ఎవడు రియల్ ఫ్రెండ్ అన్నది అప్పుడు తెలిసిందట!
ఉక్కడికి వెళ్లినా ఈ సమాజం రెండు భాషలనే అర్థం చేసుకుంటుంది..వాటికే గౌరవమిస్తుంది అవే సక్సెస్ అండ్ మనీ` అంటున్నారు యాక్షన్ కింగ్ అర్జున్.
By: Tupaki Desk | 10 Feb 2026 6:00 PM ISTఉక్కడికి వెళ్లినా ఈ సమాజం రెండు భాషలనే అర్థం చేసుకుంటుంది..వాటికే గౌరవమిస్తుంది అవే సక్సెస్ అండ్ మనీ` అంటున్నారు యాక్షన్ కింగ్ అర్జున్. మా పల్లెలో గోపాలుడు, మన్నెంలో మొనగాడు సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన అర్జున్ తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో ఎన్నో సూపర్ హిట్, బ్లాక్ బస్టర్ మూవీస్‌లలో నటించాడు. హీరోగా తనదైన ప్రత్యేకతని చాటుకున్నాడు. అయితే ఒక దశలో చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నారట. శంకర్ `జెంటిల్‌మెన్`కి ముందు కెరీర్ పరంగా చాలా గడ్డుపరిస్థితుల్ని ఎదుర్కొన్నారట.
`జెంటిల్‌మెన్`కి ముందు అంతా నా పని అయిపోయిందన్నారు. అప్పుడు నా చేతిలో ఏ సినిమా లేదు. ఏ ఒక్క ఫ్రెండ్ కూడా ఆ సమయంలో లేడు. అంతా వెళ్లిపోయారు. ఎవడు రియల్ ఫ్రెండ్ అన్నది అప్పుడు తెలిసింది. నాతో మాట్లాడానికి కూడా ఎవరూ ఇష్టపడేవారు కాదు. కనీసం ట్రై కూడా చేయలేదు. ఇకపెద్ద పెద్ద ప్రొడక్షన్ కంపనీలు కూడా ఆ సమయంలో నా ఫోన్ ఎత్తడమే మానేశారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఉన్నపలంగా నేను ఒంటరి అయిపోయాను. ఇలాంటి పరిస్థిలో నేను ఏం చేయగలను అని ఆలోచించడం మొదలు పెట్టాను.
సినిమా కాకుండా నాకు ఇంకా ఏమీ తెలుసు?..డ్రైవింగ్ తెలుసు..డ్రైవర్ అవ్వొచ్చా? అనుకున్నాను. ఫైట్స్ కంపోజింగ్ నాకు తెలుసుకదా ఫైట్ మాస్టర్ అయిపోతానా? ఏంటీ అనుకున్నాను. ఆ సమయంలో సర్వైవల్ కోసం ఏదైనా ఒకటి చెయ్యాలి కదా అనిపించింది. ఇలా ఆలోచిస్తున్న సమయంలో ఎందుకు నేను డైరెక్షన్ చేయకూడదు అనుకున్నాను. అంతకు ముందు చాలా సినిమాలు చేస్తున్న సమయంలో కొంత మంది దర్శకులు అర్జున్ ఈ సీన్ కొంచెం నువ్వే తీసెయ్ అని చెప్పి వెళ్లిపోయే వాళ్లు. అలా వాళ్లు వదిలేసిన సీన్‌లు నేను పూర్తి చేసేవాడిని.
అలా చేసిన సీన్‌లకు చాలా వరకు అప్రిషియేషన్ కూడా వచ్చింది. నేను టెక్నికల్ ఓరియెంటెడ్ పర్సన్‌ని. ఏ డైరెక్టర్ ఏం తీస్తున్నాడు?..ఎలాంటి లెన్స్ వాడుతున్నాడు అన్నది ప్రత్యేకంగా గమనించేవాడిని. ఆ అనుభవంతో నేనే ఎందుకు సినిమా డైరెక్ట్ చేయకూడదని `సేవగన్` సినిమా చేశాను. నేను ప్రొడ్యూస్ చేశాను కూడా. దీని కోసం నా ప్రాపర్టీని అమ్మేశా. షూటింగ్, ప్రోస్ట్ ప్రొడక్షన్ అంతా పూర్తయింది. నేను ఎకనామికల్‌గా జీరోకి వచ్చేశాను. అయితే ఈ మూవీని కొనడానికి ఒక్కరంటే ఒక్కరు కూడా ముందుకు రాలేదు.
సినిమా కొనడానికి ఒక్క డిస్ట్రిబ్యూటర్ కూడా రావడం లేదేంటా అని ప్రత్యేకంగా ప్రివ్యూ వేయాలని నిర్ణయించుకుని ప్రివ్యూ వేశాను. అందులో కొంత మంది ఫస్ట్ హాఫ్ చూసి వెళ్లిపోయారు. సెకండ్ హాఫ్ చూడటానికి పది నుంచి పన్నెండు మంది మాత్రమే ఉన్నారు. సినిమా చూస్తూ డైరెక్టర్‌గా తీసింది నేనేనా అని ఆశ్చర్యపోతున్నా కానీ నిర్మాతగా మాత్రం చాలా కంగారుగా ఉంది. సినిమా చూసిన పన్నెండు మంది సెకండ్ హాఫ్ ఎక్స్‌ట్రార్డినరీగా ఉందని బయట చెప్పేశారు. నెక్స్ట్ డే ఇద్దరు ఓ బ్యాగు పట్టుకుని వచ్చారు.
సర్ పలానా ఏరియా ఇస్తారా? అని అడిగారు..వెంటనే ఇస్తాను రావయ్యా అని ఫైనల్ చేసుకున్నాను. సినిమా రిలీజ్ చేశాను. పెద్ద హిట్ అయింది.. మళ్లీ నాకు మంచి టైమ్ మొదలైంది. ఆ తరువాత ఇదే ఊపుతో `ప్రతాప్` అని మరో సినిమా చేశాను. అది కూడా పెద్ది హిట్ అయింది. ఆ తరువాతే `జెంటిల్‌మెన్` వచ్చింది. ఆ టైమ్‌లో `జెంటిల్‌మెన్` చేయనని చెప్పాను` అంటూ అర్జున్ ఆనాటి తన పరిస్థితుల్ని, అప్పుడు తనని ఇండస్ట్రీ వర్గాలు దూరం పెట్టిన క్రమాన్ని బయటపెట్టారు.
