చిన్ననాటి స్నేహితుడిని పెళ్లాడిన లక్కీ నటి
తాజాగా వేగేశన కార్తీక్ షేర్ చేసిన వీడియోలో అభినయ పెళ్లి లుక్ ఎంతో ఆకర్షణీయంగా కనిపించింది.
By: Tupaki Desk | 17 April 2025 6:28 PM ISTచిన్ననాటి స్నేహితుడిని లేదా స్నేహితురాలిని ప్రేమించి పెళ్లి చేసుకుంటే, ఆ ప్రేమ పెళ్లిలో ఉండే మజానే వేరు. ఒకరికొకరు అర్థం చేసుకునేందుకు ఇలాంటి పెళ్లిలో స్కోప్ ఎక్కువ. మనసుల కలయికతో జరిగే పెళ్లికి, కట్నకానుకలతో ఏర్పాటు చేసిన సెట్టింగుల పెళ్లికి మధ్య చాలా వైరుధ్యాలు ఇటీవల బయటపడుతున్నాయి.
ఇప్పుడు నటి అభినయ తన చిన్ననాటి స్నేహితుడిని పెళ్లాడిన లక్కీ గాళ్ గా శుభాకాంక్షలు అందుకుంటున్నారు. 15ఏళ్లుగా ప్రేమాయణం ఇప్పుడు పెళ్లితో వికసించింది. దీర్ఘకాల భాగస్వామి వేగేసనా కార్తీక్‌ను అభినయ 16 ఏప్రిల్ 2025న వివాహం చేసుకుంది. హైదరాబాద్ లో జరిగిన ఈ పెళ్లికి కుటుంబ సభ్యులు బంధుమిత్రులు హాజరయ్యారు. అభినయ- కార్తీక్ ల స్కూల్ స్నేహితులు సహా ఇతర పరిశ్రమ స్నేహితులు కూడా ఈ జంటను ధీవించారు.
రెండు నెలల క్రితమే తన జీవితంలో మిస్టరీ మేన్ ని అభినయ అధికారికంగా ఇన్ స్టాలో పరిచయం చేసింది. మార్చి 9 నాటి ప్రశాంతమైన నిశ్చితార్థ ఫోటోలను షేర్ చేసాక శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. తాజాగా వేగేశన కార్తీక్ షేర్ చేసిన వీడియోలో అభినయ పెళ్లి లుక్ ఎంతో ఆకర్షణీయంగా కనిపించింది. అభినయ ఎరుపు రంగు కాంచీపురం చీర.. బంగారు ఉపకరణాలను ధరించి కనిపించగా, ఆమె భర్త ఐవరీ సాంప్రదాయ దుస్తులతో పాటు మ్యాచింగ్ ఎరుపు వస్త్రాన్ని ధరించి కనిపించారు. ఉత్సాహభరితమైన మెహందీ వేడుకతోలు, ప్రీ-వెడ్డింగ్ ఫంక్షన్లతో వేడుకలు ప్రారంభమయ్యాయి.
కార్తీక్ స్కూల్ డేస్ స్నేహితుడు.. సన్నిహితుడు. ..ఎన్నో భాషలు చేసుకున్నాం.. మా మధ్య ప్రేమ పెరిగిందని అభినయ ఇంతకుముందు ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. హైదరాబాద్‌లోని ఒక నిర్మాణ సంస్థలో పనిచేస్తున్న కార్తీక్ చాలా లో ప్రొఫైల్‌ను కొనసాగించారు. అతడు అప్పుడప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో సన్నీ వర్మ పేరుతో పోస్ట్ లైఫ్ మ్యాటర్స్ ని పోస్ట్ చేస్తుంటాడు. చిన్న నాటి స్నేహితుడిని పెళ్లాడిన లక్కీ గాళ్! అంటూ అభిమానులు అభినయను ప్రశంసిస్తున్నారు.
