ఫైనల్ గా అబ్బాస్ కి ఒక గొప్ప ఛాన్స్..!
ఒకప్పుడు తెలుగు తమిళ భాషల్లో ఆడియన్స్ ని అలరించిన అబ్బాస్ ఇప్పుడు పూర్తిగా వెండితెరకు దూరమయ్యాడు.
By: Tupaki Desk | 25 July 2025 3:07 PM ISTఒకప్పుడు తెలుగు తమిళ భాషల్లో ఆడియన్స్ ని అలరించిన అబ్బాస్ ఇప్పుడు పూర్తిగా వెండితెరకు దూరమయ్యాడు. విదేశాల్లో అతనేదో పని చేసుకుంటూ ఉన్నాడని సోషల్ మీడియాలో చెబుతుంటారు. 2015 లో చివరగా పచ్చ కాలం అనే మలయాళం సినిమాలో నటించాడు అబ్బాస్. 1990, 2000ల కాలంలో అబ్బాస్ అంటే ఆడియన్స్ కి ఎంతో ఇష్టం. అతను నటించిన ప్రేమదేశం సినిమా అతనికి చాలా పాపులారిటీ తెచ్చి పెట్టింది.
హీరోగా, సపోర్టింగ్ యాక్టర్ గా అబ్బాస్ చాలా సినిమాల్లో నటించారు. ఐతే తెలుగులో చివరగా 2014 లో అలా ఒక్క రోజు సినిమాలో చేశాడు అబ్బాస్. ఆ తర్వాత సినిమాలు చేయలేదు. దాదాపు 11 ఏళ్ల తర్వాత మళ్లీ సిల్వర్ స్క్రీన్ పై కనిపించనున్నాడు అబ్బాస్. రీసెంట్ గా అబ్బాస్ ని ఒక తమిళ సినిమాకు ఓకే చేశారు. జివి ప్రకాష్ లీడ్ రోల్ లో నటిస్తున్న సినిమాలో అబ్బాస్ నటిస్తున్నాడు.
ఈ సినిమాను మరియరాజ డైరెక్ట్ చేస్తుండగా జయవర్ధనన్ నిర్మిస్తున్నారు. గౌరి ప్రియ హీరోయిన్ గా నటిస్తున్న ఈ ఫ్యామిలీ డ్రామాలో అబ్బాస్ కి కూడా ఒక మంచి ఇంపార్టెంట్ రోల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. అబ్బాస్ తిరిగి సినిమాల్లోకి రావడం అప్పటి అతని సినిమాలు చూసి ఇష్టపడిన వారిని సర్ ప్రైజ్ చేస్తుంది. అబ్బాస్ రీ ఎంట్రీ అతని కెరీర్ ని మళ్లీ స్ట్రాంగ్ చేస్తుందేమో చూడాలి.
జివి ప్రకాష్ చేస్తున్న సినిమా కాబట్టి ఆ సినిమా తెలుగులో కూడా రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. మరి ఈ సినిమాకు సంబందించిన మిగతా డీటైల్స్ ఏంటన్నది తెలియాల్సి ఉంది. అబ్బాస్ ని తీసుకోవాలన్న ఆలోచన ఎవరిదో కానీ కొన్నాళ్లుగా అబ్బాస్ గురించి సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వచ్చాయి. అతను సినిమాలు వదిలేశాక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాడని.. అతన్ని ఎవరు పట్టించుకోవట్లేదని అన్నారు. కానీ తనకు ఒక గుర్తింపు తెచ్చిన సినిమాలే మళ్లీ అతనికి ఒక ఆసరగా నిలబడేలా చేస్తున్నాయి.
తప్పకుండా అబ్బాస్ రీ ఎంట్రీ క్లిక్ అయితే అతనికి ఇంకా చాలా అవకాశాలు వచ్చే పాజిబిలిటీ ఉంది. తమిళ్ లో రీ ఎంట్రీ ఇస్తున్నాడంటే తెలుగులో కూడా అతన్ని ఏదో ఒక సినిమాల్లో తీసుకునే ఛాన్స్ లేకపోలేదు.
