Begin typing your search above and press return to search.

అల్ల‌రోడు 'ఆ ఒక్క‌టి అడ‌క్కు'

ఈ చిత్రం ఈ వేసవిలో విడుదలకు సిద్ధమవుతోంది. మేకర్స్ ఈ రోజు ఒక కామెడీ వీడియో తో విడుదల తేదీని ప్రకటించారు. మే 3 సినిమా విడుదల కానుంది.

By:  Tupaki Desk   |   15 April 2024 5:37 PM GMT
అల్ల‌రోడు ఆ ఒక్క‌టి అడ‌క్కు
X

టైటిళ్ల‌తోనే గొప్ప మ్యాజిక్ చేసేవాడు ఈవీవీ. ప‌రిశ్ర‌మ‌లోని అంద‌రూ హాస్య న‌టుల‌కు అవ‌కాశాలు క‌ల్పించిన గొప్ప హృద‌యం ఉన్న ద‌ర్శ‌కుడిగా వెలిగిపోయాడు. సీనియ‌ర్ దర్శ‌కుడు ఈవీవీ వెళ్లిన త‌ర్వాత ఇక మ‌ళ్లీ అలాంటి కామెడీ సినిమాల టింజ్ క్యాంపెయిన్ ఉన్న‌ ద‌ర్శ‌కుడు రాలేదు. ఈవీవీ వార‌సుడు అల్ల‌రి న‌రేష్ ఇంకా ఆ స్టైల్‌ని చూపించాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నాడు. తండ్రి ఈవీవీకి వార‌సుడిగా టైటిళ్ల‌ను అదేవిధంగా ఎంపిక చేసుకుంటూ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తున్నాడు.

న‌రేష్ న‌టించిన పూర్తి వినోదాత్మ‌క చిత్రానికి 'ఆ ఒక్కటి అడక్కు' అనే టైటిల్ పెట్టుకుని అంద‌రి దృష్టిని ఆక‌ర్షించాడు. ఇది ఈవీవీని మ‌రోసారి గుర్తు చేసింది. టైటిల్ నిజానికి పాజిటివిటీని పెంచింద‌ని చెప్పాలి. ఈ చిత్రం ఈ వేసవిలో విడుదలకు సిద్ధమవుతోంది. మేకర్స్ ఈ రోజు ఒక కామెడీ వీడియో తో విడుదల తేదీని ప్రకటించారు. మే 3 సినిమా విడుదల కానుంది.

మేం కొంచెం ఆలస్యంగా వస్తున్నప్పటికీ పూర్తి వినోదాత్మ‌క కంటెంట్ తో వ‌స్తున్నామ‌ని హామీ ఇస్తున్నాము అని అల్లరి నరేష్ వీడియోలో ప్రామిస్ చేసాడు. న‌రేష్ బాడీ లాంగ్వేజ్ ప్ర‌త్యేకంగా క‌నిపిస్తోంది. అతడి స‌ర‌స‌న అందాల ఫ‌రియా మ‌రింత అద‌న‌పు బూస్ట్ అని చెప్పాలి.

ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్ నవ్వులు పూయించింది. థియేట‌ర్ల‌లోను మోత మోగిపోవ‌డం ఖాయ‌మ‌న్న భ‌రోసానిచ్చింది. ముఖ్యంగా ఫరియా అబ్దుల్లా అందం న‌ట‌న న‌రేష్ కి అద‌న‌పు బ‌లం అన‌డంలో సందేహం లేదు. ఈ చిత్రానికి చిలకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మల్లి అంకం దర్శకత్వం వహించారు. అతిపెద్ద థియేటర్ చైన్‌లలో ఒకటైన ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ LLP ఆంధ్ర‌ప్ర‌దేశ్ -TS థియేట్రికల్ హక్కులను కొనుగోలు చేసింది.

ఈ చిత్రానికి సూర్య సినిమాటోగ్రాఫర్ కాగా, గోపీ సుందర్ సంగీత దర్శకుడు. ప్ర‌స్తుతం రిలీజ్ ముంగిట ప్ర‌చారం హోరెత్తుతోంది. న‌రేష్‌కి ఒక మంచి హిట్టొస్తుంద‌ని అంతా ఆశిస్తున్నారు. దీనికి కాల‌మే స‌మాధానం చెబుతుందేమో!