పిక్‌టాక్ : ఇప్పుడు అబ్బాస్ ఎలా అయ్యాడో తెలుసా!
ఇప్పుడు అదే జాబితాలో 1990 కాలంలో హీరోగా ఒక వెలుగు వెలిగిన అబ్బాస్ చేరబోతున్నాడు. ప్రేమదేశం సినిమాతో తెలుగు ప్రేక్షకుల్లో ముఖ్యంగా అప్పటి యూత్ ఆడియన్స్‌లో విపరీతమైన క్రేజ్‌ను దక్కించుకున్నాడు.
By: Tupaki Desk | 9 July 2025 4:52 PM ISTస్టార్ హీరోల్లో కొందరు ఆరు పదుల వయసు దాటినా ఇంకా హీరోగానే కొనసాగుతున్నారు. కొందరు మాత్రం హీరోగా ఆఫర్లు రాకపోవడంతో, హీరోగా చేస్తున్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద నిరాశను మిగుల్చుతున్న కారణంగా సెకండ్ ఇన్నింగ్స్ ఆలోచన చేస్తారు. అంటే విలన్ పాత్రలకు కమిట్ కావడం, క్యారెక్టర్ ఆర్టిస్టుగా సినిమాలు చేయడం మనం చూస్తూ ఉంటాం. చాలా మంది సీనియర్ ఫ్యామిలీ హీరోస్, యాక్షన్ హీరోలు ప్రస్తుతం యంగ్ హీరోల సినిమాల్లో ముఖ్య పాత్రల్లో కనిపిస్తున్న విషయం తెల్సిందే. ఈ మధ్య కాలంలో యంగ్ హీరోల జోరు ముందు సీనియర్ హీరోలు నిలువలేక పోతున్నారు. అందుకే చాలా మంది కనుమరుగు అవుతున్నారు.
జగపతిబాబు, శ్రీకాంత్‌తో పాటు మరికొందరు సీనియర్ హీరోలు సెకండ్ ఇన్నింగ్స్‌ను మొదలు పెట్టి విలన్ పాత్రలను, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ముఖ్య పాత్రలను చేస్తున్న విషయం తెల్సిందే. ఇప్పుడు అదే జాబితాలో 1990 కాలంలో హీరోగా ఒక వెలుగు వెలిగిన అబ్బాస్ చేరబోతున్నాడు. ప్రేమదేశం సినిమాతో తెలుగు ప్రేక్షకుల్లో ముఖ్యంగా అప్పటి యూత్ ఆడియన్స్‌లో విపరీతమైన క్రేజ్‌ను దక్కించుకున్నాడు. అమ్మాయిలు ఎక్కువగా అభిమానించే హీరోగా అబ్బాస్ నిలిచాడు. అప్పట్లో అబ్బాస్ హెయిర్ స్టైల్‌కి ఎంతో మంది అభిమానులు ఉండేవారు. చాలా మంది అబ్బాస్ హెయిర్ స్టైల్ చేయించుకుని మురిసిన వారు ఉంటారు. అబ్బాస్ గత దశాబ్ద కాలంగా ఇండస్ట్రీలో కనిపించడం లేదు.
అబ్బాస్ చివరిసారి మలయాళ మూవీ పచ్చక్కళ్లంలో నటించాడు. ఆ సినిమాకి ముందు చేసిన సినిమాలతో పాటు, ఆ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడింది. దాంతో అబ్బాస్ మెల్ల మెల్లగా కనుమరుగయ్యాడు. కచ్చితంగా పదేళ్ల తర్వాత అబ్బాస్ రీ ఎంట్రీకి సిద్ధం అయ్యాడు. అయితే ఈసారి హీరోగా కాకుండా చాలా మంది సీనియర్ హీరోల మాదిరిగా విలన్ పాత్రలను చేసేందుకు, క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేసేందుకు సిద్ధం అయ్యాడు. సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌లో అబ్బాస్ ఆకట్టుకున్నాడు. సోషల్ మీడియాలో అబ్బాస్ కొత్త లుక్‌ను చూసి చాలా మంది సర్‌ప్రైజ్ అవుతున్నారు. అప్పుడు అబ్బాస్‌ను అభిమానించిన వారు కూడా ఈ కొత్త లుక్‌లో గుర్తు పట్టడానికి సమయం తీసుకుంటున్నారు.
ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేయడంతో పాటు యూత్ ఐకాన్‌గా నిలిచిన అబ్బాస్ రీ ఎంట్రీ ఇవ్వడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. తెలుగులోనే కాకుండా తమిళ్ సినిమాల్లోనూ ఇతడు ఖచ్చితంగా గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇతడి లుక్‌ను చూస్తుంటే టాలీవుడ్, కోలీవుడ్‌కి మంచి విలన్ దొరికాడు అనిపిస్తుందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కాస్త జాగ్రత్తగా జగపతిబాబు మాదిరిగా కెరీర్‌ను ప్లాన్ చేసుకుంటే తప్పకుండా అబ్బాస్ ఇండస్ట్రీలో మరో దశాబ్ద కాలం పాటు టాప్ స్టార్‌గా కొనసాగే అవకాశాలు ఉంటాయని సినీ వర్గాల వారు, విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అబ్బాస్ రీ ఎంట్రీ మూవీ గురించి క్లారిటీ రావాల్సి ఉంది.
