Begin typing your search above and press return to search.

మూగ‌మ్మాయితో సినిమాలేంటి పిచ్చా అన్నారు?

తాజాగా ఓ ఇంట‌ర్వ్యూకి అభిన‌య తండ్రి ఆనంద్ తో పాటు హాజరైంది. ఈ సంద‌ర్భంగా ఆయ‌న అభిన‌య ఎదిగిన వైనం గురించి రివీల చేసారు.

By:  Tupaki Desk   |   7 Oct 2023 9:37 AM GMT
మూగ‌మ్మాయితో సినిమాలేంటి పిచ్చా అన్నారు?
X

న‌టి అభిన‌య టాలీవుడ్ కి బాగా సుప‌రిచిత‌మే. 'నేనింతే' సినిమాతో తెరంగేట్రం చేసిన అభిన‌య అటుపై చాలా సినిమాల్లో క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ గా న‌టించింది. 'శంభో శివ శంబో'..'ఢ‌మ‌రుకం'..'సీత‌మ్మ‌వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు'..' ద‌మ్ము'లాంటి చాలా సినిమాలు చేసింది. కొన్ని నెగిటివ్ రోల్స్ తోనూ మెప్పించింది. అయితే న‌టిగా ఎన్ని సినిమాలు చేసినా! విశాల్ నిపెళ్లి చేసుకుంటుందా? అన్న విష‌యంతో బాగా పాపుల‌ర్ అయింది.

ఈ వార్త టాలీవుడ్ స‌హా కోలీవుడ్ లోనూ సంచ‌ల‌న‌మైంది. ఇక అభిన‌య వైక‌ల్యం గురించి తెలిసిందే. ఆమె మాట్లాడ‌లేదు. అలాగే విన‌ప‌డ‌దు. పుట్టుక లోపం అది. అయినా న‌ట‌నా రంగంలో రాణించి త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన గుర్తింపును ద‌క్కించుకుంది. ఎంతో మందికి స్పూర్తిగా నిలిచింది. తాజాగా ఓ ఇంట‌ర్వ్యూకి అభిన‌య తండ్రి ఆనంద్ తో పాటు హాజరైంది. ఈ సంద‌ర్భంగా ఆయ‌న అభిన‌య ఎదిగిన వైనం గురించి రివీల చేసారు.

'మోడ‌లింగ్ లో రాణించ‌డానికి కార‌ణం వాళ్లే అమ్మ‌. ఆవిడే అన్నీ ద‌గ్గ‌రుండి చూసుకుంది. త‌ర్వాత నేను చాలా కంపెనీల‌కు వెళ్తే కొప‌డ్డారు. మూగ అమ్మాయిని తెచ్చి సినిమాల్లో ట్రై చేస్తున్నారా? అని అవమానించారు. న‌న్నో పిచ్చోడిలా చూసారు. అయినా మా ప‌ట్టుద‌ల వ‌ద‌ల్లేదు. ఆ స‌మ‌యంలోనే సముద్ర‌ఖ‌ని గారితో ప‌రిచ‌యం జ‌రిగింది. ఆయ‌నే మాకు గాడ్ ఫాద‌ర్. ఆయ‌న లేక‌పోతే మేము లేం.

ఆయ‌న వ‌ల్లే అభిన‌య న‌టి కాగ‌లిగింది. అభిన‌య అంత అందంగా ఉన్నా..దేవుడి వేసిన శిక్ష అనుకున్నాం. మూడేళ్ల వ‌ర‌కూ న‌డ‌వ‌లేదు. ఇక న‌డ‌వ‌లేదు అనుకున్నాం. కానీ ఆ స‌మ‌స్య రాలేదు' అన్నారు. 'త‌ల్లిదండ్రుల కార‌ణంగానే ఈ స్థానంలో ఉన్నాను. వాళ్లు లేక‌పోతే నేను లేను. అమ్మ‌మ్మ‌తో ఎక్కువ స‌ర‌దాగా ఉంటా. అప్పుడ‌ప్పుడు త‌న‌నే నా భ‌ర్త‌గా చెప్పేదాన్ని. విశాల్ తో పెళ్లి వార్త చూసి షాక‌య్యాను. నేను ఆయ‌న్ని చూసి న‌వ్వ‌డం వ‌ల్లే ఆ వార్త వ‌చ్చింది. నేను ఇప్పుడు పెళ్లి గురించి ఆలోచించ‌లేదు. నాకు అన్నీ త‌ల్లిదండ్రులే. నేను వివాహం చేసుకునే వాడు..మొద‌ట న‌న్ను బాగా అర్దం చేసుకోవాలి. బంధంలో విలువ‌లు తెలియాలి. అలాంటి అబ్బాయి దొరికిన‌ప్పుడు పెళ్లి గురించి ఆలోచిస్తా' అని అంది.