షూటింగ్ ఆపేసి నా కోసం వచ్చేవారు: తండ్రి ప్రేమపై ఐశ్వర్య సర్జా
యాక్షన్ కింగ్ అర్జున్ తన కుమార్తె ఐశ్వర్య సర్జాని టాలీవుడ్‌కు పరిచయం చేస్తూ తీసిన సినిమా 'సీత పయనం'.
By: Tupaki Desk | 10 Feb 2026 9:31 AM ISTయాక్షన్ కింగ్ అర్జున్ తన కుమార్తె ఐశ్వర్య సర్జాని టాలీవుడ్‌కు పరిచయం చేస్తూ తీసిన సినిమా 'సీత పయనం'. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా తండ్రీకూతుళ్లు ఇద్దరూ కలిసి tupaki.com కు ప్రత్యేకంగా ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో సినిమా విశేషాలతో పాటు పర్సనల్ విషయాలను కూడా చాలా ఓపెన్‌గా షేర్ చేసుకున్నారు. ఇన్నేళ్లుగా సౌత్ ఇండస్ట్రీని ఏలుతున్న అర్జున్, ఇప్పుడు తన కూతురి కెరీర్ విషయంలో ఎంత జాగ్రత్తగా ఉన్నారో ఈ చిట్ చాట్ చూస్తే అర్థమవుతుంది.
సినిమా గురించి మాట్లాడుతూ.. ఇది ఒక బ్యూటిఫుల్ జర్నీ అని ఐశ్వర్య చెప్పారు. ఈ కాలం యూత్ కి కనెక్ట్ అయ్యేలా ట్రావెల్ బేస్డ్ కథతో ఈ సినిమా ఉంటుందని అర్జున్ వివరించారు. కేవలం ఒక లవ్ స్టోరీ లాగా కాకుండా, లైఫ్ లో ఉండే రకరకాల ఎమోషన్స్ ని ఈ సినిమాలో చూపించారట. ఫిబ్రవరి 14న వస్తున్న ఈ సినిమా తన కెరీర్ కు చాలా ఇంపార్టెంట్ అని ఐశ్వర్య క్లియర్ గా చెప్పారు.
ఇక అర్జున్ గారి గురించి మాట్లాడుతూ.. ఆయన సెట్స్ లో చాలా స్ట్రిక్ట్ గా ఉంటారని ఐశ్వర్య హింట్ ఇచ్చారు. బయట తండ్రిగా చాలా ప్రేమగా ఉన్నా, కెమెరా వెనుక మాత్రం ఆయన పక్కా ప్రొఫెషనల్ డైరెక్టర్ అని చెప్పారు. ఒక ఆర్టిస్ట్ గా తన నుంచి బెస్ట్ అవుట్ పుట్ రాబట్టడానికి ఆయన ఎక్కడా కాంప్రమైజ్ కాలేదని, ఆ విషయంలో తనకు తండ్రి అని రాయితీలు ఏమీ ఇవ్వలేదని నవ్వుతూ చెప్పుకొచ్చారు.
తమ మధ్య ఉన్న బాండింగ్ గురించి కూడా కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. అర్జున్ షూటింగ్స్ లో ఎంత బిజీగా ఉన్నా ఫ్యామిలీకి మాత్రం ఎప్పుడూ టైమ్ ఇస్తారట. ఐశ్వర్య చిన్నప్పుడు స్కూల్ లో హెల్త్ బాలేకపోయినా.. ఆయన వెంటనే షూటింగ్ నుంచి బ్రేక్ తీసుకుని వచ్చేసేవారట. స్టార్ హోదా కంటే ఫ్యామిలీ మ్యాన్ గా ఉండటమే ఆయనకు ఇష్టమని ఐశ్వర్య చాలా గొప్పగా చెప్పారు.
రాపిడ్ ఫైర్ లో కొన్ని ఫన్నీ విషయాలు బయటపడ్డాయి. అర్జున్ గారికి ఇంటి భోజనం అంటేనే చాలా ఇష్టమని, అందులోనూ లెమన్ రైస్ ఆయన ఫేవరెట్ అని తెలిసింది. అలాగే ఐశ్వర్యకు తన తండ్రి నటించిన సినిమాల్లో 'ఒకే ఒక్కడు' అంటే ఆల్ టైమ్ ఫేవరెట్ అని చెప్పారు. ఆ సినిమా సీక్వెల్ గురించి అడిగినప్పుడు.. కచ్చితంగా చేస్తే బాగుంటుందని అర్జున్ కూడా తన మనసులో మాట బయటపెట్టారు.
తెలుగు హీరోల గురించి మాట్లాడుతూ ఐశ్వర్య ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్పారు. తనకు పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టమని, ఆయన సినిమాలను రెగ్యులర్ గా ఫాలో అవుతుంటానని వెల్లడించారు. భవిష్యత్తులో మంచి కథలు దొరికితే టాలీవుడ్ లోనే సెటిల్ అవ్వాలని ఉందనే ఆశను వ్యక్తం చేశారు. కేవలం గ్లామర్ పాత్రలే కాకుండా పర్ఫార్మెన్స్ కు స్కోప్ ఉన్న క్యారెక్టర్స్ చేయాలని ఉందని తన క్లారిటీ ఇచ్చారు. ఇక, ఈ సినిమా తన తండ్రికి ఎంత గౌరవాన్ని తెచ్చిపెడుతుందని అని ఐశ్వర్య తెలిపారు. మరి ఈ 'సీత పయనం' ప్రేక్షకులను ఎంతవరకు మెప్పిస్తుందో చూడాలి.
