Begin typing your search above and press return to search.

ద‌గ్గుబాటి పెళ్లిలో స‌కుటుంబ స‌మేతంగా

మూవీ మొఘ‌ల్ డా.డి.రామానాయుడు మ‌న‌వ‌డు, నిర్మాత డి.సురేష్ బాబు కుమారుడు, రానా సోద‌రుడు ద‌గ్గుబాటి అభిరామ్ ఓ ఇంటివాడ‌యిన సంగ‌తి తెలిసిందే.

By:  Tupaki Desk   |   12 Dec 2023 4:32 PM GMT
ద‌గ్గుబాటి పెళ్లిలో స‌కుటుంబ స‌మేతంగా
X

మూవీ మొఘ‌ల్ డా.డి.రామానాయుడు మ‌న‌వ‌డు, నిర్మాత డి.సురేష్ బాబు కుమారుడు, రానా సోద‌రుడు ద‌గ్గుబాటి అభిరామ్ ఓ ఇంటివాడ‌యిన సంగ‌తి తెలిసిందే. అభిరామ్ దగ్గుబాటి ప్రత్యూషను ఇటీవల శ్రీలంకలోని అనంతర కలుతారా రిసార్ట్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్‌లో పెళ్లాడాడు. న‌వ‌దంప‌తుల‌తో నాయుడు గారి కుటుంబం ఒకే ఫ్రేమ్ లో ఒదిగిపోవ‌డంతో ఆ ఫోటో ఇప్పుడు అంత‌ర్జాలంలోకి రావ‌డంతో బ‌య‌ట‌ప‌డింది.

దగ్గుబాటి కుటుంబం మొత్తం కొత్త జంటతో ఉన్న అధికారిక ఫోటోగ్రాఫ్ కాసేపటి క్రితం బయటకు వచ్చింది. ఈ ఫోటోలో సురేష్ బాబు, వెంక‌టేష్ అత‌డి కుటుంబం, రానా- మిహీక దంప‌తులు, నాగ చైతన్య త‌దిత‌రులు ఉన్నారు. త్వరలో హైదరాబాద్‌లో అభిరామ్, ప్రత్యూష రిసెప్షన్‌ను నిర్వహించనున్నారు. ఈ రిసెప్ష‌న్ కి ద‌గ్గుబాటి కుటుంబానికి స‌న్నిహితులు బంధుమిత్రులంతా విచ్చేస్తార‌ని స‌మాచారం. ముఖ్యంగా ప‌రిశ్ర‌మ ప్ర‌ముఖులు ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌వుతారు.

క‌లుతారా-శ్రీ‌లంక‌లో మూడు రోజుల పెళ్లిని డాక్యుమెంట్ చేయడానికి అవ‌కాశం క‌ల్పించినందున ఫోటోగ్రాఫ‌ర్లు వీడియోగ్రాఫ‌ర్లు ద‌గ్గుబాటి కుటుంబానికి కృతజ్ఞతలు తెలిపారు. అభిరామ్ - ప్రత్యూష దంప‌తులు జీవితాంతం సంతోషంగా ఆనంద క్ష‌ణాల‌ను ఆస్వాధించాల‌ని కోరుకున్నారు. అభిరామ్ ద‌గ్గుబాటి త‌దుప‌రి హీరోగా కొన‌సాగుతాడా? లేక తాత‌లా నిర్మాత అవుతాడా? అన్న‌దానిపై స్ప‌ష్ఠ‌త రావడానికి మ‌రికొంత స‌మ‌యం ప‌డుతుంది.