Begin typing your search above and press return to search.

అమీర్ ఖాన్ కి పోటీగా యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్!

ఇటీవ‌లే దాదాసాహెబ్ ఫాల్కే పాత్ర కోసం అమీర్ ఖాన్- ఎన్టీఆర్ పోటీ ప‌డుతున్న‌ట్లు వార్త‌లొచ్చాయి.

By:  Tupaki Desk   |   19 May 2025 11:30 PM
అమీర్ ఖాన్ కి పోటీగా యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్!
X

ఇటీవ‌లే దాదాసాహెబ్ ఫాల్కే పాత్ర కోసం అమీర్ ఖాన్- ఎన్టీఆర్ పోటీ ప‌డుతున్న‌ట్లు వార్త‌లొచ్చాయి. ఫాల్కే జీవితాన్ని ఇద్ద‌రు వేర్వేరు ద‌ర్శ‌కుల‌తో చేస్తున్న‌ట్లు ప్ర‌చారంలోకి వ‌చ్చింది. కానీ అందులో నిజం లేద‌ని కొన్ని గంట‌ల్లోనే తేలిపోయింది. అమీర్ ఖాన్ చిత్ర బృందం మాత్ర‌మే ఫాల్కే కుటుంబీకుల్ని క‌లిసి అనుమతులు తీసుకున్న‌ట్లు అధికారికంగా ప్ర‌క‌టించ‌డంతో రేసులో ఎన్టీఆర్ లేడ‌ని తేలిపోయింది.

అయితే తాజాగా అమీర్ ఖాన్ తో ఎన్టీఆర్ మ‌రో ర‌క‌మైన పోటీకి దిగుతున్న‌ట్లు క‌నిపిస్తుంది. ఇటీవ‌లే అమీర్ ఖాన్ మ‌హాభార‌తంలో శ్రీకృష్ణ పాత్ర పోషించాల‌ని ఉంద‌ని ఓపెన్ అయ్యారు. త‌న‌కు ఎప్ప‌టి నుంచో ఉన్న డ్రీమ్ రోల్ గా చెప్పుకొచ్చారు. రైటింగ్ ప‌నులు కూడా మొద‌లైన‌ట్లు తెలిపారు. ఆ చిత్రాన్ని ఎవ‌రు టేక‌ప్ చేస్తున్నారు? అన్న‌ది చెప్ప‌లేదు గానీ జ‌రుగుతోన్న తాజా ప‌రిస్థితిని వెల్ల‌డించారు.

అయితే ఇదే కృష్ణ పాత్ర‌పై ఎన్టీఆర్ కూడా ఆస‌క్తిగా ఉన్న‌ట్లు తేలింది. త‌న డ్రీమ్ రోల్ ఏది? అంటే తార‌క్ శ్రీకృష్ణ పాత్ర అంటూ చెప్పుకొచ్చాడు. ఎప్ప‌టికైనా ఆ పాత్ర పోషించాల‌ని ఉంద‌ని..రాజ‌మౌళి మ‌హా భార‌తం తీసుకుంటే ఆ ఛాన్స్ త‌న‌కే వ‌స్తుంది? అన్న ధీమాని వ్య‌క్తం చేసాడు. దీంతో కృష్ణా పాత్ర విష‌యం లో మ‌రోసారి ఇద్ద‌రు హీరోల మ‌ధ్య పోటీ మొద‌లైన‌ట్లు అయింది. మ‌హా భార‌తం తీయాల‌ని రాజ‌మౌళికి మ‌నసులో ఉంది.

ఓపెన్ గా విష‌యాన్ని కూడా చెప్పాడు. కానీ అదెప్పుడు జ‌రుగుతుందో తెలియ‌దన్నాడు. ద‌ర్శ‌కుడిగా ఇంకాస్త రాటు దేలిన త‌ర్వాత తెర‌క్కించాల‌నే ఆలోచ‌నైతే బ‌య‌ట‌ప‌డింది. అలాగ‌ని మ‌రో ప‌దేళ్ల త‌ర్వాత తీస్తానంటే కుద‌ర‌దు. ఎస్ ఎస్ ఎంబీ 29 తర్వాతే అది మొద‌ల‌వ్వాలి. లేదంటే అమీర్ ఖాన్ ఆ చిత్రాన్ని ముందే ప‌ట్టాలెక్కించే అవ‌కాశం ఉంది. సంజ‌య్ లీలా భ‌న్సాలీ, నితీష్ తివారీ లాంటి వారు ఎంట‌ర్ అయితే మ‌హాభార‌తం నెక్స్ట్ లెవల్లో ఉంటుంది.