Begin typing your search above and press return to search.

ఆ ఒక్కటి అడక్కు టీజర్.. ఫారియా ట్విస్టులో నరేష్ కన్ఫ్యూజన్!

ఇక ఆలోపు మళ్ళీ ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం, ఉగ్రం సినిమాలతో కాస్త కొత్తగా ట్రై చేసినప్పటికీ సక్సెస్ అయితే రాలేదు

By:  Tupaki Desk   |   12 March 2024 12:20 PM GMT
ఆ ఒక్కటి అడక్కు టీజర్.. ఫారియా ట్విస్టులో నరేష్ కన్ఫ్యూజన్!
X

కామెడీ సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్టార్ ఇమేజ్ ను సంపాదించుకున్న అల్లరి నరేష్ వరుసగా ఫ్లాప్స్ రావడంతో మళ్లీ కొత్త తరహా దారిలోకి వెళ్లి సక్సెస్ అందుకున్నాడు. 2021 లో అతని నుంచి వచ్చిన నాందీ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకోవడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద కూడా మంచి లాభాలను అందించింది. ఇక మొత్తానికి అల్లరి నరేష్ మళ్లీ బౌన్స్ బ్యాక్ అయ్యాడు అని అందరూ అనుకున్నారు.

ఇక ఆలోపు మళ్ళీ ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం, ఉగ్రం సినిమాలతో కాస్త కొత్తగా ట్రై చేసినప్పటికీ సక్సెస్ అయితే రాలేదు. ఇక ఇప్పుడు అతను ఆ ఒక్కటి అడక్కు అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. గతంలో పూర్తిస్థాయిలో కామెడీ సినిమాలతో మినిమం సక్సెస్ అందుకుంటూ వచ్చిన నరేష్ మళ్ళీ అదే రూట్లో సక్సెస్ కొట్టాలని చూస్తున్నాడు.

కంటెంట్ విషయంలో జాగ్రత్తలు తీసుకొని ఈ సినిమాతో రాబోతున్నట్లు చెబుతున్నాడు. ఇక టీజర్ ను రీసెంట్ గా విడుదల చేశారు. 25 రోజుల్లో పెళ్లి జరగకపోతే అతను జీవితాంతం బ్రహ్మచారిగా ఉండిపోవాల్సి వస్తుంది రఘు బాబు డైలాగ్ తో అసలు కథ స్టార్ట్ అవుతుందని అర్ధమవుతుంది. ఇక అతనికి ఎలాగైనా పెళ్లి చేయాలని కుటుంబ సభ్యులు ప్రయత్నిస్తూ ఉండడం.

ఇక మరొకవైపు చుట్టుపక్కల వారు కూడా అల్లరి నరేష్ పెళ్లి ఎప్పుడు అని విసిగిస్తూ ఉండడంతో అతను కోపంతో కొట్టడం వంటి అంశాలు హైలెట్ అవుతున్నాయి. పక్కనే వెన్నెల కిషోర్ కూడా ఒక కామెడీ క్యారెక్టర్ తో కనిపించబోతున్నట్లు అర్థమవుతుంది. ఇక కాస్త యాక్షన్ టచ్ కూడా ఇచ్చిన అల్లరి నరేష్ మరో లవ్ యాంగిల్ ను కూడా ఇందులో చూపించబోతున్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమాలో అతనికి జోడిగా ఫారియా అబ్దుల్లా నటిస్తోంది. ఇక ఆమెతో అతని అనుబంధం ప్రేమగా మారినప్పటికీ ఆమె మాత్రం పెళ్లి చేసుకోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వదు. మీకు ఓకే అయితే పెళ్లి చేసుకుంటాను అనే మాట చెప్పగానే ఆ ఒక్కటి అడక్కు అంటూ అల్లరి నరేష్ కు ట్విస్ట్ ఇస్తుంది. ఇక అందుకు కారణం ఏంటి? అసలు పాయింట్ తో కామెడీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా ఉండిపోతున్నట్లు తెలుస్తోంది.

టీజర్ చూస్తుంటే రెగ్యులర్ కామెడీ యాంగిల్ లోనే సినిమా ఉన్నట్లు అనిపిస్తుంది. టైటిల్ తగ్గట్టుగా సినిమాలో ఏదైనా కొత్త పాయింట్ ఉంటే జనాలకు కనెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అయితే మొదట టీజర్ తోనే గట్టిగా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తే బాగుండేది. నార్మల్ టాక్ వచ్చినా ఈ రోజుల్లో సినిమాలకు కలెక్షన్లు పెద్దగా రావడం లేదు. ప్రమోషన్స్ తో ఎంతో కొంత ఎట్రాక్ట్ చేస్తేనే ఓపెనింగ్స్ వస్తున్నాయి. ఇక సినిమాకు రిలీజ్ డేట్ కూడా ముఖ్యం. మరి అల్లరి నరేష్ ఆ ఒక్కటి అడక్కు అనే సినిమాతో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి. మల్లి అంకం దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను రాజీవ్ చిలక నిర్మిస్తున్నారు.