Begin typing your search above and press return to search.

కారంచేడు అమ్మాయితో అభిరామ్ పెళ్లి నిశ్చ‌యం!

ఆవిష‌యం పెద్ద‌ల‌కు తెలియ‌డంతో వివాహ బంధంతో ఒక‌టి చేయాల‌ని నిశ్చ‌యించిన‌ట్లు స‌న్నిహితుల నుంచి తెలిసింది

By:  Tupaki Desk   |   9 Sep 2023 9:36 AM GMT
కారంచేడు అమ్మాయితో అభిరామ్ పెళ్లి నిశ్చ‌యం!
X

ద‌గ్గుబాటి కుటుంబం ఇంట మ‌ళ్లీ పెళ్లి భాజాలు మోగ‌బోతున్నాయా? రామానాయుడు ముద్దుల మ‌న‌వ‌డు... సురేష్ బాబు త‌న‌యుడు అభిరాం పెళ్లి కోడుకు కాబోతున్నాడా? అంటే అవున‌నే తెలుస్తోంది. మ‌రి వ‌ధువు ఎవ‌రు? అంటే రామానాయుడు కుటుంబానికి చెందిన చాలా ద‌గ్గ‌ర బంధువ‌ని తెలిసింది. దివంగత రామానాయుడు తమ్ముడు మనవరాలినే ( సురేష్ బాబు చెల్లెలు కుమార్తె) అభిరాం పెళ్లాడబోతున్నాడుట‌. ప్ర‌స్తుతం ద‌గ్గుబాటి కుటుంబం పెళ్లి హ‌డావుడిలోనే ప‌డిన‌ట్లు ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది.

అమ్మాయి మాస్ కమ్యూనిక‌ష‌న్ చేసింద‌ని స‌మాచారం. ఆ కుటుంబం కారంచేడులో ఉంటుందిట‌. మ‌రి ఇది ప్రేమ వివాహ‌మా? పెద్దల కుదిర్చిన పెళ్లా? అంటే ప్రేమ వివాహంగానే తెలుస్తోంది. అభిరాం-అమ్మాయి ఇద్ద‌రు చిన్న‌ప్ప‌టి నుంచి ఇష్ట‌ప‌డుతున్నారుట‌. ఆవిష‌యం పెద్ద‌ల‌కు తెలియ‌డంతో వివాహ బంధంతో ఒక‌టి చేయాల‌ని నిశ్చ‌యించిన‌ట్లు స‌న్నిహితుల నుంచి తెలిసింది.

అలాగే వాళ్లిద్ద‌రి పెళ్లి చేయాల‌ని రామానాయుడు కూడా అనుకునేవారుట‌. ఆయ‌న కోరిక కూడ ఈ ర‌కంగా నెర‌వేరుతుంద‌ని చెప్పొచ్చు. వివాహం భార‌త్ లో కాకుండా విదేశాల్లో డెస్టినేష‌న్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తున్న‌ట్లు స‌మాచారం. ఆ దేశం శ్రీలంక అని తెలిసింది. ఆదేశంలో ఓ అంద‌మైన ప్ర‌దేశంలో ఈ పెళ్లికి స‌న్నాహాలు చేస్తున్నారుట‌. అలాగే పెళ్లి తేదీ కూడా నిర్ణ‌యించారుట‌. డిసెంబ‌ర్ 6న వివాహం జ‌రుగుతుంద‌ని స‌మాచారం.

ఇక పెళ్లి శుభ లేఖ చాలా స్పెష‌ల్ గా డిజైన్ చేయిస్తున్నారుట‌. కారంచేడులోని రామానాయుడు ఉన్న పాత ఇల్లు అప్ప‌ట్లో ఎలా ఉండేదో అలాగే పెళ్లి శుభ‌లేఖ‌ల మీద అచ్చు వేయిస్తున్నారుట‌. ఆ కుటుంబానికి అనుబంధంగా ఉన్న మ‌రికొన్ని గుర్తులు కూడా శుభ‌లేఖ‌లో క‌నిపించ‌నున్నాయ‌ట‌. ప్ర‌స్తుతం పెళ్లి కుమార్తె కుటుంబం మొత్తం కారంచేడులోనే ఉంటుందిట‌. అక్క‌డ భారీగా ఆస్తులు ఉండ‌టంతో అక్క‌డే స్థిర‌ప‌డిన‌ట్లు తెలుస్తోంది.

ఇక అభిరాం ఇటీవ‌లే 'అహింస' సినిమాతో హీరోగా ప‌రిచ‌య‌మైన సంగ‌తి తెలిసిందే. కానీ ఆ సినిమా ఆశించిన ఫ‌లితాన్నివ్వ‌లేదు. ప్ర‌స్తుతం రెండ‌వ సినిమా ప‌నుల్లో ఉన్నారు. ఇంత‌లో అభిరాం పెళ్లి వార్త టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.