వరకు పెళ్లి చేసుకోను అంటూ ప్రకటించాడు. నడిగన్ సంఘం బిల్డింగ్‌ నిర్మాణం జరుగుతోంది. ఇప్పటికే సగానికి పైగా పూర్తి అయింది. త్వరలోనే నిర్మాణం పూర్తి కానున్నట్లుగా విశాల్‌ ప్రకటించాడు. మరో వైపు విశాల్‌ ప్రేమ వ్యవహారాల గురించి ఎప్పటికప్పుడు మీడియాలో, సోషల్‌ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తూనే ఉన్నాయి. తాజాగా మరో పుకారు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

విశాల్‌ గతంలో వరలక్ష్మి శరత్‌ కుమార్‌తో చాలా సన్నిహితంగా ఉండేవాడు. దాంతో వీరిద్దరు పెళ్లి చేసుకుంటారని చాలా మంది అనుకున్నారు. ఇద్దరి ప్రేమ విషయం గురించి ప్రముఖంగా చర్చ జరిగింది. కానీ ఇద్దరూ చాలా సందర్భాల్లో తాము ప్రేమలో లేమని చెప్పారు. ఇప్పటికే వరలక్ష్మి శరత్‌ కుమార్‌ పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంది. ఆ తర్వాత నటి అభినయతో విశాల్‌ పెళ్లి గురించి ప్రముఖంగా వార్తలు వచ్చాయి. ఇద్దరి పెద్దలు కూడా మాట్లాడుకుని పెళ్లికి సిద్ధం అయ్యారు అంటూ వార్తలు వచ్చాయి. కానీ అభినయతో విశాల్‌ పెళ్లి అనేది కూడా పుకార్లే అని ఆ తర్వాత తేలిపోయింది. ఇటీవల అభినయ పెళ్లి కూడా చేసుకుంది.

ఇంకా అనీషా రెడ్డి, రీమా సేన్‌, లక్ష్మీ మీనన్‌... ఇలా చాలా మంది హీరోయిన్స్‌తో విశాల్‌ ప్రేమ వ్యవహారం సాగిస్తున్నాడు అంటూ పుకార్లు షికార్లు చేశాయి. చివరకు విశాల్‌ నటి సాయి ధన్సికతో ప్రేమలో ఉన్నాడని కన్ఫర్మ్‌ అయింది. నటి సాయి ధన్సిక ఆ విషయాన్ని క్లారిటీగా చెప్పేసింది. త్వరలోనే పెళ్లి అంటూ కూడా ప్రకటన చేసిందని తమిళ మీడియాలో కథనాలు వచ్చాయి. ఆ వార్తలు కొన్ని రోజులు వచ్చిన తర్వాత తిరిగి పెళ్లి ఆలస్యం అవుతుండటంతో బ్రేకప్‌ అయ్యారా ఏంటి అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేశారు. పెళ్లికి సంబంధించి అనేక పుకార్లు షికార్లు చేస్తున్న నేపథ్యంలో స్వయంగా విశాల్‌ స్పందించి గుడ్‌ న్యూస్ చెప్తాను అన్నాడు.

విశాల్‌ మాట్లాడుతూ... నడిగర్‌ సంఘం భవనం కట్టించిన తర్వాతే పెళ్లి చేసుకుంటాను అన్నాను. అందుకే 9 ఏళ్లుగా పెళ్లి చేసుకోలేదు. భవనం నిర్మాణం చివరి దశకు చేరుకుంది. నడిగర్‌ భవన్‌ లో జరగబోతున్న మొదటి పెళ్లి నాదే కాబోతుంది. ఆగస్టు 29న ఒక పెద్ద గుడ్‌ న్యూస్‌ చెప్పబోతున్నట్లు విశాల్‌ పేర్కొన్నాడు. ఆగస్టులో నడిగర్‌ సంఘం భవనం నిర్మాణం పూర్తి కానున్నట్లు తమిళ మీడియా వర్గాల్లో టాక్‌ వినిపిస్తుంది. కనుక భవన నిర్మాణం పూర్తి అయిన వెంటనే తన ప్రేమ, పెళ్లి విషయమై ఆగస్టు 29న అధికారికంగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. అంటే వెంటనే సెప్టెంబర్‌ లేదా అక్టోబర్‌లోనే విశాల్‌ పెళ్లి ఉంటుంది. మొత్తానికి 2025లో విశాల్‌ పెళ్లి జరగడం కన్ఫర్మ్‌ అనేది అభిమానులకు చాలా పెద్ద గుడ్‌ న్యూస్‌ అనడంలో సందేహం లేదు.