పెద్ద హీరోని వెనక్కి నెట్టిన పాపులర్ నటి
మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ నటించిన సినిమా వస్తోంది అంటే అభిమానుల్లో ఉండే క్యూరియాసిటీ వేరు.
By: Tupaki Desk | 4 Jun 2025 3:00 AM ISTమిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ నటించిన సినిమా వస్తోంది అంటే అభిమానుల్లో ఉండే క్యూరియాసిటీ వేరు. ఖాన్‌ల త్రయంలో కీలక నటుడిగా అతడికి అసాధారణ ఫాలోయింగ్ ఉంది. అమీర్ ప్రస్తుతం `తారే జమీన్ పార్` సీక్వెల్ `సితారే జమీన్ పర్` రిలీజ్ ప్రమోషన్స్‌లో బిజీ బిజీగా ఉన్నారు. జూన్ 20న ఈ చిత్రం థియేటర్లలోకి విడుదల కానుంది.
అయితే సరిగ్గా `సితారే జమీన్ పార్` రిలీజైన వారాని(27 జూన్)కి సీనియర్ నటి కాజోల్ నటించిన హారర్ థ్రిల్లర్ `మా` విడుదలకు సిద్ధమవుతోంది. ఈ రెండు సినిమాల్లో క్రేజ్ దేనికి ఎక్కువ ఉంది? అంటే.. కచ్ఛితంగా కాజోల్ సినిమాకి హైప్ ఎక్కువగా ఉంది. సితారే జమీన్ పార్ క్లాస్ ఆడియెన్ ని మెచ్చే అంశాలతో డిఫరెంట్ కంటెంట్ తో రూపొందగా, కాజోల్ `మా` హారర్ జానర్ లో మాస్ క్లాస్ అన్ని వర్గాలకు చేరువయ్యేందుకు అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ రెండు సినిమాల ట్రైలర్లు వెబ్‌లో దూసుకెళ్లాయి. ఈ సినిమాలకు ఓటింగ్ ద్వారా ఐఎండిబి రేటింగ్ కూడా ఇచ్చింది. కాజోల్ సినిమాకి 16.9 శాతం ఓటింగ్ దక్కగా, అమీర్ సినిమాకి కేవలం 11.9 శాతం రేటింగ్ మాత్రమే దక్కింది.
ఇది ప్రేక్షకుల్లో ఆసక్తికి నిదర్శనంగా కనిపిస్తోంది. అమీర్ ఖాన్ కచ్ఛితంగా మాస్టర్ క్లాస్ కంటెంట్ ని ఎంపిక చేసుకుని ఆడియెన్ కి కనెక్ట్ చేసేందుకు ప్రయత్నిస్తుండగా, రెగ్యులర్ మాస్ కి కనెక్టయ్యే కంటెంట్ తో కాజోల్ సినిమాని రూపొందించారు. ఈ నెలలో ఈ రెండు సినిమాల ఫలితాలను తెలుసుకునేందుకు ప్రజలు ఆసక్తిగా ఉన్నారు.
