Begin typing your search above and press return to search.

ఈ దెబ్బతో ఆరాధ్య ఇండస్ట్రీ ఎంట్రీ చర్చ షురూ

1980 కిడ్స్ కు అందాల ముద్దుగుమ్మ, స్టార్‌ హీరోయిన్‌, కలల రాణి అంటే అప్పట్లో ఠక్కున గుర్తుకు వచ్చే పేరు ఐశ్వర్య రాయ్‌

By:  Tupaki Desk   |   4 March 2024 9:32 AM GMT
ఈ దెబ్బతో ఆరాధ్య ఇండస్ట్రీ ఎంట్రీ చర్చ షురూ
X

1980 కిడ్స్ కు అందాల ముద్దుగుమ్మ, స్టార్‌ హీరోయిన్‌, కలల రాణి అంటే అప్పట్లో ఠక్కున గుర్తుకు వచ్చే పేరు ఐశ్వర్య రాయ్‌. దాదాపు రెండు దశాబ్దాల పాటు ఐశ్వర్య రాయ్ తన అందంతో మెప్పించింది. ఇప్పటికి కూడా వరుస సినిమాలు చేస్తూ తన స్టార్ డమ్ కాపాడుకుంటూ వస్తోంది.

ఐశ్వర్య రాయ్ 2007 లో అభిషేక్ బచ్చన్ ను వివాహం చేసుకుని 2011 లో ఆరాధ్య కు జన్మనిచ్చింది. ఇన్నాళ్లు ఆరాధ్య ఎక్కడ కనిపించినా కూడా చిన్న పాప, క్యూట్‌ పాప అన్నట్లుగానే అంతా చూస్తూ వచ్చారు. బేబీ కట్టింగ్ తో ఇన్ని రోజులు కనిపించి చిన్నారి అనిపించుకున్న ఆరాధ్య బచ్చన్ ఇప్పుడు పెద్ద అమ్మాయిగా మారింది.

హెయిర్ స్టైల్ మార్చడం ద్వారా ఇప్పుడు ఆరాధ్య చిన్న పాప అనే అభిప్రాయం పోయింది. కొత్త హెయిర్‌ స్టైల్‌ తో పాటు, ఐశ్వర్య అప్పట్లో ఎలా ఉందో అలాగే ఉండటంతో కొత్త ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి. అంబానీ వారి ఇంట జరుగుతున్న ప్రీ వెడ్డింగ్‌ ఈవెంట్స్ లో తల్లి ఐశ్వర్య తో కలిసి ఆరాధ్య బచ్చన్‌ పాల్గొంది.

ఆ సమయంలో కెమెరా మెన్స్ దృష్టి అంతా కూడా ఆరాధ్య పైనే ఉంది. ఇంత తక్కువ సమయంలోనే ఆరాధ్య లో ఎంత మార్పు వచ్చింది అన్నట్లుగా వారు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్లు చిన్నారి అనుకున్న ఆరాధ్య పెద్ద అమ్మాయి అయ్యింది.. కనుక ఇండస్ట్రీ ఎంట్రీ గురించి చర్చ జరిగే అవకాశాలు ఉన్నాయి.

సాధారణంగా స్టార్ కిడ్స్ ఇండస్ట్రీ ఎంట్రీ గురించి అదుగో ఇదుగో అంటూ పుకార్లు షికార్లు చేస్తూ ఉంటాయి. అమితాబచ్చన్ మనుమరాలు, ఐశ్వర్య రాయ్ కూతురు అవ్వడం వల్ల సహజంగానే ఆరాధ్య యొక్క ఇండస్ట్రీ ఎంట్రీ గురించి చర్చ షురూ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

ఇప్పటి వరకు ఆరాధ్య భవిష్యత్తు ప్రణాళిక గురించి ఐశ్వర్య లేదా, అభిషేక్ లు మీడియా ముందు చెప్పలేదు. అయినా కూడా ఆమె హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుంది.. ఎంట్రీ ఇవ్వాల్సిందే అంటూ ఇప్పటికే అభిమానులు సోషల్‌ మీడియాలో చర్చ మొదలు పెట్టారు. ముందు ముందు ఆరాధ్య సినిమా ఎంట్రీ గురించి పుకార్లు కూడా షికారు చేసే అవకాశాలు ఉన్నాయి.