అబ్కీ బార్ అర్జున్ సర్కార్.. హిట్ 3 హై వోల్టేజ్ సాంగ్!
నేచురల్ స్టార్ నాని మరోసారి తన స్టైల్, డెఫినిషన్, మాస్ ఎనర్జీతో ప్రేక్షకుల మనసు దోచేందుకు సిద్ధమయ్యాడు.
By: Tupaki Desk | 9 April 2025 4:24 PMనేచురల్ స్టార్ నాని మరోసారి తన స్టైల్, డెఫినిషన్, మాస్ ఎనర్జీతో ప్రేక్షకుల మనసు దోచేందుకు సిద్ధమయ్యాడు. హిట్ ఫ్రాంఛైజీకి కొనసాగింపుగా వస్తున్న “హిట్: ది థర్డ్ కేస్” సినిమాతో నాని రాబోతున్నాడు. డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో, వాల్ పోస్టర్ సినిమా, యూనానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్స్‌పై ప్రశాంతి తిపిరినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా నుంచి వచ్చిన మొదటి పాట ప్రేమ సన్నివేశాలను చూపించగా, ఇప్పుడు విడుదలైన రెండవ పాట మాత్రం పూర్తిగా అర్జున్ సర్కార్ గర్జనలా మారింది.
“అబ్కీ బార్ అర్జున్ సర్కార్” అనే టైటిల్‌తో విడుదలైన ఈ రెండవ పాట అర్జున్ సర్కార్ అనే పాత్ర యొక్క అసలైన స్వరూపాన్ని చూపిస్తుంది. ఆయన వ్యక్తిత్వం ఎలా ఉంటుందో, ఎలాంటి ఆగడాలు సహించడు, తప్పు చేసిన వారిని వదలడు అనే అంశాలను పక్కా మాస్ అటిట్యూడ్‌తో ప్రెజెంట్ చేసింది ఈ పాట. కృష్ణకాంత్ రాసిన పదాలు అర్జున్ పాత్రలోని ఆగ్రహాన్ని, నిబద్ధతను, న్యాయం కోసం చేసే పోరాటాన్ని ఆవిష్కరించాయి.
మిక్కీ జే మేయర్ సంగీతం ఈసారి అందరినీ ఆశ్చర్యపరిచేలా ఉంది. ఎమోషన్, ఎనర్జీ, ఎలక్ట్రిక్ అండ్ మాస్ టోన్ ఈ పాటకు బలాన్నిచ్చాయి. అనురాగ్ కులకర్ణి ఆలపించిన ఈ పాటలోని వాయుస్ అద్భుతంగా హైలెట్ అయ్యాయి. నాని ఈ పాటలో చూపించిన యాటిట్యూడ్, బాడీ లాంగ్వేజ్, పవర్ఫుల్ ప్రెజెన్స్ అన్నీ కలిపి పాటను రఫ్ట్ మాస్ యాంథమ్‌గా నిలిపేశాయి.
సినిమాటోగ్రఫీ విభాగంలో సాను జాన్ వర్గీస్ తన కెమెరా పనితనంతో ప్రతి క్షణాన్ని శక్తివంతంగా చిత్రీకరించారు. ఆర్ట్ డిజైనర్ శ్రీ నాగేంద్ర తంగాల అందించిన విజువల్ ట్రీట్మెంట్ ఈ పాటకు స్పెషల్ హైలైట్‌గా నిలిచాయి. యాక్షన్ థ్రిల్లర్‌కు అవసరమైన విజువల్స్‌ను పర్ఫెక్ట్గా అందించారు. ఈ పాట చివర్లో మేకర్స్ ట్రైలర్ రిలీజ్ డేట్‌ను కూడా ప్రకటించారు. ఏప్రిల్ 14న హిట్: ది థర్డ్ కేస్ థియేట్రికల్ ట్రైలర్ గ్రాండ్ గా విడుదల కానుంది.
ఇక సినిమా విడుదల తేదీ మే 1నగా ఫిక్స్ అయింది. నాని ఫ్యాన్స్‌తో పాటు క్రైమ్ యాక్షన్ ఫిక్షన్‌ను ఇష్టపడే ప్రేక్షకులు కూడా ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇక క్యాస్టింగ్ విషయానికి వస్తే నానికి జోడిగా శ్రీనిధి శెట్టి కనిపించనున్నారు. ఇప్పటికే టీజర్లో ఈ జంట మధ్య కెమిస్ట్రీ ఆకట్టుకోగా, ఈ పాటలోనూ నాని పాత్రలోని పవర్ దృఢంగా కనిపించింది. మొత్తంగా చెప్పాలంటే, “అబ్కీ బార్ అర్జున్ సర్కార్” పాటతో హిట్ 3 ప్రమోషన్స్ ఓ రేంజ్లో స్టార్ట్ అయ్యాయి. మరి మే 1న ఈ సినిమా బాక్సాఫీస్‌ను ఏ రేంజ్ లో కదిలిస్తుందో చూడాలి.