Begin typing your search above and press return to search.

నువ్వా నేనా.. బాక్సాఫీస్ వద్ద కమెడియెన్స్ పోరు

ఇప్పుడు మూవీ లవర్స్ దృష్టంతా నెక్స్ట్ వారం రిలీజ్ అయ్యే సినిమాలపై పడింది. అయితే ఈ సారి క్రేజీగా ఇద్దరు టాలీవుడ్ కమెడియన్లు వైవా హర్ష, అభినవ్ గోమటం బాక్సాఫీస్ వద్ద పోటీ పడుతున్నారు.

By:  Tupaki Desk   |   18 Feb 2024 5:49 AM GMT
నువ్వా నేనా.. బాక్సాఫీస్ వద్ద కమెడియెన్స్ పోరు
X

సాధారణంగా బాక్సాఫీస్ వద్ద బడా హీరోల నుంచి యంగ్ కథానాయకుల వరకు అందరూ పోటీ పడుతుంటారు. పక్కపక్క తేదీల్లో సినిమాలు రిలీజ్ అయితే ఆ క్లాష్ వేరే లెవల్ లో ఉంటోంది. అయితే ఈ ఏడాది సంక్రాంతికి పెద్ద క్లాషే ఉంటుందని అంతా ఊహించారు. కానీ అవన్నీ తలకిందులై చిన్న సినిమాగా విడుదలైన హనుమాన్ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. కోట్లలో లాభాలు సంపాదించింది.

ఇక ఫిబ్రవరి నెలలో పెద్దగా సినిమాల సందడి కనిపించలేదు. మొదటి వారంలో సుహాస్ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ తో వచ్చి మంచి హిట్ అందుకున్నారు. ఇక సెకండ్ వీక్ లో మాస్ మహారాజా ఈగల్ మూవీ రిలీజై డీసెంట్ టాక్ దక్కించుకుంది. యాత్ర-2, లాల్ సలామ్ డిజాస్టర్లుగా మిగిలాయి. ఈ వారంలో యంగ్ హీరో సందీప్ కిషన్ ఊరు పేరు భైరవకోన రిలీజై మిక్స్ డ్ టాక్ అందుకుంది. కానీ వసూళ్లు బాగానే రాబడుతోంది. .

ఇప్పుడు మూవీ లవర్స్ దృష్టంతా నెక్స్ట్ వారం రిలీజ్ అయ్యే సినిమాలపై పడింది. అయితే ఈ సారి క్రేజీగా ఇద్దరు టాలీవుడ్ కమెడియన్లు వైవా హర్ష, అభినవ్ గోమటం బాక్సాఫీస్ వద్ద పోటీ పడుతున్నారు. వారిద్దరూ వేర్వేరుగా లీడ్ రోల్స్ లో నటించిన సుందరం మాస్టర్, మస్తు షేడ్స్ ఉన్నాయ్ రా సినిమాలు వచ్చే వారం విడుదల కానున్నాయి. అయితే ఈ రెండు చిత్రాల నిర్మాతలు కంటెంట్ పైనే నమ్ముకుని మూవీలు తీశారు.

వైవా హర్ష నటించిన సుందరం మాస్టర్ మూవీని కళ్యాణ్ సంతోష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించగా.. హీరో రవితేజ నిర్మించారు. ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి విడుదలైన ఫ‌స్ట్ లుక్‌, టీజ‌ర్, ట్లైలర్ మంచి రెస్పాన్స్ ద‌క్కించుకున్నాయి. ఓ గ్రామానికి ఇంగ్లీష్‌ టీచర్‌ గా వెళ్లిన సుందరం మాస్టర్‌ (వైవా హర్ష) కు అక్కడ ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయనేది ఈ సినిమా క‌థ. ఈ కామెడీ ఎంటర్టైనర్ ఫిబ్ర‌వ‌రి 23న ప్రేక్షకుల ముందుకు రానుంది.

మరోవైపు, కమెడియన్ అభినవ్ గోమటం లీడ్ రోల్ లో నటిస్తున్న మస్తు షేడ్స్ ఉన్నాయ్ రా మూవీని తిరుప‌తి రావు దర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఒక చిన్న గ్రామంలో టెన్త్ క్లాస్ చదివిన మనోహర్ (అభినవ్) గొప్ప పెయింటర్ అవ్వాల‌ని అనుకుంటాడు. ఇంతలో ప్రేమలో పడతాడు. మరి అతడి కలలు నెరవేరాయో లేదోన్ననదే ఈ సినిమా స్టోరీ. ఈ మూవీ కూడా ఫిబ్రవరి 23వ తేదీనే రిలీజ్ కానుంది. అయితే ఈ రెండు చిత్రాలకు బెనిఫిట్ ఏంటంటే.. బరిలోకి పెద్ద సినిమాలు ఏవీ లేకపోవడం. మరి బాక్సాఫీస్ వద్ద ఈ రెండు చిత్రాలు ఎలాంటి రిజల్ట్ సాధిస్తాయో.