కూలీ నుంచి స్టార్ గా అతడి ప్రయాణం!
స్టార్ హీరో సినిమాలో భాగమైనా హీరో తర్వాత హీరో రోల్ ప్రాధాన్యత అతడికి ఉంటుంది.
By: Srikanth Kontham | 28 Aug 2025 11:20 AM ISTకోలీవుడ్ యాక్టర్ సూరి సుపరిచితమే. అనువాద చిత్రాలతో తెలుగు ఆడియన్స్ కు బాగా తెలిసిన నటుడు. స్టార్ హీరోల చిత్రాల్లో కీలక పాత్రలతో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడిగా ఎన్నోసినిమాలు చేసాడు. చిత్ర పరిశ్రమలో రెండున్నర దశాబ్దాల ప్రయాణం అతనిది. అన్ క్రెడిటెట్ రోల్స్ ఎన్నో చేసాడు. వాటి తర్వాత `జీ `సినిమాతో కాలేజ్ స్టూడెంట్ రోల్ తో వెలుగులోకి వచ్చాడు. అక్కడ నుంచి నుంచి సూరి కెరీర్ లో వెనక్కి తిరిగి చూడలేదు. సూరి నటించిన సినిమాలు ఏడాదికి ఐదారైనా రిలీజ్ అవుతుంటాయి.
స్టార్ హీరో సినిమాలో భాగమైనా హీరో తర్వాత హీరో రోల్ ప్రాధాన్యత అతడికి ఉంటుంది. `విడుదలై` సినిమాతో సూరి హీరోగానూ కొత్త ప్రయాణం మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. వెట్రీమారన్ తెరకెక్కించిన సినిమా పెద్ద విజయం సాధించడంతో సూరి కి మంచి పేరొచ్చింది. అప్పటి వరకూ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సూరి పై కొత్త ఇమేజ్ ఏర్పడింది. తర్వాత నటించిన `గరుడన్`, `మామన్` లాంటి సినిమాలు మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సూరి హీరోగా `మందాడి` అనే స్పోర్స్ట్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ సినిమా తెరకెక్కుతోంది.
ఈ చిత్రంతోనే తెలుగు నటుడు సుహాస్ కోలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్నాడు. అందులో విలన్ గా కావడం విశేషం. ఇందులో సూరితో పోరాటానికి దిగేది సుహాస్ రోల్. నటన సహా ఆహార్యాల పరంగా ఇద్దరు మ్యాచ్ అవుతారు. ఆ సంగతి పక్కన బెడతే తాజాగా సూరి కెరీర్ ఆరంభ రోజుల్లోకి వెళ్లిపోయాడు. 20 రూపాయలతో తన జీవితం ప్రారంభమైందన్నారు. తన తొలిసంపాదన 20 రూపాయలు ఓ కూలి పని చేసిసంపాదించి నట్లు గుర్తు చేసుకున్నారు. `ఈ రోజుల్లో లక్షలు సంపాదిస్తున్నా? ఆ 20 ఇప్పటికీ ఎంతో గుర్తు.
ఎప్పటికీ మర్చిపోలేని అనుభవం` అది అన్నారు. రోజంతా కష్టపడి పని చేస్తే ఇరవై వచ్చేది. ఇప్పుడు గంటల ప్రకారం డబ్బు వస్తుంది. నాటి కష్ట కాలం నాటి రోజులు...నేటి సంపాదన కాలం నాటి రోజులు ఎప్పటికీ గుర్తిండిపోయేవన్నారు. డబ్బు లేకపోతే సోసైటీలో ఎదురయ్యే అనుభవాలు ఎలా ఉంటాయో చూసినవాడినన్నారు. అలాగని డబ్బు కోసమే తపించే వాడిని కాదన్నారు. డబ్బున్నా లేకపోయినా తాను జీవితంలో మాత్రం ఎప్పుడూ సంతోషంగానే ఉంటానని అన్నారు.
