Begin typing your search above and press return to search.

లెజెండ్ త‌న‌యుడికి ఆ ఛాన్స్ జీరో ప‌ర్సంటేజ్!

అభిషేక్ బచ్చన్ తెరకు పరిచయమైన తొలి నుంచే ప్రేక్షకులు ఆయనలో అమితాబ్ బచ్చన్‌ను వెతుక్కున్నారు.

By:  Tupaki Desk   |   28 Feb 2026 7:00 PM IST
లెజెండ్ త‌న‌యుడికి ఆ ఛాన్స్ జీరో ప‌ర్సంటేజ్!
X

సూప‌ర్ స్టార్ కృష్ణ వార‌స‌త్వాన్ని మ‌హేష్, మెగాస్టార్ చిరంజీవి లెగ‌స్సీని రామ్ చ‌ర‌ణ్ చిత్ర ప‌రిశ్ర‌మ‌లో దిగ్విజ యంగా కొన‌సాగిస్తున్నారు. కృష్ణంరాజు త‌మ్ముడు కుమారుడిగా ప్ర‌భాస్, హ‌రికృష్ణ త‌న‌యుడిగా జూనియ‌ర్ ఎన్టీఆర్ ప‌రిశ్ర‌మ‌లో ఓ పెద్ద స్టార్స్ ఎదిగారు. ఈ న‌లుగురు పాన్ ఇండియాలో అగ్ర హీరోల‌గా కొన‌సాగుతున్నారు. తండ్రుల‌ను మించిన త‌న‌యులుగానూ ప‌రిశ్ర‌మ‌లో ఎదుగుతున్నారు. బాలీవుడ్ నుంచి చూసుకుంటే? రిషీ క‌పూర్ వార‌సుడిగా ర‌ణ‌బీర్ క‌పూర్, రాకేష్ రోష‌న్ వార‌సుడిగా హృతిక్ రోష‌న్, సునీల్ ద‌త్ వార‌సుడిగా సంజ‌య్ ద‌త్ , డేవిడ్ ధావ‌న్ కుమారుడిగా వ‌రుణ్ ధావ‌న్ ప‌రిశ్ర‌మ‌ను ఏలుతున్నారు.

మ‌రి బాలీవుడ్ లెజెండ్ బిగ్ బీ అమితాబ‌చ్చ‌న్ వార‌సుడిగా అభిషేక్ బెచ్చ‌న్ తండ్రి లెగ‌స్సీని ప‌రిశ్ర‌మ‌లో కొన‌సాగిస్తున్నారా? ఆ రేంజ్ ని అభిషేక్ క‌నీసం ట‌చ్ చేసాడా? అంటే లేద‌నే చెప్పాలి. అమీర్ ఖాన్, షారుక్ ఖాన్, స‌ల్మాన్ ఖాన్ లాంటి స్టార్ హీరోల స‌ర‌స‌న అభిషేక్ చేర‌లేక‌పోయాడు అన్న‌ది కాద‌న‌లేని నిజం. రెండున్నర‌ ద‌శా బ్దాల అభిషేక్ బాలీవుడ్ ప్ర‌యాణంలో ఏ నాడు ఆ ఫీట్ కు ద‌రిదాపుల్లో కూడా చేర‌లేక‌పోయాడు. న‌టుడిగా త‌న‌దైన ముద్ర మాత్ర‌మే వేసాడు త‌ప్ప బాలీవుడ్ లో త‌న‌కంటూ కొన్ని పేజీలు లిఖించ‌లేక‌పోయాడు. `రిప్యూజ్` నుంచి `ఖ‌లీద‌ర్ లాప‌ట్టా` వ‌ర‌కూ చాలా సినిమాల్లో న‌టించాడు.

వాటిలో తాను హీరోగా న‌టించిన సినిమాలు కొన్ని అయితే ఇత‌ర స్టార్స్ తో క‌లిసి ప‌ని చేసినవి మ‌రికొన్ని చిత్రాలు. కీల‌క పాత్ర‌ల్లో సైతం చాలా సినిమాల్లో పోషించాడు. రెండు ద‌శాబ్దాల అభిషేక్ ప్ర‌యాణం ఎక్కువ‌గా ఈ త‌ర‌హాలోనే హైలైట్ అయింది. సోలోగా మార్కెట్ సంపాదించ‌డంలో అభిషేక్ అనుకున్నంతగా స‌క్స‌స్ కాలేదు. సాధార‌ణంగా అమి తాబ్ వార‌సుడి సినిమా అంటే? ఎంతో హైప్ ఉంటుంది. కానీ కెరీర్ లో ఏ ద‌శ‌లోనూ ఈ ర‌క‌మైన బ‌జ్ ని అభిషేక్ త‌న సినిమాల‌తో తీసుకురాలేక‌పోయాడు. అయితే అభిషేక్ విష‌యంలో ప్రేక్ష‌కుల కోణం నుంచి మ‌రో పొర‌పాటు కూడా గ‌తంలో వైర‌ల్ అయింది.

అభిషేక్ బచ్చన్ తెరకు పరిచయమైన తొలి నుంచే ప్రేక్షకులు ఆయనలో అమితాబ్ బచ్చన్‌ను వెతుక్కున్నారు. అమితాబ్ వాయిస్, ఆయన నడక, ఆయన యాక్షన్.. ఇలా ప్రతి విషయంలోనూ పోలికలు వచ్చాయి. అమీర్, షారుఖ్ వంటి వారు ఏ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చి తమదైన సొంత ముద్ర వేసుకున్నారు. కానీ అభిషేక్ ఎప్పుడూ తన తండ్రి ఇమేజ్ అనే చట్రం నుంచి బయటకు రాలేకపోయారు. బాలీవుడ్ ఖాన్‌లకు ఒక ప్రత్యేకమైన బ్రాండ్ ఉంది. షారుక్ ఖాన్ కింగ్ ఆఫ్ రొమాన్స్ గా, అమీర్ ఖాన్ మిస్టర్ పర్ఫెక్ట్ గా, సల్మాన్ ఖాన్ మాస్ యాక్షన్ హీరోగా బాలీవుడ్ భావిస్తుంది.

కానీ అభిషేక్ విష‌యంలో స్థిర‌మైన ఇమేజ్ లేదు. చాక్లెట్ బాయ్‌గా, యాక్షన్ హీరోగా, కామెడీ నటుడిగా అన్ని పాత్ర‌లు చేశారు . కానీ ఏ ఒక్క దానిలోనూ టాప్ పొజిషన్ ను సొంతం చేసుకోలేకపోయారు. మ‌రి ఆ అగ్ర స్థానం ఇక అసాధ్య‌మేనా? అంటే అందుకు ఎంత మాత్రం ఛాన్స్ లేద‌నే చెప్పాలి. రెండున్న‌ర ద‌శాబ్దాల్లో సాధించ‌లేనిది ఇప్పుడు ఆ ఫీట్ ను అందుకోవ‌డం అసాధ్య‌మే. ఇప్ప‌టికే అభిషేక్ సినిమాలంటే ఓ ర‌క‌మైన ఇమేజ్ ప‌డిపోయింది.