Begin typing your search above and press return to search.

విష్ణు 'కన్నప్ప'.. లేటెస్ట్ బజ్ ఏమిటంటే..

తన తండ్రి, డైలాగ్ కింగ్ మోహన్ బాబు బర్త్ డే సందర్భంగా మార్చి 19వ తేదీన కన్నప్ప స్టోరీ బుక్ వాల్యూమ్-1ను లాంఛ్ చేశారు.

By:  Tupaki Desk   |   20 March 2024 1:31 PM GMT
విష్ణు కన్నప్ప.. లేటెస్ట్ బజ్ ఏమిటంటే..
X

టాలీవుడ్ హీరో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప ప్రస్తుతం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో మంచు మూడు తరాల వారసులు నటిస్తున్నారు. విష్ణు కుమారుడు కూడా ఈ మూవీలో యాక్ట్ చేస్తున్నాడు. ఇటీవల ఈ ప్రతిష్ఠాత్మకమైన ప్రాజెక్ట్ షూటింగ్ రెండో షెడ్యూల్ పూర్తైన విషయం తెలిసిందే. త్వరలోనే కొత్త షెడ్యూల్ ను ప్రారంభించనున్నారు మేకర్స్. అంతకుముందు ఒక మంచి పని చేశారు విష్ణు.


సిల్వర్ స్క్రీన్ పైకి కన్నప్ప కథను తీసుకొచ్చేముందు.. ఆ స్టోరీ అందరికీ తెలియాలని, ముఖ్యంగా పిల్లలకు అర్థమవ్వాలని కన్నప్ప కామిక్ బుక్ ను ఆవిష్కరించారు. తన తండ్రి, డైలాగ్ కింగ్ మోహన్ బాబు బర్త్ డే సందర్భంగా మార్చి 19వ తేదీన కన్నప్ప స్టోరీ బుక్ వాల్యూమ్-1ను లాంఛ్ చేశారు. ఈ బుక్ భక్త కన్నప్ప పురాణ గాథను కామిక్ రూపంలో వివరిస్తుంది. కన్నప్ప సినిమా స్టోరీ తెలుసుకునేందుకు హెల్ప్ అవుతుంది.


ఈ సందర్భంగా మంచు విష్ణు మాట్లాడారు. "కన్నప్ప స్టోరీ అందరూ తెలుసుకోవాలని నేను కోరుకున్నాను. ఇప్పుడు ఆవిష్కరించిన కామిక్ బుక్.. సేమ్ సినిమాలనే ఉంటుంది. నేను చదివిన అత్యంత ఉత్తమమైన కథను ప్రపంచానికి తెలియజేయాలనేది నా డ్రీమ్. యువత ఈ కథతోపాటు చరిత్ర తెలుసుకోవాలి. నేను ఇది డబ్బు కోసం చేస్తున్న పని కాదు. నా మనసుకు దగ్గరైన కన్నప్ప కథను ప్రపంచమంతా తెలుసుకోవాలని భావిస్తున్నాను" అని విష్ణు తెలిపారు.

అయితే కన్నప్ప కామిక్ బుక్ ద్వారా భక్తి, త్యాగం వంటి భావనలు అందరికీ తెలుస్తాయి. ఇందులో కన్నప్ప సాహసం, భావోద్వేగం, ఆధ్యాత్మిక భావనలు చూపించనున్నారు. ఈ కామిక్ పుస్తకంతో విష్ణు.. భక్త కన్నప్ప చరిత్రను ప్రస్తుత తరానికి అందుబాటులో ఉంచాలని టార్గెట్ గా పెట్టుకున్నారు. ఇన్ స్టాగ్రామ్ లో మెసేజ్ రూపంలో అడ్రస్ కరెక్ట్ గా పంపితే ఉచితంగా కన్నప్ప స్టోరీ బుక్ వాల్యూమ్-1 పుస్తకాలు అందుతాయి.

సుమారు రూ.150 కోట్ల భారీ బడ్జెట్ తో కన్నప్ప సినిమా రూపొందిస్తున్నట్లు సమాచారం. పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పలువురు స్టార్ నటీనటులు యాక్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు ప్రముఖ హాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ షెల్డన్ చౌ, యాక్షన్ డైరెక్టర్ కేచా ఖంఫక్డీ , డ్యాన్స్ మాస్ట్రో ప్రభుదేవా వంటి టాప్ టెక్నీషియన్స్ పని చేస్తున్నారు. మరి ఈ భారీ ప్రాజెక్ట్ ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో వేచి చూడాలి.