ఓటీటీకి ఆ స్టార్ హీరో బ్రాండ్ గా మారుతున్నాడా?
బాలీవుడ్ లెజెండ్ అమితాబచ్చన్ తనయుడిగా బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన అభిషేక్ బచ్చన్ ప్రయాణం గురించి చెప్పాల్సిన పనిలేదు.
By: Tupaki Desk | 21 Jun 2025 3:00 AM ISTబాలీవుడ్ లెజెండ్ అమితాబచ్చన్ తనయుడిగా బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన అభిషేక్ బచ్చన్ ప్రయాణం గురించి చెప్పాల్సిన పనిలేదు. ఇమేజ్ అనే చట్రంలో ఇరుక్కోకుండా పనిచేసిన నటుడాయన. అందుకే స్టార్ హీరోల చిత్రాల్లో భాగమవ్వగలుగుతున్నాడు. ఓ వైపు తాను సోలో హీరోగా నటిస్తూనే స్టార్ హీరోల చిత్రాల్లో కీలక పాత్రల్లో నటిస్తూ నటుడిగా పరిపూర్ణమవుతున్నాడు. ఓ పెద్ద స్టార్ ఇంట కుటుంబం నుంచి వచ్చి ఇలా కొనసాగడం అంటే చిన్న విషయం కాదు.
బాలీవుడ్ ప్రతిభావంతుల్లో అభిషేక్ ఒకడిగా ఎదగానికి ఎంతో శ్రమించాడు. తండ్రి ఇమేజ్ నుంచి బయటకు వచ్చి సినిమాలు చేసిన నటుడాయన. సీరియస్ యాక్షన్ రోల్స్ పోషించలన్నా? వైవిథ్యమైన కామెడీ చేయాలన్నా? అభిషేక్ ఎలాంటి పాత్రలోనైనా అవలీలగా ఒదిగిపోతాడు. ఇటీవలే 'హౌస్ ఫుల్ 5'తో ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా థియేట్రికల్ గా మంచి విజయం సాధించింది.
అయితే ఇదే సినిమాలో చాలా మంది నటులు ఉండటంతో అభిషేక్ పాత్ర అంతగా హైలైట్ అవ్వలేదు. దీంతో అభిషేక్ బచ్చన్ గత చిత్రాలతో పోలిక చేస్తూ నెట్టింట విమర్శ వ్యక్తమవుతోంది. బలహీనమైన పాత్రల్లో కనిపిస్తున్నాడనే విమర్శ తెరపైకి వస్తోంది. అభిషేక్ బచ్చన్ సీరియస్ పాత్రలను గుర్తు చేస్తూ పాత అభిషేక్ ఎక్కడ? అనే విషయాన్ని గుర్తు చేస్తున్నారు. 'గురు', 'యువ', 'మన్మార్జియాన్' లాంటి చిత్రాలు మళ్లీ ఎప్పుడని అడుగుతున్నారు.
ఇటీవల రిలీజ్ అయిన 'ఐవాంట్ టూ టాక్', 'బీ హ్యాపీ' లాంటి చిత్రాలు థియేట్రికల్ గా సరిగ్గా ఆడకపోయినా ఓటీటీలో బాగానే రాణించాయి. దీంతో అభిషేక్ బచ్చన్ థియేటర్ కంటే ఓటీటీ స్టార్ గా ఫేమస్ అవుతున్నాడా? ఓటీటీలో ఓ బ్రాండ్ హీరోగా అభిషేక్ మారుతున్నాడా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
