Begin typing your search above and press return to search.

శ్రీ‌లంక రిసార్ట్‌లో ద‌గ్గుబాటి హీరో 5-డే పెళ్లి

మూడు రోజుల వివాహ వేడుకలు సోమవారం (డిసెంబర్ 4) రాత్రి 8:30 గంటలకు గ్రాండ్ డిన్నర్ పార్టీతో ప్రారంభమవుతాయి

By:  Tupaki Desk   |   3 Dec 2023 6:39 AM GMT
శ్రీ‌లంక రిసార్ట్‌లో ద‌గ్గుబాటి హీరో 5-డే పెళ్లి
X

మూవీ మొఘ‌ల్ ద‌గ్గుబాటి రామానాయుడు మ‌న‌వ‌డు, సీనియర్ నిర్మాత సురేష్ బాబు దగ్గుబాటి చిన్న కుమారుడు ..హీరో రానా దగ్గుబాటి తమ్ముడు అభిరామ్ దగ్గుబాటి ఈ డిసెంబర్‌లో వివాహం చేసుకోబోతున్నారు. ఈ సెల‌బ్రిటీ వెడ్డింగ్‌కి సంబంధించిన కొన్ని లీకులు తాజాగా అందాయి. ఓ మీడియా సోర్స్ ప్ర‌కారం.. ఇది డెస్టినేష‌న్ వెడ్డింగ్. శ్రీలంకలోని సుందరమైన ఐదు నక్షత్రాల రిసార్ట్ అయిన `అనంతర కలుతారా`లో అభిరామ్ పెళ్లి జ‌ర‌గ‌నుంది. వ‌ధువు పేరు ప్రత్యూష చపరా. డిసెంబర్ 6న రాత్రి 8.50 గంటలకు పెళ్లి జరగనుంది. దాదాపు 200 మంది ఈ పెళ్లికి అటెండ‌య్యే అవ‌కాశం ఉంద‌ని తెలిసింది. సన్నిహితులు, కుటుంబ సభ్యులు, సెలబ్రిటీలు ఈ వేడుక‌కు విచ్చేస్తారు. వివాహ వేడుకల్లో పాల్గొనేందుకు అతిథులు సోమవారం శ్రీలంకలో అడుగుపెట్టనున్నారు.

మూడు రోజుల వివాహ వేడుకలు సోమవారం (డిసెంబర్ 4) రాత్రి 8:30 గంటలకు గ్రాండ్ డిన్నర్ పార్టీతో ప్రారంభమవుతాయి. మంగళవారం సాయంత్రం 4:30 గంటలకు మెహందీ వేడుక, అనంతరం విందు ఏర్పాటు చేస్తారు. ఇక బుధవారం ఉదయం 10:30 గంటలకు పెళ్లికూతురు వేడుక నిర్వహించి అనంతరం సాయంత్రం 7 గంటలకు వివాహ వేడుకలు ప్రారంభమవుతాయి. రాత్రి 8:50 గంటలకు తాళిక‌ట్టు సుముహూర్తం.

వివాహం అనంత‌రం హైదరాబాద్‌కు తిరిగి విచ్చేస్తారు. ఇక్క‌డ‌ దగ్గుబాటి ఫ్యామిలీ రిసెప్షన్‌ను ఘనంగా నిర్వహించనున్నారు. దీనికి సినీ, వ్యాపార, రాజకీయ వర్గాల ప్ర‌ముఖులు, అభిమానులు హాజరవుతారు. ఈ స్టార్ స్టడెడ్ వివాహానికి సంబంధించి అధికారికంగా ఎలాంటి స‌మాచారం లేదు. సోష‌ల్ మీడియాల్లో క‌థ‌నాలు ఆధారం. శ్రీ‌లంక రిసార్ట్‌లో ద‌గ్గుబాటి హీరో 5-డే పెళ్లి ఇప్పుడు ఫిలింన‌గ‌ర్ లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది.