Begin typing your search above and press return to search.

టాయిలెట్ యాడ్‌ ట్రోల్స్ పై హీరో కామెంట్స్‌

ఈ నేపథ్యంలో ఆయన ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

By:  Tupaki Desk   |   5 Aug 2023 7:22 AM GMT
టాయిలెట్ యాడ్‌ ట్రోల్స్ పై హీరో కామెంట్స్‌
X

ప్రేమదేశం హీరో అబ్బాస్ మొదటి సినిమా తోనే ఇండస్ట్రీలో మంచి గుర్తింపు దక్కించుకున్న విషయం తెల్సిందే. తెలుగు మరియు ఇతర భాషల్లో మంచి గుర్తింపును దక్కించుకున్నాడు. అయితే అనూహ్యంగా ఇండస్ట్రీకి దూరం అయ్యాడు. చాలా కాలం పాటు అబ్బాస్ అనే పేరు కూడా ఇండస్ట్రీలో వినిపించలేదు.

తిరిగి అబ్బాస్ తెలుగు మీడియాలో సందడి చేస్తున్నాడు. ఈ మధ్య కాలం లో ఈయన గురించి రకరకాలుగా వార్తలు వస్తున్నాయి. విదేశాల కు వెళ్లిన అబ్బాస్‌ ఇండస్ట్రీలో రీ ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి అంటూ వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

అబ్బాస్ కొన్ని సంవత్సరాల క్రితం టాయిలెట్ క్లీనర్ కి సంబంధించిన ఒక ప్రాడెక్ట్‌ కు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించాడు .ఆ యాడ్‌ చేసిన కారణంగా అబ్బాస్ ను చాలా మంది విమర్శించడంతో పాటు ఆ వీడియోను రకరకాలుగా ట్రోల్‌ చేయడం జరిగింది. ఆ ట్రోల్స్ తనకు బాధ కలిగించలేదని... తనను విమర్శించిన వారి గురించి ఎక్కువ ఆలోచించలేదని అన్నాడు.

తాను ఇంటి పరిశుబ్రం గురించిన ప్రొడక్ట్‌ ప్రమోషన్ లో నటించాను. అంతే తప్ప తాను తప్పు చేయలేదు. అందుకే తాను విమర్శలు వచ్చినప్పుడు బాధపడలేదు అంటూ అబ్బాస్ పేర్కొన్నాడు. టాయిలెట్ క్లీనింగ్ యాడ్‌ విషయంలో తాను ఎప్పుడు కూడా బాధ పడలేదు.. ఎందుకు చేశానో అని బాధ పడలేదు అన్నాడు.

ఇండస్ట్రీలో తనకు మంచి గుర్తింపు ఉన్న సమయంలో తనకు మంచి పారితోషికం ఇచ్చిన కారణంగా ఆ ప్రాడెక్ట్‌ కి ప్రమోషన్ చేసేందుకు ముందుకు వచ్చాను. తనకు ఎలాంటి ఇబ్బంది లేదు కానీ కొందరు మాత్రం ఏదో జరిగినట్లుగా తెగ విమర్శలు చేశారు అంటూ అబ్బాస్ పేర్కొన్నాడు.