నెగెటివ్ కామెంట్లు.. భార్య సలహాతో బయటపడ్డ స్టార్
2000 సంవత్సరంలో అమితాబ్ బచ్చన్ కుమారుడిగా భారీ అంచనాలతో అభిషేక్ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టాడు.
By: Tupaki Desk | 3 July 2025 7:00 AM ISTబాలీవుడ్ లో చాలా కాలంగా నటిస్తున్నా అమితాబ్ నటవారసుడు అభిషేక్ బచ్చన్ ఇటీవలి కాలం వరకూ ఆశించిన ఫలితాలను అందుకోలేదు. కానీ ఇప్పుడు అతడు పరిణతి చెందిన నటుడిగా అద్భుత స్క్రిప్టుల్ని ఎంపిక చేసుకుని, అరుదైన ప్రదర్శనలతో ఆకట్టుకుంటున్నాడు. మెగాస్టార్ అమితాబ్ ఇటీవల అతడి నటనను కీర్తిస్తున్నారంటే విషయం ఉంటేనే ఇది పాజిబుల్. అలాగే ఐశ్వర్యారాయ్ నుంచి అభిషేక్ విడిపోయాడంటూ చాలా ప్రచారం సాగింది. అంతేకాదు... అభిషేక్ ఎఫైర్ల గురించి కూడా ప్రచారం కలతకు గురి చేసింది.
తాజా ఇంటర్వ్యూలో అభిషేక్ బచ్చన్ తన సినీ ప్రయాణంలో ఎదుర్కొన్న ఇబ్బందులను, ప్రతికూలతను ఎలా అధిగమించాడో మాట్లాడారు. నిజానికి తన చుట్టూ ఉన్నవారిని సంతోషపెట్టే మనస్తత్వం తనది అని అభిషేక్ చెప్పారు. ఒక్కోసారి కఠినంగా ఉండాలని కాలం నేర్పిస్తుంది. కానీ ఆర్టిస్టుగా అలా ఉండటం కుదరదు. అది మన కెరీర్ ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. నేను అందరూ బావుండాలని కోరుకుంటాను. అలాంటి సమయంలో నా భార్య (ఐశ్వర్య రాయ్) ఎప్పుడూ సానుకూలంగా ఉండాలని, విమర్శలకు ప్రభావితం కావొద్దని సలహా ఇస్తారని, దానిని తాను అనుసరిస్తానని అభిషేక్ వెల్లడించారు. తప్పుడు వార్తలు మనపై ప్రభావం చూపవు. ఎప్పుడూ పాజిటివ్ గా ఉండండి అని తనకు ఐష్ చెబుతారని కూడా తెలిపాడు.
2000 సంవత్సరంలో అమితాబ్ బచ్చన్ కుమారుడిగా భారీ అంచనాలతో అభిషేక్ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టాడు. అతడి తొలి చిత్రం `రెఫ్యూజీ` ప్రశంసలు అందుకున్నా కానీ, ఆ తర్వాత వరుసగా పరాజయాలను ఎదుర్కొన్నాడు. కొన్ని వైఫల్యాల తర్వాత ధూమ్ 2తో విజయం అందుకున్నాడు. అది అతడికి కలిసొచ్చిందని అభిషేక్ చెప్పాడు. తనకు ఫ్లాపులొచ్చినప్పుడు బయట ఎవరూ పట్టించుకోలేదని కూడా గుర్తు చేసుకున్నాడు. బయటికి ఎలా ఉన్నా లోలోన భయపడుతూనే ఉంటామని అన్నాడు. ఇలాంటి ఒక దశను ఏ నటుడైనా అనుభవించాలని కోరుకుంటానని అభిషేక్ అన్నాడు. అప్పుడే వాటిలో ప్రతిదానికీ విలువ ఇవ్వడం నేర్చుకుంటారని అన్నాడు.
