కమల్ తో లిప్ లాక్ సీన్.. అభిరామి ఇష్టంతోనే చేసిందట!
ఇప్పటికే మేకర్స్ రిలీజ్ చేసిన ట్రైలర్ ను మంచి రెస్పాన్స్ వచ్చింది. కానీ కమల్, నటి అభిరామి మధ్య లిప్ లాక్ సీన్ హాట్ టాపిక్ గా మారింది.
By: Tupaki Desk | 31 May 2025 9:00 PM ISTదిగ్గజ నటుడు కమల్ హాసన్, ప్రముఖ దర్శకుడు మణిరత్నం కాంబినేషన్ లో థగ్ లైఫ్ మూవీ రూపొందిన విషయం తెలిసిందే. ఇప్పటికే మేకర్స్ రిలీజ్ చేసిన ట్రైలర్ ను మంచి రెస్పాన్స్ వచ్చింది. కానీ కమల్, నటి అభిరామి మధ్య లిప్ లాక్ సీన్ హాట్ టాపిక్ గా మారింది. ఒక్కొక్కరు ఒక్కోలా రెస్పాండ్ అయ్యారు.
కొందరు సినిమాను సినిమా లాగా చూడాలని కామెంట్ చేయగా.. మరికొందరు 70 ఏళ్ల కమల్ హాసన్.. తనకంటే వయసులో ఎంతో చిన్న అయిన అభిరామితో ఘాటు లిప్ లాక్ సీన్ చేయడంపై విమర్శించారు. దీనిపై ఇప్పుడు అభిరామి రెస్పాండ్ అయ్యారు. ఆ సీన్ 3 సెక్లను అని, అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారని తెలిపారు.
"నేను దర్శకుడు మణిరత్నం గారు ఆ రోల్ లో నన్ను ఎందుకు తీసుకున్నారని అడిగాను. నా చిత్రనిర్మాతల నిర్ణయాలను నేను ఎల్లప్పుడూ గౌరవిస్తాను. నేను ఆ సన్నివేశాన్ని ఇష్టపూర్వకంగా చేశాను. ఇది కేవలం మూడు షాట్లలోనే కనిపిస్తుంది. ఆ చిన్న క్లిప్ కారణంగా చాలా అపార్థాలు వచ్చాయి" అని అభిరామి తెలిపారు.
"కిస్ సీన్ వెనుక మణి సర్ లాజిక్ ను నేను జడ్జ్ చేయడం లేదు. ఆయన లాజిక్ తో నేను ఏకీభవిస్తాను. పూర్తి సినిమా చూసిన తర్వాత అభిప్రాయాలు మారుతాయని నేను నమ్ముతున్నాను. విడుదల తర్వాత ఈ అంశం కొనసాగుతుందని నేను అనుకోను. దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు" అని చెప్పారు..
అందుకే కామెంట్ చేసే ముందు అందరూ సినిమా చూడాలని తాను కోరుతున్నట్లు తెలిపారు అభిరామి. అనవసరంగా దీనిపై రాద్ధాంతం చేస్తున్నారని, అసలెందుకు అలా చేస్తున్నారో నిజంగా తనకు తెలియడం లేదని అభిప్రాయపడ్డారు. ఏ మూవీకి అయినా కలిసొచ్చేదే మార్కెటింగ్ టీమ్ చేస్తుందని తెలుసని చెప్పారు.
అయితే కమల్ సార్ ఎప్పుడు ఎలాంటి సీన్లు చేసినా వాటిపై ఎవరో ఒకరు ఏదో ఒకటి అంటూనే ఉంటారని అభిరామి అన్నారు. అలా అని మిగతా వాళ్లు ఇలాంటి సీన్లు చేయరని కాదు, కానీ ఓ టాప్ యాక్టర్ చేస్తే దాని గురించి మాట్లాడుకుంటారని చెప్పారు. ఇది ప్రస్తుత రోజుల్లో కామన్ అయినా.. కొద్ది రోజుల తర్వాత ప్రేక్షకులు కూడా అప్ గ్రేడ్ అవుతారని ఆశిస్తున్నట్లు తెలిపారు.
