Begin typing your search above and press return to search.

ట్రాక్ తప్పితే కష్టం సుమా..?

ఐతే సుహాస్ సినిమా సక్సెస్ అయిన సినిమా మాట్లాడుతుంది.. ప్రేక్షకులను అలరిస్తుంది. కానీ మరో సైడ్ అతని సినిమాలు ఇంప్రెస్ చేయలేకపోతే మాత్రం దారుణంగా ఉంటున్నాయి.

By:  Tupaki Desk   |   12 July 2025 11:29 PM IST
ట్రాక్ తప్పితే కష్టం సుమా..?
X

షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ ఆ ఐడెంటిటీతో సినిమాల్లో సైడ్ రోల్స్ చేస్తూ అలా చిన్నగా లీడ్ రోల్ ఛాన్స్ లు అందుకుని సక్సెస్ ఫుల్ హీరోగా కంటెంట్ ఉన్న సినిమాలను చేస్తూ వస్తున్నాడు సుహాస్. అతని సినిమా అంటే చాలు ఆడియన్స్ ఏదో ఒక విషయం ఉంటుందిలే అనేలా చేసుకున్నాడు. కలర్ ఫోటో సినిమాతో అతను మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత చిన్నగా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ వస్తున్నాడు.

ఐతే సుహాస్ సినిమా సక్సెస్ అయిన సినిమా మాట్లాడుతుంది.. ప్రేక్షకులను అలరిస్తుంది. కానీ మరో సైడ్ అతని సినిమాలు ఇంప్రెస్ చేయలేకపోతే మాత్రం దారుణంగా ఉంటున్నాయి. అఫ్కోర్స్ స్టార్ సినిమాలే మొదటి ఆటకు రిజల్ట్ డిసైడ్ అయితే ఈవెనింగ్ ఆటకి థియేటర్లు ఖాళీ అలాంటిది సుహాస్ సినిమా అలా అవ్వడంలో డౌట్ పడాల్సింది లేదు.

ఐతే సుహాస్ ఎంచుకునే కథల వల్లో లేదా అతని పాత్రలు అటు ఇటుగా ఒకేలా ఉన్నాయనిపించడం వల్లో కానీ ఎందుకో ఈమధ్య సుహాస్ ట్రాక్ తప్పినట్టు కనిపిస్తున్నాడు. కొన్నిసార్లు ఒకటే ఫార్మెట్ లో సినిమాలు చేసినా కూడా ఆడియన్స్ కి బోర్ కొట్టేస్తుంది. ప్రస్తుతం సుహాస్ విషయంలో అదే జరుగుతుందనిపిస్తుంది.

ఈమధ్యనే ప్రైమ్ వీడియోలో ఉప్పు కప్పురంబు సినిమా చేసిన సుహాస్ ఆ సినిమాకు అంత గొప్ప రెస్పాన్స్ రాలేదు. ఇక రీసెంట్ గా థియేటర్ లోకి ఓ భామ అయ్యో రామా వచ్చింది. శుక్రవారం రిలీజైన ఈ సినిమా కూడా అంతగా ఏం లేదని అంటున్నారు. డైరెక్టర్ కథ బాగానే రాసుకున్నప్పటికీ ఎందుకో కథనంలో సినిమా తేలగొట్టాడని అందరు అంటున్నారు.

సుహాస్ మాత్రం ఓ భామ అయ్యో రామా సినిమాపై చాలా హోప్స్ పెట్టుకున్నాడు. అతను సినిమా పక్కా హిట్ అనే నమ్మకంతో ఉన్నాడు. కానీ రిజల్ట్ మాత్రం వేరుగా ఉంది. ఐతే ఈ సినిమా రిజల్ట్ చూశాక అయినా సుహాస్ తన సినిమాల పంథా మార్చుకుంటే బెటర్ అని చెప్పొచ్చు. ప్రస్తుతం సుహాస్ మరో రెండు సినిమాలు చేస్తున్నాడు. ఆ సినిమాల విషయంలో ఇంకాస్త జాగ్రత్త పడితే అతని కెరీర్ కు మంచిదని చెప్పొచ్చు. మరి సుహాస్ నెక్స్ట్ సినిమాల్లో ఎలా చేస్తాడు.. ఎలాంటి కథలతో వస్తాడన్నది చూడాలి. ఇదే కొనసాగి కెరీర్ పూర్తిగా ట్రాక్ తప్పితే మాత్రం ఛాన్స్ లు రావడం కూడా కష్టమవుతుంది.