Begin typing your search above and press return to search.

సూపర్ స్టార్‌ కి తీవ్ర నిరాశ..!

తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ లాల్ సింగ్ చద్దా కోసం దాదాపు దశాబ్ద కాలం పాటు కష్టపడ్డాం.

By:  Tupaki Desk   |   12 Feb 2024 6:30 AM GMT
సూపర్ స్టార్‌ కి తీవ్ర నిరాశ..!
X

బాలీవుడ్ సూపర్‌ స్టార్‌ అమీర్ ఖాన్ గత చిత్రం లాల్ సింగ్ చద్దా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. అమీర్ ఖాన్ గత చిత్రాలు సునాయాసంగా వందల కోట్ల వసూళ్లు నమోదు చేసిన దాఖలాలు ఉన్నాయి. కానీ లాల్ సింగ్ చద్దా మాత్రం మినిమం వసూళ్లు కూడా దక్కించుకోలేక పోయింది.

అద్వైత్ చందన్ దర్శకత్వంలో రూపొందిన లాల్ సింగ్ చద్దా లో అమీర్ ఖాన్‌ తో పాటు కరీనా కపూర్‌ ఖాన్‌, నాగ చైతన్య, మోనా సింగ్ లు కీలక పాత్రల్లో నటించారు. హాలీవుడ్‌ మూవీ ఫారెస్ట్‌ గంప్ కు ఇది రీమేక్ గా రూపొందిన విషయం తెల్సిందే. ఇండియన్ ప్రేక్షకులకు లాల్ సింగ్‌ చద్దా ను కనెక్ట్‌ అయ్యేలా తీయడంలో మేకర్స్ విఫలం అయ్యారు.

తాజాగా ఆ సినిమా ఫ్లాప్ పై అమీర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావు స్పందించారు. ఆమె ఈ ప్రాజెక్ట్‌ ప్రొడక్షన్ లో అత్యంత కీలక భాగస్వామిగా వ్యవహరించారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ లాల్ సింగ్ చద్దా కోసం దాదాపు దశాబ్ద కాలం పాటు కష్టపడ్డాం. సినిమా ఫలితం తర్వాత అమీర్ తీవ్ర నిరాశకు లోనయ్యారు.

ఓటీటీ లో స్ట్రీమింగ్‌ తర్వాత కాస్త పాజిటివ్‌ టాక్ వచ్చింది. అయితే ఈ సినిమా వసూళ్లను కొంత అమీర్ ఖాన్‌ గత వ్యాఖ్యలు కూడా ప్రభావితం చేశాయి అనేది కొందరి అభిప్రాయం. మొత్తానికి లాల్ సింగ్ చద్దా అన్ని విధాలుగా అమీర్ ఖాన్‌ ను తీవ్రంగా నిరాశ పరిచింది అంటూ కిరణ్ రావు పేర్కొన్నారు. అమీర్‌ ఖాన్‌ తిరిగి పూర్వ వైభవం సాధించడం ఖాయం అని అభిమానులు నమ్మకంగా ఉన్నారు.