జయం రవిపై ఆర్తి పోస్ట్.. ఆర్దికం సాయం లేకుండానే..
కోలీవుడ్ నటుడు జయం రవి కొద్ది రోజుల క్రితం తన భార్య ఆర్తితో విడాకులు ప్రకటించిన విషయం తెలిసిందే.
By: Tupaki Desk | 10 May 2025 2:05 PMకోలీవుడ్ నటుడు జయం రవి కొద్ది రోజుల క్రితం తన భార్య ఆర్తితో విడాకులు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తనకు తెలియకుండానే, అనుమతి తీసుకోకుండానే విడాకుల గురించి ఆయన బహిరంగంగా ప్రకటించారని ఆర్తి కొన్ని రోజుల క్రితం సంచలన ఆరోపణలు చేశారు. ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.
అయితే జయం రవి.. గాయని కెనీషాతో రిలేషన్ షిప్ లో ఉన్నారని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. పలు వేడుకల్లో కలిసి కనిపించారు. కానీ ఆమెను తన వ్యవహారంలో లాగొద్దని చెప్పిన జయం రవి.. ఇప్పుడు మరో వేడుకలో కనిపించారు. అక్కడికి కాసేపటికే ఆర్తి రవి.. సోషల్ మీడియాలో నోట్ విడుదల చేయడం గమనార్హం.
గత సంవత్సర కాలంతో తానేం మాట్లాడలేదని చెప్పారు ఆర్తి. ఎందుకంటే తనకంటే తనకు కుమారుల ప్రశాంతతే ముఖ్యమని తెలిపారు. అందుకే ఎన్నో ఆరోపణలు భరించానని, తనవైపు నిజం లేదని కాదని పేర్కొన్నారు. నేడు వరల్డ్ అంతా కొన్ని ఫోటోలు చూసిందని, తమ విడాకుల ప్రాసెస్ ఇంకా కొనసాగుతోందని వెల్లడించారు.
"కొన్ని నెలలుగా పిల్లలు బాధ్యత నాదే. ఆయన నుంచి ఎలాంటి సపోర్ట్ లేదు. అది ఆర్థికంగా.. నైతికంగా కూడా.. ఇప్పుడు ఇంటి మ్యాటర్ లో బ్యాంక్ నుంచి సమస్య వచ్చింది. కానీ నేను మాత్రం అప్పుడు లెక్కలు చూడలేదు. ప్రేమకే విలువ ఇచ్చా. అయితే ప్రేమ విషయంలో నేను బాధపడడం లేదు" అంటూ ఆర్తి రవి రాసుకొచ్చారు.
"10, 14 ఏళ్ల వయసున్న పిల్లలకు భద్రత కావాలి. వారికి చట్టపరమైన అంశాలు తెలియవు. కానీ ఏం జరుగుతుందో తెలుసు. ఫోన్ కాల్ లిఫ్ట్ చేయడం లేదు.. మీటింగ్ క్యాన్సిల్ చేస్తున్నారు.. మెసేజెస్ కు రిప్లై ఇవ్వడం లేదు.. ఇవన్నీ గాయాలు. ఓ భార్యగా, అన్యాయానికి గురైన మహిళగా కాదు.. కేవలం పిల్లల శ్రేయస్సే లక్ష్యంగా ఉన్న తల్లిగా మాట్లాడుతున్నా" అంటూ ఎమోషనల్ అయ్యారు.
"ఇప్పుడు కూడా నేను మాట్లాడకపోతే.. వారికి ఫ్యూచర్ ఉండదు.. తండ్రి అంటే బాధ్యత.. విడాకుల వ్యవహారంలో ఫైనల్ జడ్జిమెంట్ వచ్చేవరకు.. నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ నేమ్ ఆర్తి రవి అని ఉంటుంది. నేను ఇప్పుడు ఏడవడం లేదు. అలా అని అరవడం లేదు. ఇప్పటికీ నాన్నా అని ఎప్పుడూ పిలుస్తున్న పిల్లల కోసం నిలబడ్డా" అంటూ నోట్ షేర్ చేశారు. 2009లో రవి, ఆర్తిని పెళ్లి చేసుకోగా.. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు.