Begin typing your search above and press return to search.

సినీప‌రిశ్ర‌మ‌లో విషాదం.. భార‌తీరాజా కుమారుడు మృతి

అత‌డు ఇప్ప‌టికే ప‌లు చిత్రాలకు దర్శకత్వం వహించారు. మనోజ్ భారతి కొన్ని చిత్రాలలో నటించారు.

By:  Tupaki Desk   |   25 March 2025 9:52 PM IST
సినీప‌రిశ్ర‌మ‌లో విషాదం.. భార‌తీరాజా కుమారుడు మృతి
X

దర్శక‌నటుడు భారతీరాజా కుమారుడు మనోజ్ భారతి గుండెపోటుతో మరణించడం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. డైరెక్ట‌ర్ హిమాయం అని కూడా అత‌డిని స‌న్నిహితులు పిలుస్తారు. అత‌డు ఇప్ప‌టికే ప‌లు చిత్రాలకు దర్శకత్వం వహించారు. మనోజ్ భారతి కొన్ని చిత్రాలలో నటించారు. తాజ్ మహల్ సినిమా ద్వారా హీరోగా సినీరంగంలోకి అడుగుపెట్టిన మనోజ్ సముద్రమ్, కదల్ పూక్కల్, పల్లవన్, మానాడు, విరుమాన్ వంటి చిత్రాల్లో నటించారు. మనోజ్ ఆకస్మిక గుండెపోటుతో మరణించారు. ఆయన వయస్సు 48 సంవత్సరాలు.


మనోజ్ తొలుత‌ అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసారు. అత‌డు సౌత్ ఫ్లోరిడా విశ్వవిద్యాలయంలో థియేటర్ ఆర్ట్స్ చదివారు. ఫైనల్ కట్ ఆఫ్ డైరెక్టర్ (2016) వంటి చిత్రాలలో తన తండ్రికి సహాయకుడిగా పనిచేశారు. సినిమాల‌పై విప‌రీత‌మైన మ‌క్కువ కార‌ణంగా అత‌డు తండ్రితో పాటు సినీప‌రిజ్ఞానం సంపాదించేందుకు చాలా హార్డ్ వ‌ర్క్ చేసాడు. శంక‌ర్ వ‌ద్ద ఎందిర‌న్ చిత్రానికి స‌హాయ‌కుడిగా ప‌ని చేసాడు. ప‌లు వెబ్ సిరీస్ ల‌లోను న‌టించి మంచి పేరు తెచ్చుకున్నాడు.

వ్యక్తిగతంగా మనోజ్ తన చిరకాల స్నేహితురాలు, తమిళ నటి నందనను 19 నవంబర్ 2006న వివాహం చేసుకున్నాడు. వారికి ఇద్దరు ఆడపిల్లలు - ఆర్తిక, మతివదని. కొన్ని రోజుల క్రితం గుండె ఆపరేషన్ చేయించుకున్న మనోజ్ ఈ సాయంత్రం చెట్‌పట్‌లోని తన ఇంట్లో గుండెపోటుతో మరణించాడు. ఈ సంఘటన ఇప్పుడు చిత్ర పరిశ్రమలో కలకలం సృష్టించింది.