Begin typing your search above and press return to search.

KH234: కమల్‌హాసన్ ఫ్యాన్స్‌కు బిగ్ ట్రీట్

అక్టోబర్ 21న ప్రసారమైన బిగ్ బాస్ తమిళ్ ఎపిసోడ్‌లో, ప్రాజెక్ట్ టీజర్‌ను చిత్రీకరించడానికి తాను ఏస్ డైరెక్టర్‌తో క‌లిసి ప‌ని చేయ‌బోతున్నట్లు క‌మ‌ల్ హాస‌న్ వెల్లడించాడు.

By:  Tupaki Desk   |   27 Oct 2023 10:13 AM GMT
KH234: కమల్‌హాసన్ ఫ్యాన్స్‌కు బిగ్ ట్రీట్
X

యూనివర్సల్ హీరో కమల్ హాసన్ 30 ఏళ్ల తర్వాత లెజెండరీ మణిరత్నంతో చేతులు కలిపారు. KH234 అని తాత్కాలికంగా పేరు పెట్టారు. ఇది ఇద్దరు లెజెండ్‌ల కాంబినేష‌న్ ని సూచిస్తుంది. కాబట్టి ఈ చిత్రం పై భారీ హైప్ నెల‌కొంది. రాజ్ కమల్ ఇంటర్నేషనల్ ఫిల్మ్స్, మద్రాస్ టాకీస్ బ్యానర్లపై కమల్ హాసన్, మణిరత్నం, ఆర్ మహేంద్రన్, శివ అనంతి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. నవంబర్ 7న కమల్ హాసన్ పుట్టినరోజును పురస్కరించుకుని భారీ అప్ డేట్ ని అందిస్తార‌ని మేకర్స్ ఇప్పుడు ధృవీకరించారు.

ఈ సినిమాలో త్రిష, దుల్కర్ సల్మాన్, జయం రవి భాగస్వామ్యమయ్యారనే ప్రచారం జోరుగా సాగుతోంది. నవంబర్ 7న మనం నటీనటుల గురించి తెలుసుకునే అవకాశం ఉంది. రెడ్ జెయింట్ ఫిల్మ్స్ పతాకంపై ఉదయనిధి స్టాలిన్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ స్వరకర్త. 36 ఏళ్ల తర్వాత మణిరత్నం, కమల్‌హాసన్ కాంబినేష‌న్ మూవీ రాబోతోంద‌నేది ప్రేక్ష‌కుల్లో ఉత్కంఠ క‌లిగించే అంశం.. ఈ ప్రాజెక్ట్ కి తాత్కాలికంగా KH234 అని పేరు పెట్టారు. 1987 గ్యాంగ్‌స్టర్ యాక్షన్ చిత్రం నాయకన్ తర్వాత వీరిద్దరూ కలిసి ప‌ని చేస్తున్న రెండవ చిత్రంగా దీనిపై భారీ బ‌జ్ నెల‌కొంది. తాజా స‌మాచారం మేర‌కు.. ఇద్దరు లెజెండ్‌లు కలిసి ఉన్న ఫోటోల‌ను, త‌దుప‌రి ప్రాజెక్ట్ కి ప‌ని చేసే టీమ్ ఫోటోల‌ను సోష‌ల్ మీడియాల్లో షేర్ చేయగా అవి వైర‌ల్ గా మారాయి.

అక్టోబర్ 21న ప్రసారమైన బిగ్ బాస్ తమిళ్ ఎపిసోడ్‌లో, ప్రాజెక్ట్ టీజర్‌ను చిత్రీకరించడానికి తాను ఏస్ డైరెక్టర్‌తో క‌లిసి ప‌ని చేయ‌బోతున్నట్లు క‌మ‌ల్ హాస‌న్ వెల్లడించాడు. కమల్ హాసన్ 69వ పుట్టినరోజును పురస్కరించుకుని నవంబర్ 7న టీజర్‌ను ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ఆయన తెలిపారు. భారతీయ సినిమా ఏకీకృత శక్తులు, వేడుకలు ప్రారంభిద్దాం అనే శీర్షికతో ఉన్నారు.

ఈ చిత్రంలో త్రిష కృష్ణన్, జయం రవి మరియు దుల్కర్ సల్మాన్ త‌దిత‌రులు న‌టిస్తున్నారు.

ఈ చిత్రానికి సంగీతం ఎఆర్ రెహమాన్ అందించనుండ‌గా, ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రవి కె. చంద్రన్ సినిమాటోగ్ర‌ఫీ అందించ‌నున్నారు. శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్‌గా ప‌ని చేయ‌నున్నారు. స్టంట్ ద్వయం అన్బరివ్ యాక్షన్ కి దర్శకత్వం వహిస్తారు.

కమల్ హాసన్ భారీ అంచనాలతో కూడిన సైన్స్ ఫిక్షన్ చిత్రం కల్కి 2898 AD సహా అనేక సినిమాలు క్యూలో ఉన్నాయి. 1997 బ్లాక్ బ‌స్ట‌ర్ ఇండియన్ సీక్వెల్ లోను న‌టిస్తున్నాడు. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్, నెదుమూడి వేణు, రకుల్ ప్రీత్ సింగ్, సిద్ధార్థ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది స్వాతంత్య్ర‌ దినోత్సవం రోజున విడుదల కానుంది.