Begin typing your search above and press return to search.

హిట్‌ మూవీ ప్రాంచైజీ కాదంటే ఎవరు చూస్తారు...?

బాలీవుడ్‌ హిట్‌ ప్రాంచైజీలో ఆషికి ఒకటి. ఇప్పటి వరకు ఆషికి ప్రాంచైజీలో రెండు సినిమాలు వచ్చాయి.

By:  Tupaki Desk   |   26 Jun 2025 6:30 AM
హిట్‌ మూవీ ప్రాంచైజీ కాదంటే ఎవరు చూస్తారు...?
X

బాలీవుడ్‌తో పాటు అన్ని భాషల ఇండస్ట్రీలోనూ సూపర్‌ హిట్‌గా నిలిచిన సినిమాలకు ప్రాంచైజీలు మొదలు అవుతున్నాయి. ఇప్పటికే కొన్ని సినిమాల ప్రాంచైజీలు మూడు నాలుగు పార్ట్‌లుగా వచ్చేశాయి. హిట్ మూవీ ప్రాంచైజీ అంటే మినిమం బజ్‌ ఉంటుంది. అంతే కాకుండా సినిమాకు ఓపెనింగ్‌ మినిమంగా ఉంటుంది. అంతకు ముందు వచ్చిన పార్ట్‌లు విజయం సాధించిన నేపథ్యంలో ఈసారి కూడా మరో విజయం ఖాయం గా నమోదు అవుతుందేమో అని చాలా మంది అనుకుంటారు. అందుకే సినిమా ప్రారంభం అయిన సమయంలోనే ఒక పాజిటివ్‌ బజ్‌ అనేది ప్రాంచైజీ సినిమాలపై ఉంటుంది. అందుకు తగ్గట్లుగా ప్రమోట్‌ చేస్తే తప్పకుండా మంచి ఓపెనింగ్స్ నమోదు అవుతాయి.

బాలీవుడ్‌ హిట్‌ ప్రాంచైజీలో ఆషికి ఒకటి. ఇప్పటి వరకు ఆషికి ప్రాంచైజీలో రెండు సినిమాలు వచ్చాయి. విభిన్నమైన ప్రేమ కథలను తీసుకు రావడం కోసం ఈ ప్రాంచైజీని మొదలు పెట్టినట్లు మేకర్స్‌ గతంలో ప్రకటించారు. చాలా రోజుల నుంచి ఆషికి 3 రాబోతుందనే వార్తలు వస్తున్నాయి. దర్శకుల పేర్లు మారడంతో పాటు, హీరోలు, హీరోయిన్స్ పేర్లు కూడా మార్చుతూ వస్తున్నారు. యశ్‌ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌లో ఈ ప్రాంచైజీ నుంచి మూడో పార్ట్‌ రావాల్సి ఉంది. ఆ మధ్య ప్రముఖ దర్శకుడు మోహిత్‌ సూరి కొత్త సినిమాకు ఆషికి 3 టైటిల్‌ అనుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి. ఆషికి ప్రాంచైజీకి తగ్గ కథను మోహిత్‌ సూరి రెడీ చేశాడనే ప్రచారం జరిగింది.

తాజాగా ఆ విషయం గురించి స్వయంగా మోహిత్‌ సూరి స్పందించాడు. ఆషికి 2 సినిమాకు మంచి స్పందన వచ్చిన నేపథ్యంలో ఆషికి 3 ను చేయాలని అనుకున్నాను. ఒక మంచి ప్రేమ కథను ఆషికి 3 గా ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలి అనుకున్నాను. అందుకోసం ఒక కథను రెడీ చేశాను. షూటింగ్ సైతం మొదలు పెట్టాను. ఆషికి 3 అంటూ అధికారికంగా ప్రకటించాలని అనుకున్నాం. కానీ కొన్ని కారణాల వల్ల ఆ సినిమాను సైయారా అనే టైటిల్‌తో విడుదల చేయబోతున్నాం అంటూ అధికారికంగా ప్రకటించాడు. ఇప్పటికే టీజర్ విడుదల తర్వాత అందరి దృష్టిని ఆకర్షించిన సైయారా సినిమా కు మొదట ఆషికి 3 టైటిల్ అనుకున్నాను అంటూ మోహిత్‌ సూరి చెప్పడంతో ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశం అయింది.

అంతా కొత్త వారితో రూపొందించిన సైయారా సినిమాకు ఎంతగా పబ్లిసిటీ చేసినా ప్రేక్షకుల్లో పెద్దగా బజ్ క్రియేట్‌ కావడం లేదు. సినిమా ప్రమోషన్స్‌ మొదలు పెట్టారు, జులై 18న సినిమా విడుదల కాబోతుంది. అయినా ఇప్పటి వరకు జనాల్లో పెద్దగా హడావిడి, సినిమా గురించి చర్చ మాత్రం లేదు. కొత్త వారితో రూపొందించిన సినిమాకు ఆషికి వంటి నోటెడ్‌ టైటిల్‌ను పెట్టి ఉంటే కచ్చితంగా పాజిటివ్‌ బజ్‌ క్రియేట్‌ అయ్యి ఉండేది. మినిమం ఓపెనింగ్స్ దక్కి సినిమా బాగుంటే మంచి వసూళ్లు నమోదు అయ్యేవి అంటూ పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

హిట్‌ మూవీ ప్రాంచైజీ కాదు అంటే సైయారా సినిమాను ఎవరు చూస్తారు అంటూ సోషల్‌ మీడియాలో నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు. బాలీవుడ్‌ మీడియా వర్గాల వారు సైతం సైయారా టైటిల్‌ విషయమై పెదవి విరుస్తున్నారు. ఆషికి 3 కాకుండా సైయారా అనే టైటిల్‌ను పెట్టడం చాలా పెద్ద తప్పుడు నిర్ణయం అంటున్నారు. కానీ మేకర్స్ మాత్రం చాలా నమ్మకంగా ఉన్నారు. ఈ సినిమాతో అహాన్ పాండే, అనీత్‌ పద్దాలు హీరో హీరోయిన్‌గా తమ అదృష్టంను పరీక్షించుకోబోతున్నారు.