Begin typing your search above and press return to search.

గాయ‌నికి వేధింపులు అస‌భ్య‌క‌ర కామెంట్లు

ఎవరిని ఎంత ఎక్కువగా అవమానించగలమో అనే పోటీ నెటిజన్ల మధ్య జ‌రుగుతోంది`` అని ఆవేదన వ్యక్తం చేశారు.

By:  Sivaji Kontham   |   4 Feb 2026 10:46 PM IST
గాయ‌నికి వేధింపులు అస‌భ్య‌క‌ర కామెంట్లు
X

వందలాది అసభ్యకరమైన కామెంట్లను చూసి తాను నిద్రలేని రాత్రులు గడిపానని, ఎవరికీ తెలియని బాధను అనుభవిస్తున్నానని ఆవేద‌న వ్య‌క్తం చేసారు ప్ర‌ముఖ గాయ‌ని అభిరామి. మలయాళ గాయని, నటి అభిరామి సురేష్ ఇటీవల ఒక లైవ్ మ్యూజిక్ షో తర్వాత ఎదుర్కొన్న ఆన్ లైన్ వేధింపుల ఘటన సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. ఫిబ్రవరి 1న జరిగిన ఒక లైవ్ పెర్ఫార్మెన్స్‌కు సంబంధించిన వీడియోలు వైరల్ కావడంతో, నెటిజనులు స‌ద‌రు గాయ‌నిపై తీవ్రస్థాయిలో బాడీ షేమింగ్, అసభ్యకరమైన కామెంట్లతో దాడి చేశారు.

దీనిపై భావోద్వేగపూరిత పోస్ట్ ని అభిరామి స్వ‌యంగా నెటిజ‌నుల కోసం షేర్ చేసారు. దాని ప్ర‌కారం..``సోషల్ మీడియా ఒక డస్ట్ బిన్.. ఒక మాలిన్య‌పు కుప్ప‌లా మారిపోయింది. ఎవరిని ఎంత ఎక్కువగా అవమానించగలమో అనే పోటీ నెటిజన్ల మధ్య జ‌రుగుతోంది`` అని ఆవేదన వ్యక్తం చేశారు.

నేను ఒక లైవ్ పెర్ఫార్మర్‌ని. స్టేజ్ మీద బొమ్మలా నిలబడి పాడటానికి నేనేమీ లెజెండరీ సింగర్‌ని కాదు. నేను కదులుతాను.. డ్యాన్స్ చేస్తాను.. నా శ్వాసను, శరీరాన్ని ఆ ప్రదర్శన కోసం అంకితం చేస్తాన‌ని ఎమోష‌న‌ల్ పోస్ట్ చేసారు. అయితే అభిరామిపై ఘాటు విమ‌ర్శ‌లు చేసేవాళ్లే కాదు.. అనుకూలంగా ఉంటూ, కొంద‌రు అండ‌గా నిలిచారు. ``మీరు వేధింపులకు గురవ్వడానికి అర్హులు కాదు! అంటూ తనలాంటి బాధితులకు మద్దతుగా నిలిచారు. ముఖ్యంగా అభిరామి త‌న‌ను ప్ర‌ద‌ర్శ‌న స‌మ‌యంలో వీడియోలు తీసిన విధానం, కెమెరా యాంగిల్స్ ప‌రంగా తప్పుగా చిత్రీకరించారని ఆవేద‌న వ్య‌క్తం చేసారు.

గాయ‌ని అభిరామి, ఆమె సోదరి అమృత సురేష్ గత కొంతకాలంగా వ్యక్తిగత కారణాల వల్ల ఆన్‌లైన్ వేధింపులకు గురవుతున్నారు. అమృత సురేష్ త‌న భ‌ర్త‌తో గొడ‌వ‌ల కార‌ణంగా మీడియాకు చుల‌క‌న‌య్యారు. ఇప్పుడు అభిరామి విష‌యంలో నెటిజ‌నుల ప్ర‌వ‌ర్త‌న నిజంగా త‌న‌ను ఆందోళ‌నకు గురి చేసింది. తాజా ఘటనతో సోషల్ మీడియాపై తన అసహనాన్ని వ్యక్తం చేస్తూ, ఇకపై ఇలాంటి వాటిపై పోరాడలేక కొంతకాలం పక్కకు తప్పుకుంటున్నట్లు తెలిపారు.